సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐

💐💐సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐

మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. 

సూతకం రెండు రకాలు.. జాతాశౌచం, మృతాశౌచం.
షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు.

సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు.  

కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును. 

మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది.

సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.

తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: