సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఫలితాలు
శ్లో
అర్కగ్రహాంతుశశినో గ్రహణం యది ధృశ్యతే తతోవిప్రాః
నైక్రతుఫలభాజో భవంతి ముదితాః ప్రజాశ్చైవ
తా॥ సూర్యగ్రహణము సంభవించిన పదిహేను దినములకు చంద్రగ్రహణము సంభవించిన బ్రాహ్మణులు అనేక యజ్ఞయాగాదులు చేసి వాని ఫలములను పొందుదురు, సుఖ శాంతి సంతోషములతో నుందురు.🙏🌹🙏
▬▭▬▭▬▭▬▭▬▭▬▭
శ్లో: సోమగ్ర నివృత్తే పక్షాంతే యదిభవేత్ గ్రహోర్కస్య తత్రానయః ప్రజానాం దంపత్యోర్వైరమన్యోన్యమ్
తా|| చంద్రగ్రహణము తదుపరి 15 దినములలోగా సూర్య గ్రహణమేర్పడినచో ప్రజలకు దుశ్శాసనము. దంపతుల మధ్య అన్యోన్యతా లోపమునూ గలగును.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭
కాంభోజ చీన యవనాన్ శల్య హృద్భి
ర్బాహ్లిక సింధు తటవాసిజనాంశ్చహంత్యాత్
ఆనర్తపౌండ్ర భిషజశ్చ తథా కిరాతాన్
ధృష్టే zసురో zశ్వయుజి భూరి సుభిక్ష కృశ్చ
తా॥ ఆశ్వీయుజ మాసమున గ్రహణము వచ్చినచో కాంభోజ, చైనా యవన,
తురక దేశముల వారునూ, శల్యచికిత్సకులు (ఎముకలనిపుణులు) బాహ్లిక, సింధు నదీతట ప్రదేశవాసులకునూ, ఆనర్త, పౌండ్ర, వాసులకు వైద్యులకు, కిరాతకులకు నాశనమును గలిగింతురు. అయితే ఈగ్రహణమువలన లోకమునకు సుభిక్షములుగలుగును.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭
*శ్లో: దివాచంద్రగ్రహో రాత్రౌ సూర్య పర్వం న పుణ్యజమ్!*
*సన్ధిస్థం పుణ్యదం జ్ఞేయం యావద్దర్శనగోచరమ్!!*
పగలు చంద్రుని, రాత్రి సూర్యుని గ్రహణమైన పుణ్యప్రదము కాదు.
పగలు రాత్రి సంధిలో గ్రహణము కనిపించిన పుణ్యప్రదమగును. 🙏
▬▭▬▭▬▭▬▭▬▭▬▭
Comments
Post a Comment