యోగ సిద్ధికి లలితా సహస్ర అతి రహస్యనామాలు

యోగ సిద్ధికి లలితా సహస్ర అతి రహస్యనామాలు

శ్రీ లలితా సహస్రనామాలలో 8 అక్షరాలతో వచ్చే నామాలు 240 ఉన్నాయి. ఇవి అతి రహస్య నామాలు.

ఈ 8 సంఖ్యకు చాలా విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ ప్రాధాన్యత చెప్పుకునేముందు తిధి దేవతలను గురించి తెలుసుకుందాం. శుక్ల పక్ష పాడ్యమి నుంచి దేవి కళ ప్రారంభమై కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలాపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలామాలినీ, చిత్రా అనే 15 నిత్యదేవతలు పూర్ణిమ వరకు ఆరాధించబడుదురు.

అలాగే కృష్ణ పక్షంలో వెనుకనుంచి వరుసగా చిత్రా, జ్వాలామాలినీ, సర్వమంగళా, విజయా, నీలాపతాకా, నిత్యా, కులసుందరీ, త్వరితా, శివదూతీ, మహావజ్రేశ్వరీ, వహ్నివాసినీ, భేరుండా, నిత్యక్లిన్నా, భగమాలినీ, కామేశ్వరీ అనే విధంగా చంద్రకళలు నిత్య తిధి దేవతలుగా ఉంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 దేవతలలో 8వ (శుక్ల అష్టమికి) నిత్యా దేవత త్వరితా.

అలాగే కృష్ణ పక్షంలో 8వ (బహుళ అష్టమికి) నిత్యా దేవత కూడా త్వరితే. మిగిలిన అన్ని తిధులకు వేరు వేరు నిత్యా దేవతలు ఉంటారు. కానీ శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిథులలో మాత్రం త్వరితా అనే నిత్యా దేవత మాత్రమే ఉండును. అనగా అష్టమి తిధి నాడు తిధి దేవత మారదు. 

అందుకే "అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితా"అను శ్రీ లలితా సహస్ర నామావళిలోని 15వ నామంలో 8 వ తిధి అయిన అష్టమినాడు ప్రకాశించు చంద్రుని కళవలె ప్రకాశించు తల్లి అని భావము. శుక్ల పక్షము లోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు నిత్యం చంద్రుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాడు.

కృష్ణ పక్షంలోని బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్రమ క్రమంగా చంద్రుడు క్షీణిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో మాత్రం చంద్రుడు ఒకే సైజు లోనే ఉండటం విశేషం. ఈ 8వ చంద్రకళకు విశేష ప్రాధాన్యత ఉన్నది. 

ఎనిమిది (అష్టమి అంటే ) అనగానే చాలా మంది భయపడతారు. మత్స్యపురాణంలో....

"లక్ష్మీర్మేధా ధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభా ధృతిః ఏతాభిః పాహి తనుభి రష్ఠాభిర్మాం సరస్వతీ"

అని సరస్వతి 8 విధములైన ప్రాణస్వరూపిణిగా చెప్పబడింది. "ప్రాణశక్తి సరస్వతి" అని వేదం చెప్పింది. ఈ ప్రాణశక్తి ప్రపంచమంతా వ్యాపించి 8 విధాలుగా మనల్ని రక్షిస్తున్నది. 

సరస్వతి శబ్దానికి ప్రవాహము కలది అని కూడా అర్ధము కలదు.శరీరంలో ఈ ప్రవాహ లక్షణము ప్రతి అణువు నందు ప్రసరిస్తుంటుంది.

ఇట్టి ప్రాణ స్వరూపిణిగా ఉన్న అష్టమూర్తిత్వములో లక్ష్మీ అనగా ఐశ్వర్యము, సంపద.. మేధా అనగా బుద్ధి.. ధరా అంటే ధరించునది అనగా భూమి.. పుష్టి అంటే ఇంద్రియాలకు కావలసిన శక్తి.. గౌరీ అనగా వాక్స్వరూపిణి, తుష్టి అంటే తృప్తి, ప్రభా అనగా వెలుగు, ధృతి అనగా ధైర్యమని అర్ధము. ఈ 8 శక్తులు మానవులకు సహకరించి రక్షిస్తుంటాయి. 

అలాగే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అనబడే అష్టమాతృక దేవతలు కూడా ఉన్నారు. కామాక్షి దేవిని కూడా ధరణీమయీ, భరణీమయీ, పవనమయీ, గగనమయీ, దహనమయీ, హవనమయీ, అంబుమయీ, ఇందుమయీ అనే 8 రూపాలలో ప్రార్దిస్తుంటాము.

ఇక ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవ అనే 8 పేర్లను అష్టమూర్తులుగా తెలియచేశారు.

ఇక ఈ అష్టమూర్తులకు చెందిన శక్తి అమ్మవారులే భవాని, శర్వాణి, ఈశాని, పశుపాశవిమోచనీ, రుద్రాణీ, ఉగ్రాణి, మహాదేవీ అను 8 శివుని యొక్క శక్తులు. కనుక ఈ 8 అంకెలో ఉన్నదంతా శక్తి స్వరూపిణి అయినా జగన్మాతే. 
కాబట్టి 8 అంకెలో ఉన్న జగన్మాత శక్తి స్వరూప అతి రహస్య నామాలు శ్రీ లలితా సహస్రనామావళిలో 240 ఉన్నాయి.

ఈ 240 నామాలు ఒక్కొక్కటి 8 అక్షరాలతోనే ఉంటాయి. ఒక పక్షానికి 15 తిధులు. మొత్తం 240 నామాలను 15 తిధులకు విభజించగా, ఒక్కొక్క తిధికి 16 నామాలు వస్తాయి. ఈ పరంపరలో శ్రీ చక్ర 8వ ఆవరణను సర్వసిద్ధిప్రదా చక్రము అంటారు. ఇది త్రిభుజాకారాంలో ఉంటుంది. ఒక్కోభుజానికి 5మంది దేవతలు (తిధి దేవతలు) చొప్పున మూడు భుజాలకి 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు.

ఒక్కో దేవతకు 16 నామాలు చొప్పున పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 240 నామాలు సరిపోతాయి. అలాగే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిరిగి ఇవే నామాలు పునరావృతం అవుతాయి. అయితే శ్రీ లలితా సహస్రంలోని 240 నామాలు ఏ ఏ తిధి దేవతలకు ఏ విధంగా వుంటాయో తెలుసుకుందాం.

కామేశ్వరీ - శుక్ల పాడ్యమి , అమావాస్య తిధులకు దేవత 
భగమాలినీ - శుక్ల విదియ, బహుళ చతుర్దశి తిధులకు దేవత 
నిత్యక్లిన్నా - శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిధులకు దేవత 
భేరుండా - శుక్ల చవితి, బహుళ ద్వాదశి తిధులకు దేవత 
వహ్నివాసినీ - శుక్ల పంచమి, బహుళ ఏకాదశి తిధులకు దేవత 
మహావజ్రేశ్వరీ - శుక్ల షష్టి, బహుళ దశమి తిధులకు దేవత 
శివదూతీ - శుక్ల సప్తమి, బహుళ నవమి తిధులకు దేవత 
త్వరితా - శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిధులకు దేవత 
కులసుందరీ - శుక్ల నవమి, బహుళ సప్తమి తిధులకు దేవత 
నిత్యా - శుక్ల దశమి, బహుళ షష్టి తిధులకు దేవత 
నీలాపతాకా - శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిధులకు దేవత 
విజయా - శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిధులకు దేవత 
సర్వమంగళా - శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిధులకు దేవత 
జ్వాలామాలినీ - శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిధులకు దేవత 
చిత్రా - పూర్ణిమ, బహుళ పాడ్యమి తిధులకు దేవత.

పై విధంగా ఒక్కోదేవతకు రెండు తిధులు ఉంటాయి.
ఆశ్వయిజ అమావాస్య దీపావళి రోజున మరియు రెండవ రోజు శుక్ల పాడ్యమి రోజున కామేశ్వరీ దేవతే ఉంటుంది. కనుక ఈ కామేశ్వరీ దేవతకు సంబంధించిన 16 అతిరహస్య నామాలను ప్రతి నామానికి ముందు ఓం అని, చివరన నమః అని కలుపుకోవాలి. ఇలా కలిపే సందర్భాలలో నామము 8 అక్షరాలు అయినప్పటికీ సంధితో ఉన్నందున 9 అక్షరాలుగా ఒక్కోసారి కనపడతాయి. కానీ అవి 8 అక్షరాలే అని గమనించాలి.

🕉🌞🌏🌙🌟🚩

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 5

అళికము అంటే నుదురు.

అమ్మ నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నదట.

నెలలో రెండు పక్షాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని. ఒక్కొక్క పక్షానికి పదిహేను తిథులు. వాటిని మనం వరుసగా వ్రాస్తే ఇలా ఉంటాయి.

శుక్లపక్షంలో
పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి.

అలాగే కృష్ణపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య

రెండుపక్షాల్లోనూ కూడా అష్టమి మధ్యన వస్తుంది. అటు ఏడు తిధులు, ఇటు ఏడు తిధులు.

కళాతు శోడశో భాగః అని నిర్వచనం ప్రకారం కళ అంటే పదహారవ వంతు. మరి తిథులు పదిహేనే కదా అనవచ్చును మీరు.

పౌర్ణమి చంద్రుణ్ణి షోడశకళా ప్రపూర్ణుడు అంటారు. అంటే నిండా పదహారు కళలూ ఉన్నవాడు అని. పౌర్ణమి నుండి ఒక్కొక్క తిథినాడూ ఒక్కొక్క కళ తగ్గుతుంది. అమావాస్య నాటికి ఒక్క కళ మిగులు తుంది. లేకపోతే కళలన్నీ నశించటం అంటే చంద్రుడే లేక పోవటం కదా! అందుకని అమావాస్యకు సున్నా కాదు ఒక్క కళ అన్నమాట. ఆనాటి నుండి ప్రతి తిథికి ఒక్కొక్క్ కళ చొప్పున పెరిగి మరలా పౌర్ణమి నాటికి పదహారుకళలూ పూర్తిగా సంతరించుకుంటాడు చంద్రుడు.

ఈ కళలకు విడివిడిగా పేర్లూ ఉన్నాయి. వాటికి అధిష్ఠాన దేవతలూ ఉన్నారు!

ఈ కళాదేవతలకు నిత్యలు అని పేరు. ఈ షోడశ నిత్యల నామధేయాలూ చూదాం.

కామేశ్వరి

భగమాలిని

నిత్యక్లిన్న

భేరుండ

వహ్నివాసిని

మహావజ్రేశ్వరి

శివదూతి

త్వరిత

కులసుందరి

నిత్య

నీలపతాక

విజయ

సర్వమంగళ

జ్వాలామాలిని

చిత్ర

శుక్లపక్షంలో పాడ్యమి నుండి ఆరోహణ క్రమంలో కామేశ్వరి నుండి చిత్రవరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అవరోహణ క్రమంలో చిత్ర నుండి కామేశ్వరి వరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

రెండు పక్షాల్లోనూ కూడా అష్టమి నాటి నిత్యాదేవత పేరు త్వరిత.

పదహారు కళలూ అని చెప్పి నిత్యాదేవతలను పదిహేను మందినే చెప్పారేం అని మీరు ప్రశ్న వేయవచ్చును. పదహారవది ఐన కళ పేరు మహానిత్య. ఇది సర్వకాలమూ ఉండే కళ. ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతను చెప్పలేదు.

అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిని పోలి ఉంది అని చెప్పారు కదా. ఇందులో విశేషం ఏమన్నా ఉందా అని అలోచిద్దాం.

వికాసదశ ఐన శుక్లపక్షంలోనూ క్షీణదశ ఐన కృష్ణపక్షంలోనూ కూడా అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు. అధిష్ఠాత్రి త్వరితా నిత్య. 

సంతోషమూ వ్యసనమూ వలన బేధం లేని లలాటం అమ్మది అని అర్థం. ఏవిధమైన పరిణామబేధమూ లేనిది అన్నమాట.

అమ్మ ముఖం పూర్ణచంద్ర బింబం.

అమ్మ లలాటం అర్థం చంద్రబింబం.

తిథులలో ప్రతి పగటికీ రాత్రికీ కూడా విడివిడిగా సంకేత నామాలున్నాయి. శుక్లపక్షం అష్టమి రాత్రికి పేరు ఆప్యాయ. అంటే శ్రీదేవీ అమ్మవారి లలాటం ఆప్యాయత కురిపించేదిగా ఉన్నదని భావం.

ఇక్కడ ఒక సమయమత రహస్యం ఉంది. అమ్మముఖం పూర్ణచంద్ర బింబం. శరీరాంతర్గత పూర్ణచంద్రస్థానం సహస్రారం. అక్కడ సాధకుడికి అమృతసిధ్ధి.

అమ్మవారి లలాటం పైన అంతర్దృష్టి నిలిపి ధ్యానం చేస్తే అష్టమీ చంద్రదర్శనం. అంటే సగం దూరం అతిక్రమించి వచ్చేయటమే యోగంలో అన్నమాట.

త్వరితా త్వరితం ఫలదాయినీ అని శారదాతిలకం.

ఇది సులభోపాయం. ఇదే రహస్యం.

సామాన్యులకైనా సరే అమ్మ ముఖదర్శనమే త్వరితఫలదాయక మని గ్రహించాలి. సమస్త కామితములూ అమ్మ ముఖాన్ని మానసికంగా ధ్యానంలో దర్శించితే చాలు అవి వెంటనే ఫలిస్తాయని సందేశం.

🕉🌞🌏🌙🌟🚩

జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము(=గుడి మొదలగువాని చుట్టుగోడ) యొక్క మధ్యనున్న తల్లికి నమస్కారము..
(తిథులలో శుద్ధ చతుర్దశి, కృష్ణ విదియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలా మాలిని.)

జ్వాలామాలిని అనుదేవత చేత వెలిగించబడిన వహ్ని ప్రాకారము మధ్యన ఆ
పరమేశ్వరి. వెలుగొందుచున్నది అసలు ఈ జ్వాలామాలిని ఎవరు ? తిథులు
నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. కాబట్టి తిథులు, నిత్యలు, కళలు అన్నీ
ఒకటిగానే పరిగణించవచ్చు. చంద్రుని కళలు 16. ఇవి 15 తిథుల రూపంలో ఉండగా
16వ కళ మహాత్రిపురసుందరి సాక్షాత్తూ సచ్చిదానంద స్వరూపమై ఉన్నది.

దర్భాద్యాః పూర్ణిమాంత స్తు కళా పంచదశైవ తు ।
షోడశీ తు కలా జ్ఞేయా సచ్చిదానందరూపిణీ ॥

ధర్మ అంటే పాడ్యమి వరకు తిథులు (కళలు) 15 కాగా 16వ కళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.
నిత్యాదేవతలు మొత్తం 16మంది వీరిని వామకేశ్వరము లోని ఖడ్గమాలలో వివరించటం జరిగింది. ఈ నిత్యాదేవతే చంద్రుని కళలు. అయితే తిథులు మాత్రం 15 ఉన్నాయి. అందుకే పదహారవకళ సాక్షాత్తూ పరమేశ్వరి అయి ఉన్నది అని చెప్పటం జరిగింది. తిథులలో 14వది చతుర్దశి. ఆరోజున ఉండే నిత్యాదేవత జ్వాలామాలిని.
వాటి వివరాలు ఇలా ఉంటాయి.

శుక్లపక్ష తిథులు
పాడ్యమి
దశమి
ఏకాదశి
ద్వాదశి
త్రయోదశి
చతుర్షశి
పూర్ణిమ
నిత్యాదేవతల పేర్లు
కామేశ్వరి
భగమాలిని
నిత్యక్లిన్న
భేరుండ
వహ్నివాసిని
మహావజ్రేశ్వరి
శివదూతి
త్వరిత
కులసుందరి
నిత్య
నీలపతాక
విజయ
సర్వమంగళ
జ్వాలామాలిని
చిత్ర
16వ నిత్య మహానిత్య. ఈమె మహాత్రిపురసుందరి. ఇప్పుడు ఈ
నిత్యాదేవతలలో 14వ దేవత. అంటే శుద్ధచతుర్దశినాడు ఉండే నిత్య. జ్వాలామాలిని ఈవిడ అగ్నిదేవుని కుమార్తె.
శుద్ధ చతుర్దశినాడు, బహుళవిదియనాడు కూడా ఈమె ఉంటుంది. ఈ విషయాన్ని 15 నామంలో వివరించటం జరిగింది. భండాసురునితో యుద్ధం జరుగుతున్నది. పోరు భీకరంగా సాగుతోంది. అప్పుడు పరమేశ్వరి జ్వాలామాలినిని చూసి....

వత్సే ! త్వం వహ్బ్నిరూపాసి జ్వాలామాలా మయాకృతిః
త్వయా విధీయతాం రక్షా బలస్యాస్య మహీయసీ
శతయోజనవిస్తారం పరివృతమహీతలం
త్రి శద్యోజన మున్నమ జ్వాలా ప్రాకార తాం ప్రజ ॥

బిడ్డా ! నీవు అగ్నిదేవుని కుమార్తెవు.
కాబట్టి ఈ మహాసైన్యాన్ని రక్షించటానికి వందయోజనాల వైశాల్యము, ముఫ్రైయోజనాల ఎత్తు కల అగ్నిజ్వాలను సృష్టించ వలసినది. అని పరమేశ్వరి ఆజ్ఞాపించగా, జ్వాలామాలిని అలాగే చేసింది. ఈ రకంగా జ్వాలామాలినిచేత సృష్టించబడిన అగ్నివలయంలో మధ్యభాగాన ఆ పరమేశ్వరి ఉన్నది.

త చ్చక్తిపంచకం సృష్ట్యా లయేనాగ్ని చతుష్టయం
పంచశక్తి చతుర్వహ్ని సంయోగా చ్చక్రసంభవః ॥

శక్తి సంజ్ఞగల ఐదుచక్రాలు, అగ్ని సంజ్ఞగల నాలుగు చక్రాలు కలిపి శ్రీచక్రము అవుతుంది. వీటి కలయికవల్లనే త్రికోణం ఏర్పడింది. అదే వహ్నిప్రాకారము. త్రికోణం మధ్యనే బిందు ఉంటుంది.

త్రికోణే బైందవమ్‌ శ్లిష్టమ్‌ వహ్ని ప్రాకారానికి లోపల ఉన్నది అంతరావరణ అని, మిగిలినవి బహిరావరణ అని అంటారు. బహిరావరణములో
అష్టకోణము, దశారయుగ్మము, మన్వస్రము, అష్టదళము, షోడశదళము, భూపురము
ఉంటాయి. అయితే బహిరావరణలోని సేన భండాసురుని సేనను నాశనం చెయ్యటానికి, అంతరావరణలోని సేన భండాసురుణ్ణి సంహరించటానికి ఏర్పాటు చెయ్య బడ్డాయి.

జ్ఞాని అయినవాడు ఈ ప్రపంచంలోనే నివసిస్తున్నప్పటికీ, అజ్ఞానానికి దూరంగా, జ్ఞానజ్వాలలకు మధ్యన ప్రకాశిస్తూ ఉంటాడు. అగ్ని నుండి విస్ఫులింగాలు వేరుగా ప్రసరిస్తాయి. వాటికి దూరంగా తనకు తానుగానే ప్రకాశించే అగ్నిలాగా జ్ఞాని కూడా ప్రపంచంలో జీవిస్తూ కూడా ప్రపంచ వ్యవహారాలను పట్టించు కోకుండా తామరాకు మీద నీటిబొట్టు లాగా ఉంటాడు.

🕉🌞🌏🌙🌟🚩

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: