శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం,

*ఓంశ్రీమాత్రే నమః*

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం, దేవీ శక్తి ప్రతి రూపం హైందవము ఆధారితమైన ఒక పవిత్రమైన యంత్రం. దీని  నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య దేవత అయిన శ్రీ  లలితా దేవి లేక శ్రీ  త్రిపుర సుందరి దేవి  నామ  దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ

అధోముఖంగా ఉండి  స్త్రీ శక్తిని  సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమమును సూచిస్తుంది. 

ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం (Navayoni Chakra) అని లేదా నవ చక్రం (Nava Chakra) అని కూడా పిలుస్తారు.

భూప్రస్తారం: రేఖాచిత్రం వలె ద్విమితీయం (two-dimensional)గా ఉంటుంది.

మేరు ప్రస్తారం:- పిరమిడ్ వలె త్రిమీతీయంగా (three-dimensional)గా నిర్మాణించబడితే, (మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని అంటారు.

శ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు. బయటి నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీ చక్ర భాగాలు-

మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారము - త్రైలోక్య్య మోహనం లేదా భూపం
పదహారు రేకులు గల వృత్తము - సర్వ ఆశా పరిపూరకము
ఎనిమిది రేకులు గల వృత్తము - సర్వ సంక్షోభనము
పధ్నాలుగు చిన్న త్రిభుజాలు - సర్వ సౌభాగ్యదాయకము
పది చిన్న త్రిభుజాలు - సర్వ అర్థసాధకాలు
పది చిన్న త్రిభుజాలు - సర్వ రక్షకాలు
ఎనిమిది చిన్న త్రిభుజాలు - సర్వ రోగహరింపులు
మధ్యనున్న ఒక త్రిభుజం - సర్వ సిద్ధిప్రద
బిందువు - సర్వ ఆనందమయి

వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారాలు ఉంటాయి.

బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి

ఎరుపు - అండము
తెలుపు - వీర్యము
రెండిటి కలయిక - శివశక్తుల సంగమము. ఈ సంగమమే శ్రీ చక్ర కారకము.

వామకేశ్వరము రెండవ భాగమైన యోగినీ హృదయలో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడింది.

స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి సంయోగము తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము
మహోన్నతమైన స్త్రీ శక్తి స్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము పొందినది. దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగింది. ఈ ప్రకంపనలతో శూన్యమును పోలిన విసర్గ వలె చైతన్య స్థితిలో బిందువు ఉద్భవించింది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనే సముద్రము అవతరించింది. ఇదే ముగ్గురు అమ్మల మూలపుటమ్మ.

చక్రంలో బైందవము (బిందువు)కి మూడు రూపాలు ఉన్నాయి. ధర్మము, అధర్మము మరియు ఆత్మ. మాత్రి, మేయము మరియు ప్రమము. నవయోని చక్రము చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.

శివశక్తుల సంయోగమే శ్రీ చక్రం. ఈ చక్రం మధ్యలో బిందువైన బీజము నుండి సమస్తలోకాలు, భూతాలు పుట్టినవి. కనుక శ్రీ చక్రము సమస్త కామిత ఫలము. ఆదియందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్క శాస్త్రం చొప్పున 64  శాస్త్రములుగా  చెప్పాడు.

కామ్యములన్నింటిని పొందుటకు 64 తంత్రములను పూజించుట కష్ట  సాధ్యమని పరమేశ్వరుని సులభమార్గం చూపించమని దేవతలు ప్రార్థించగా పరమేశ్వరుడు శ్రీవిద్యోపాసనను ప్రసాదించాడు. త్రిపురసుందరి, శ్రీ చక్రము, శ్రీ విద్యామంత్ర ఉపాసనలే శ్రీ విద్యోపాసన. దీనివల్ల సమస్త కామ్యములు లభించును. ఇందులో 12 సంప్రదాయములు ఉన్నాయి.

శ్రీ చక్రము, సహస్రారకమలము ఒకటే. బహిఃపూజలకు శ్రీయంత్రమును ఉంచి పూజిస్తారు. అంతః పూజలకు సహస్రార పద్మం. దీనిలోని బిందువు నుండే పంచభూతాలు, సమస్తం పుట్టినవి.అందుకే '''సుధాసింధోర్మధ్యే''' అని అమ్మవారిని పూజిస్తారు. దీని అర్ధం ఇది: అమృతసముద్రం మధ్యలో మణిద్వీపం ఉంది. దానిలో కల్పకోద్యానవనము. దానిలో నీపోపవనం ఉంది. దీని మధ్య చింతామణిగృహం ఉంది.‌ దీనిలో మంచంమీద పంచబ్రహ్మాకారంలో ఉన్న రత్న సింహానం మీద పరమశివుని పర్యంకం మీద చిదానందలహరి అయిన అమ్మవారు శ్రీదేవీ ఉంది. ఈమెయే శ్రీ చక్రోపాసనకు మూల దేవత.

మంత్రం శబ్దం నుండి, శబ్దము ఆలోచన నుండి పుట్టినవి. శబ్దము వల్ల శబ్ద తరంగాలు బైలుదేరుతాయి. ఈ తరంగాలు చక్రాకారంగా ఉండును. ఆయా శబ్దమును బట్టి, ఆచక్రాకారమునకు దళములు ఏర్పడును. మంత్రోచ్చారణ వల్ల శరీరములో సూక్ష్మ నాడీకూటమునందు కొన్ని స్పందనలు కలిగి అవి చక్రరూపం దాల్చును. చైతన్య రూపమును పొందిన ఈ సూక్ష్మ చక్రములు విశ్వ ప్రాణమును ఆకర్షించి శక్తివంతములగును. ఈవిధముగా శబ్దసమూహమైన మంత్రము చైతన్యవంతమై సిద్ధి ప్రదమౌను.

మానవుని వెన్నెముకలో సూక్ష్మరూపమున సుషుమ్నయనే నాడి ఉంది. ఇది నిటారుగా ఉంది. ఇదే క్రింది మానసికశక్తులకు, ఉన్నత మానసికశక్తులకు కలుపునాడి. దీనిలో 7 చక్రములున్నవి. క్రింది 5 చక్రములు పంచభూతములు. ఆభూత సంబంధమైన అక్షరములు ఆకారములు దేవతలు దాహనములు బీజాక్షరములు. మొదటిదైన ఆకాశము భూతంగల చక్రం కంఠం దగ్గర సప్తచక్రాలులలో సుషుమ్నానాడి ఉన్నది. అక్షరములలో అచ్చులు ప్రధానములు. అ, ఆ మొదలైనవి అచ్చు అక్షరములు ఈచక్రంలో ఉన్నాయి. విశుద్ధి చక్రము అంటారు.

తరువాత వాయువు అనాహత చక్రములో ఉంది. హల్లులు మొదటిదైన అక్షరము మొదలుకొని ద వరకు ఈ చక్రంలో ఉన్నాయి. దీని తరువాత అగ్నిభూతం గల మణిపూరక చక్రము దీనిలో ధ నుండి ఫ వరకు 10 అక్షరములు ఉన్నాయి. దీని క్రింద ఉన్న స్వాధిష్ఠాన చక్రములో జలభూతము బ నుండి ల వరకు 6 అక్షరములు ఉన్నాయి. 

అన్నిటికన్న క్రింద ఉన్న మూలాధార చక్రము పృధివీ భూతము వ నుండి స వరకురాత్రి మాట్లాడాను. అక్షరములున్నవి. అటుపై విశుద్ధ చక్రంపైన భ్రూస్థానం వద్ద ఆగ్నేయచక్రం ఉంది. ఆజ్ఞాచక్రంలో మనస్తత్వం, బ్రహ్మ బీజాక్షరములైన 'హ', 'క్ష' లు రెండు ఉన్నాయి. వీటితో మొత్తం 50 అక్షరములు అవును. 20X50 = 1000 అక్షరములపైన సహస్రారంలో ఉన్నాయి. మనము ఏ అక్షరమును పలికినా అ అక్షరమునకు సంబంధించిన శక్తి పుట్టును అని. శ్రీ చక్రంలో ఒక ఉద్దేశ్యము.

🕉🕉🕉🕉🕉🕉

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: