సాళ్వుడు - అనుసాళ్వుడు - సౌరంభవిమానము..................................

సాళ్వుడు - అనుసాళ్వుడు - సౌరంభవిమానము.
..............................................................

(౧) తెలుగులో సంఖ్యామానము > ఏదో ఎందుకో వ్రాశాడని ముందుకు వెళ్లోద్దు, దయచేసి చదవండి. ఈ సంఖ్యలను అంకెలరూపంలో వ్రాయండి. మీ పిల్లలచేత వ్రాయించి అభ్యాసం (ప్రాక్టీస్) చేయించండి, తెలివి జ్ఞానం రెండూ పెరుగుతాయి.

సున్న, ఏకము, దశము, సహస్రము, దశసహస్రము, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి,
 అర్భుదము, న్యర్భుదము, ఖర్వము, మహాఖర్వము, 
పద్మము, మహాపద్మము,
క్షోణి, మహాక్షోణి,
శంఖము, మహాశంఖము,
క్షితి, మహాక్షితి,
క్షోభము, మహాక్షోభము,
నిధి, మహానిధి,
పర్వతము, అత్యంతము,
పదార్థము, అనంతము,
సాగరము, అవ్యవము,
అచింత్యము, అమేయము,
భూరి, మహాభూరి.

మీలో ఎవరైనా పై సంఖ్యలను అంకెలరూపంలో వ్రాసి ఈ గ్రూపులో పెట్టగలరా !

(౨) బుుషబుడు - ఇంద్రునికి శచీదేవికి కలిగిన సంతానము. ఇతను ఇంద్రునికి రెండవ కొడుకు. మొదటి కొడుకు పేరు జయంతుడు.

(౩) కల్క్యావతారము - కలిపురుషుడు - కలిఅవతారము - విష్ణుదేవుని అవతారాలలో చివరిది. కలియుగాంతములో విష్ణువు శంబళ గ్రామంలో జన్మించి, విద్యార్థిగా నిమేషకాలములో సర్వశాస్త్రాలను సర్వవేదాలను, సమస్తయుద్ధకళలను నేర్చి, సజ్జనులను రక్షించి దుర్జనులను శిక్షిస్తాడు.

(౪ ) సాలగ్రామము - సాలగ్రామాల పుట్టుకస్థానము హిమాలయ పర్వతములలోని గండకినది. గండకినది నేపాలులో పుడుతుంది. వేలసంవత్సరాలుగా ఈ నది ప్రవహించడం వలన ఇందులోని రాళ్ళు ప్రవహవేగానికి అరిగి చిన్నచిన్న నునుపైన రాళ్ళగా మారుతాయి. ఇలాంటి శిలలనే సాలగ్రామాలంటారు. సాలగ్రామము హిందువులకు పవిత్రమైనది. విష్ణ్వాంశ సాలగ్రామంలో వుందని హిందువుల విశ్వాసము. సాలగ్రామములో విష్ణువుంటాడని విశ్వాసము. ఈ శిలారూపంలోని విష్ణువును ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు పూజిస్తారు. 

పంచాయతనములో మధ్యలో వుంచి పూజిస్తే ఆ పూజ ఆదివిష్ణువైతుంది.

 పంచాయతనమంటే ఐదు విగ్రహామూర్తులు. అంటే మధ్యన ప్రధానవిగ్రహాన్ని వుంచి చుట్టు సూర్య, గణపతి, ఈశ్వర, అమ్మవారు వంటి విగ్రహాలను వుంచి పూజించడం. ఇలా విగ్రహాలు వుంచకుండా స్పటికము మధ్యలో వుంచితే ఆదిత్య అయతనం, ఏదైనా లోహం వుంచితే అంబికాయతనము, సాలగ్రామముంచితే ఆదివిష్ణ్వాయతనం, ఎర్రరాయి వుంచితే గణనాథం, బాణముంచితే మహేశ్వరాయతనమైతుంది. కులమత భేదాలు లేకుండా ప్రతిఒక్కరు సాలగ్రామాన్ని సద్భక్తితో పూజిస్తే శుభం కలుగుతుంది.
 
(౫ ) సాళ్వుడు, అనుసాళ్వుడు - ఇద్దరు కంసుని సోదరులు. శ్రీకృష్ణుడు రుక్మిణిదేవిని పరిగ్రహించుట మరియు శ్రీకృష్ణుని చేతిలో కంసుని మరణము వలన కోపించి ప్రతీకారేచ్ఛతో సాళ్వుడు శివుని గురించి తపస్సుచేసి మాయావిద్యలు పొందుతాడు. మాయావిద్య గర్వము చేత సౌరంభమనే విమానమెక్కి యాదవులను హింసించసాగాడు. అంతట శ్రీకృష్ణుడు సాళ్వునిపై యుద్ధము చేసి వాడిని హతమారుస్తాడు.

 అన్నదమ్ములిద్దరు శ్రీకృష్ణుని చేతిలో మరణించడం చూచిన అనుసాళ్వుడు శ్రీకృష్ణుని ఎట్లైనా జయించాలని నిర్ణయించుకొన్నాడు. ధర్మరాజు చేస్తున్న అశ్వమేధయాగానికి హస్తినాపురానికి శ్రీకృష్ణుడు వస్తునాడని అనుసాళ్వుడు తెలుసుకొని ముందుగానే హస్తినాపురం చేరి ఊరిబయట ఒకచోట దాక్కున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు పాండవులు అశ్వాన్ని పరీక్షించటానికి వస్తున్నారని విని ముందుగానే ఆ యాగాశ్వాన్ని దొంగలించి పారిపోయాడు.

యాగాశ్వాన్ని దొంగలిస్తే శ్రీకృష్ణుడు యుద్ధానికి వస్తాడని వీని ఊహ. శ్రీకృష్ణ రుక్మిణిల సంతానమైన ప్రద్యుమ్నుడు 
వానిని బంధించి తెస్తానని వెళ్ళి ఓడిపోయి వచ్చాడు. తరువాత వృషకేతుడు వీనిని బంధించి తెస్తానని వెళ్ళి యుద్ధంలో విజయుడై వాడిని బంధించి శ్రీకృష్ణుని ముందు పడేశాడు. దాంతో అనుసాళ్వుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చాడు. అశ్వమేధయాగంలో సాయపడతానని వేడుకొన్నాడు. శాంతించిన శ్రీకృష్ణుడు వాడిని క్షమించి వదిలేశాడు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: