గ్రహణం రోజు శ్రాద్ధ విధులు

యది!సూర్యస్యగ్రస్తాస్తమయః.
తదా! శాస్త్రతోముక్తింవిజ్ఞాయ. స్నాత్వా.... " రాత్రౌఏవ శ్రాధ్ధంకుర్యాత్"

 రాత్రియందు శ్రాద్ధం ఆచరించడం విశేష పుణ్యం అని కొందరు ఋషులు చెప్పియున్నారు....

చంద్రసూర్యగ్రహేయస్తు శ్రాద్ధం విధివదాచరేత్ ! 
తేనైవ సకలా పృథ్వీ దత్తా విప్రస్య వైకరే !! 
(ఋష్యశృంగ వాక్యం) 
గ్రహణం రోజు గనుక శ్రాద్ధం వస్తే ఆరోజే ఆ సమయంలో ఆచరిస్తే బ్రాహ్మణుడికి భూమి మొత్తం దానం చేసిన ఫలితం కర్తకి వస్తుంది అని అన్నాడు.... 
ఇలా చాలామంది అన్నారు.... 
అపరార్కుడు, సుమంతుడు, విజ్ఞానేశ్వరుడు, వ్యాఘ్రపాదుడు మొదలగు పండితోత్తములు మరియు మదన పారిజాతం, వాయుపురాణం, వృద్ధ వసిష్టోక్తి, కాలాదర్శం లాంటి పురాణ గ్రంధాలలో కూడా చెప్పియున్నారు.... 

✔️ *ఆపస్తంబుడు మాత్రం శ్రాద్ధ భోక్తకి భోజనం చేయడం దోషం అని, అలా చేస్తే మళ్లీ పురుషజన్మ ఎత్తడు అని చెప్పాడు.... 
కర్తకి దోషంలేదు....

సూతకే మృతకే భుంక్తే గృహీతే శశిభాస్కరే ! ఛాయాయాం హస్తినశ్చైవ న భూయ: పురుషో భవేత్ !!
=======================

మనము ఏవిషయం తీసుకున్నా.... రెండుమూడు రకాలుగా ప్రమాణాలు దొరుకుతాయి....

అవి అవగాహన.... పూర్వపు పెద్దల ఆచరణ....
ప్రస్తుతం ఆరోగ్యరీత్యా కర్తా భోక్తలకూ ఉన్న ఇబ్బంది... ఇవన్నీ సమన్వయం చేసుకుని.... ఓ మార్గంలో వెళ్ళాలి కదా?
===========================
దర్శ తర్పణం యథావిధిగా పదిన్నరలోపు ఆచరించుకోవలెను.... 
దర్శశ్రాద్ధం పెట్టదలుచుకున్నవారు అపక్వములతో పెట్టుట అనేది స్మృతికౌస్తుభాదుల సమ్మతమైన విషయం.... 

ప్రత్యాబ్దిక తిథి ఆచరించు వారు
మాత్రం భొక్తలు దొరికినయడల రాత్రికి ముక్తిస్నానం చేసినపిమ్మట 
శ్రాధ్ధం మొత్తం యథావిధిగా 
ఆచరించవలసియుండును....
లేదా? మరునాడు అనేది కూడా? క్రింద పంపడం జరిగింది....👇

 నిత్యభోజన ప్రత్యాబ్దికాదులు :- 
ఉదయము భోజనము చేయరాదు.... 
బాల, వృద్ధాదురులు మంగళవారము ఉదయము ||గం|॥ 9-00లోగా భుజింపవలెను....
గ్రస్తాస్తమయ గ్రహణమైనందున 

సంధ్యాకాలేయదారాహు గ్రసతే శశి భాస్కరౌ|
తదాహం నైవభుంజీత రాత్రావపి కదాచన"

అను ప్రమాణాను సారము బుధవారము శుద్ధబింబ దర్శనానంతరము నిత్యభోజన ప్రత్యాబ్దికములాచరింపవలెను........... 

ప్రత్యాబ్దికము గ్రహణమోక్షానంతరమే అన్న శ్రాద్ధము చేయవలెనని మదనరత్న కారికావృత్తి వాక్యమున్నప్పటికీ కర్తకూ, భోక్తకూ దోషము చెప్పబడినందున కర్త హిరణ్య శ్రాద్ధము చేసి 

"గ్రస్తేవేవాస్త మానంతు రవీందూ ప్రాప్నుతోయది ప్రత్యబ్దంతు తదాకార్యం పరేహన్యేవ సర్వదా"

అను ప్రమాణమునను సరించి బుధవారము శుద్ధబింబదర్శనానంతరము ప్రత్యబ్దిక అన్న శ్రాద్ధమును ఆచరింపవలెను....

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12