శరీరాంగములు - చంద్ర గ్రహము

శ్రీ గురుభ్యోనమః

శరీరాంగములు - చంద్ర గ్రహము

చంద్ర గ్రహము:
హృదయం, ఊపిరితిత్తులు, మనస్సు, రక్తము, ఎడమ కన్ను, మూత్ర పిండములు, అన్నవాహిక, శరీరమందలి ద్రవములు, ఆలోచనలు. 
చంద్ర గ్రహము వల్ల ఏర్పడే అనారోగ్యములు:

ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, ఎడమ కంటి యందు దోషములు, అతి నిద్ర, జడత్వము, ఆస్త్మా, విరోచనములు, రక్తహీనత, రక్తము విషతుల్యమగుట, జల సంబంధ వ్యాధులు, వాంతులు, ఉబ్బురోగము, అపెండిసైటిస్, వక్షములకు సంబంధించిన వ్యాధులు, పెరికార్డియం, నరములు, లింఫోటిక్ నాళములు, ప్రేగులకు సంబంధించినవి, కళ్ళు, ఆహారనాళము, ముంబ్రేన్ మరియు జననావయవ మూత్రకోశ వ్యాధులు, వృషణములు, వాతము, శూల నొప్పులు, క్షయ వ్యాధి, ట్యూమర్లు, దృష్టి దోషములు.

రాశుల్లో చంద్ర గ్రహము వల్ల ఏర్పడే అనారోగ్యములు

మేషం - వణుకు, మెదడులో స్రావములు ఊరుట వల్ల మెడ పక్కకు వంగుట, అతినిద్ర, కనులు బలహీనపడుట, మోకాళ్ళ నొప్పులు, జలుబు కారణంగా ఏర్పడే శిరో వ్యాధులు
వృషభం - కాళ్ల పాదాలలో నొప్పులు, వాపులు, గొంతు బలహీనపడుట.
మిధునం - కాళ్లు భుజములు హస్తములలో వాత ప్రభావం, ఒంటి నొప్పులు, అతిగా తినుట వలన ఏర్పడిన వెగటు.
కర్కాటక - కడుపులో నొప్పులు, ఆహారం వెగటు పుట్టుట, ఆటలమ్మ, శరీరం వణుకుట, తరచూ అస్వస్థత, కర్ణభేరి వాపు, ఉబ్బస రోగము.
సింహ - హృద్రోగం, గొంతు నొప్పులు, గండమాల
కన్య - ప్రేగులలో నొప్పులు మరియు వాటికి సంబంధించిన రోగములు, రక్తము మలినమగుట, రక్త దోషములు, భుజములు చేతులు బలహీన పడుట.
తుల - మూత్ర పిండాలలో దోషములు, కడుపునొప్పులు, నడుము నొప్పులు, స్త్రీ లలో రజో దోషం, తిండిపై వెగటు, రొమ్ము పడిసెం.

చంద్రుడు సూచించే గ్రంథులు:

థైరాయిడ్

గ్రహం వల్ల అనారోగ్యం ఉండే కాలం:

చంద్రుడు - 1ముహూర్తము

చంద్ర గ్రహము వల్ల దశాంతర్దశలలో ఏర్పడే అనారోగ్యములు:
1) రవి మహర్దశలో చంద్ర అంతర్దశలో విరోచనములు, జల సంబంధ రోగములు
2) చంద్ర మహర్దశలో చంద్ర అంతర్దశలో శిరో, క్షయ రోగములు.
3) కుజ మహర్దశలో చంద్ర అంతర్దశలో ప్లీహం పెరగటం, పైత్య రోగములు, మనో వైకల్యం
4) రాహు మహర్దశలో చంద్ర అంతర్దశలో జల సంబంధ వ్యాధులు, ఉదర రోగములు
5). గురు మహర్దశలో చంద్ర అంతర్దశలో గ్రహణి, జ్వర బాధ, ఉదర రోగములు.
6) శని మహర్దశలో చంద్ర అంతర్దశలో రోగ భయం, జలవాత భయం.
7). బుధ మహర్దశలో చంద్ర అంతర్దశలో శిరో వేదన, నేత్ర దోషములు, మెడ నొప్పులు, మరణ భయం.
8).కేతు మహర్దశలో చంద్ర అంతర్దశలో కర్ణ, రోగ బాధలు.
 9) శుక్ర మహర్దశలో చంద్ర అంతర్దశలో వాత పిత్త రోగములు, అన్న ద్వేషం, నేత్ర రోగములు

🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: