అట్లతద్దె వ్రత కథ-మహిమ:

అట్లతద్దె వ్రత కథ-మహిమ:

పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రత మహిమను తెలుసుకున్న కావేరి తన రాజ్యంలో కల తన స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి  ఈ  చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. అనంతరం మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు యుక్త వయసు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. మహారాజు తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. అయితే కావేరీకి వృద్ధులైన వారు మాత్రమే పెండ్లి కుమారులుగా రాసాగారు.

తన తండ్రి మహారాజు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది. రాజ్యాన్ని వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో  నీ దోషం లేదు.. అయితే నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయావు. దీంతో నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి  అద్దంలో చంద్రుడిని చూపించి.. నీ ఉపవాస దీక్షను విరమింపజేశారు. దీంతో నీ అట్లతద్ది వ్రత భంగం అయిందని పార్వతి పరమేశ్వరులు చెప్పారు. అయితే నీ సోదరులు నీ పై ఉన్న ప్రేమతోనే ఇలా చేసారు.. నీవు దుఃఖించవలసిందేమీ లేదని అన్నారు. రానున్న ఆశ్వయుజ బహుళ తదియనాడు "అట్లతద్ది"ని విధి విధానంగా వ్రతమాచరిస్తే. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు.

దీంతో కావేరీ అట్లతద్దిని శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించింది. అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమాలు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహం జరిగింది. ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగాలను అనుభవించింది.

పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయని నమ్మకం. మహిళలు ఈ అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి.. ఆదిదంపతుల అనుగ్రహాన్ని పొందుతారు. జయం🚩

ఈరోజు, రేపు అందరూ ఈ పరిహారం చేయండి. గోరింటాకు కానీ కోన్స్ కానీ ఆడవాళ్లకి పంచండి. అమ్మ అనుగ్రహం పొందవచ్చు 
జై శ్రీరామ.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12