సరస్వతీ నది

బద్రీనాథ్ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న " మానా " అనే గ్రామం లోని " సరస్వతి నది " ప్రవాహం ఇది...

చైనా/టిబెట్ బోర్డర్ కి దగ్గరగా ఉన్న ఈ ఊరు భారతదేశపు చివరి గ్రామం...

సరస్వతీ నది ఇక్కడ కొండలలోంచే పుడుతుంది...
ఇక్కడ వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించుకోవచ్చు ...

వ్యాసగుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా, వినాయకుడు గణేశ గుహలో కూర్చొని ఆ గ్రంధాన్ని ఇక్కడే రచించాడని ప్రతీతి...

ఈ వ్యాసగుహకు కొద్ది దూరంలో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవహించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది...

_పెద్ద శబ్దంతో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు ఆ నదిని అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు.

అంచేతే అంత ఉదృతమైన నదీ ఇక్కడ అంతర్వాహిని అయ్యి తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది...

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12