లలితా నామాలతో కార్య సాధన.

లలితా నామాలతో కార్య సాధన.


మంత్రతుల్యం అయిన శ్రీ లలితా సహస్రనామాలతో సామాన్య అవసరాలను సాధించే పద్ధతులు ఉన్నాయి. ఇవి అన్ని అనుభవంలో చేసి సరిచూసిన విధానాలు. ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చెప్పుకునే నామ వాక్యాలను ప్రతీ పర్యాయం పఠిస్తూ లలితా నామ స్తోత్రం లోని 365 పంక్తులు ప్రతీ రోజూ పారాయణ చేయాలి. నిస్సందేహంగా కార్య సిద్ది పొందగలరు. సాధన కాలం 40 రోజుల నుంచి 60 వరకూ చేయండి.

సూచన :- ఇప్పుడు చెప్పబడే సాధన పద్దతులను అనుభవం ఉన్న పండితుల వద్ద గానీ, గురువు గారి వద్ద గానీ మెలకూవలు తెలుసుకుని సాధన చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం భావ్యం కాదు. ఇవి లలితా దేవి భక్తులకు, శ్రీవిద్య ఉపాసకులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలిపిన ప్రతీ పద్దతికి సమయం, కట్టుకోవాల్సిన వస్త్రం, చేయవలసిన దీపారాధన, జప సంఖ్య, కూర్చోవాల్సిన దిశ, సంపుటీకరణ వగైరా లాంటి విషయాలు గురువు వద్ద తెలుసుకొని చేయడం మరింత ఉత్తమంగా ఉంటుంది. 

🌷 భర్తృవశీకరణ ( అనుకూలత) :- 

లలితా నామం :- 
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా |

అనే ఈ వాక్య నామాన్ని లలితా నామ స్తోత్రంలోని ప్రతి పంక్తికి అనుసంధానం చేసి పఠించాలి. అంటే 
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా - శ్రీ మాతా ...శ్రీ మత్సింహసనేశ్వరి||  
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా తర్వాత చిదగ్నికుండ సంభుత ...సముద్యత || 
ఈ విధంగా ప్రతీ వాక్యం యందు కావాల్సిన కామ్య వాక్య నామాన్ని పఠిస్తూ మొత్తం లలితా నామ పారాయణం చేయాలి. ప్రతీ రోజూ ఒక స్త్రోత్రం పాఠనం చేస్తూ నలభై రోజులు నియమం తప్పకుండా పారాయణ చేయాలి. దిని వలన ఆయా కామ్యం (కోరిక, అవసరం) నిస్సందేహంగా సిద్ధిస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు చెప్పబడే మిగిలిన సాధనలు కూడా చేయాలి. 

🌷 వివాహం కోసం :-

లలితా నామం :- 
కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా ||

ఈ నామంతో జత చేసి 365 పంక్తులను పారాయణ చేయాలి. నలభై రోజులు పారాయణ ధీక్షతో ప్రతీ రోజూ శుచిగా పారాయణ చేయాలి. పెళ్ళి కావాల్సిన కన్యలకు (వివాహ దోషాల వలన ఆలస్యం అవడం, సరిగా కుదరకపోవడం) చక్కగా పనిచేస్తుంది. మంచి సంబంధం నిశ్చయమౌతుంది.

🌷 సంతాన ప్రాప్తి కోసం :-

లలితా నామం :-
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ||

ఈ నామాన్ని పైన చెప్పిన విధంగానే 60 రోజుల నుంచి 80 రోజుల వరకు పారాయణ చేయాలి. స్త్రీల యొక్క గర్భదోషాలను పరిహరించి సత్సంతాన సిద్ది కలుగుతుంది.

🌷గుండె సంబంధిత నివారణ :-

లలితా నామం :-
అనాహ తాబ్జనిలయా శ్యామాభా వదన ద్వయా 
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థితా కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగౌదన ప్రియా మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ ||

ఈ నాలుగు వాక్యాలను ప్రతీ పర్యాయం పఠిస్తూ 365 పంక్తులను పారాయణ చేయాలి. నలభై రోజుల కాలంలో మంచి ఫలితం ఉంటుంది. 

🌷వ్యాధి నివారణ :-

లలితా నామం:-
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారణీ ||

ఈ వాక్య నామంతో అనుసంధానం చేసి లలితా నామ పంక్తుల పఠనం వల్ల వ్యాధి నివారణ, వాడుతూ ఉన్న మందులు చక్కగా వ్యాధి నయం అవడానికి అవకాశం ఎక్కువ.

🌷ఉద్యోగ ప్రాప్తి కోసం:-

లలితా నామం :-
రాజ రాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్య వల్లభా రాజత్కృపా రాజ పీఠ నివేశిత నిజాశ్రితా ||

ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో లలితా సహస్రనామ నామంతో పై తెలిపిన వాక్యాన్ని అనుసంధానం చేసి పారాయణ చేయాలి.

🌷ధన ప్రాప్తి కోసం :-

లలితా నామం :-
రాజ్యలక్ష్మీః కోశనాధా చతురంగ బలేశ్వరీ ||
పై తెలిపిన విధంగానే పారాయణ చేయాలి. 

🌷కామ్య సిద్ది ;-

లలితా నామం :-
కపర్దినీ కళామాలా కామధుక్కామ రూపిణీ ||

ఈ వాక్యంతో అనుసంధానం చేసి స్త్రోత్ర పాఠం చేయడం వల్ల వారి వారి ప్రయత్నములు అనూలించను.

🌷 పరప్రయోగ కోసం :-

లలితా నామం :- పాసహస్తా పాశహాంత్రీ పరమంత్ర విభేదినీ ||

పరప్రయోగాలు, గాలీ ధూళి వంటివి తొలగి కొంత మేర ఉపశమనం లభిస్తుంది.

🌷మోక్ష ప్రాప్తి కోసం :-

లలితా నామం :-
జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతి దాయిని ||

ఈ మంత్రాన్ని ఎటువంటి ఫలితం ఆశించకుండా సాధన చేయాలి.

శ్రీ చక్ర వాసినీ శ్రీ త్రిపుర సుందరి
సౌందర్య లహరి శ్రీ జయ మంగళం |
మాతృకావర్ణ స్వరూపిణీ మాత్రే  మామంబ పురవాసీ జయమంగళం ||

ఆనంద భైరవ ఆనంద భైరవీ
ఆధార మూలస్థిత జయమంగళం |
సమయాంబా శ్రీ సంవర్తక రూప
స్వాధిష్టాన స్థిత జయమంగళం ||

అమృతేశ్వరి శ్రీ అమృతేశ్వరీ రూప
మణిపూరాంత స్థిత జయమంగళం |
హంసేశ్వరీ శ్రీ హంసేశ్వర రూప 
అనాహతాబ్జ స్థిత శుభ మంగళం ||

వ్యోమకేశ్వరీ శ్రీ వ్యోమకేశ్వర రూప 
విశుద్థి చక్ర నిలయ జయమంగళం |
చిత్ఫరాంబా పరచిత్ రూపధర
ఆజ్ఞా చక్రాంత స్ధిత జయమంగళం ||

షట్ చక్రవాసిత శివశక్తాయుత
సహస్రార కమల స్ధిత జయమంగళం |
క్షితి హుతా నిల ఉదక వ్యోమస్వరూపథర
పంచభూతాత్మక శుభమంగళం ||

ఆద్యంత రహిత శ్రీ ఆది శివ శక్యైక
ఆనందరూప శ్రీ జయమంగళం |
సర్వజన హితకర సాంబశివ రూపధర
సాధుజన వత్సలే శుభ మంగళం ||
శ్రీచక్రవాసినీ శ్రీ త్రిపుర సుందరీ


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: