శివతత్వం

శివతత్వం.....................!!

ప్రార్ధన
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఊర్వారుక మివ బంధనాత్ మృతోర్ముక్షీయమామృతమ్
యస్శివో నామరూపాభ్యం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్
యోంతః ప్రవివ్యమమవాచ మిమాం ప్రసుప్తాం
సంజీవయతి అఖిలశక్తి ధరః స్వదామ్నా
అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్
ప్రాణాన్ నమోభాగవతే పురుషాయతుభ్యమ్
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంటాయ శంభవే
అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః
వాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

శివతత్వం
శివశివేతి శివేతి శివేతినా
భబ భవేతి భవేతి భవేతివా  
హర హరేతి హరేతి హరేతివా
భజమనః శివమేవ నిరంతరమ్

"శివ" అనే రెండక్షరాలచే చెప్పబడే పరతత్త్వం సమస్త జగదాధారం, సత్త్వర జస్తమస్త్రి గుణాతీతం నిత్యమంగళ, సదాసుఖప్రదం అది సార్వికాలికం సర్వకారణకారణం, విశ్వా సంరక్షకం, సచ్చిదానందమయం ఇంతేకాదు. పరమైశ్వర్య సంపన్నం నిరంజనం నిర్మలం నిర్వకల్పం అయిన పరమార్ధ    
శివలింగం:
పైన వివరించిన వాజ్ఞానస, అగోచర తత్వానికి ప్రతీక శివలింగం పరమేశ్వరుని నిరాకార రూపానికి సాధకుల, భక్తుల సాధనము సహకారంగా నిరూపించబడిన సూచిక ఈ నిరాకారాకారం. ప్రపంచం, భూగోళం ఇతర లోకాలు గ్రహనక్షత్ర తారకాదులు ఈ సమస్త విశ్వం కలిస్తే ఇలాగే గుండ్రంగా సర్వతో ముఖంగా ఉంటుందని వాటన్నిటి సూక్ష్మ రూపమో అన్నట్లుగా సాధనను బట్టి వీలైనంత ఎక్కువగా తెలియపరచడానికి ఉద్దేశించిన నిర్గుణ స్వరూపమే లింగం లీనం = మనకు తెలియకుండా ఉన్న అంశాన్ని, గమయతి = తెలియపరచుచున్నది కనుక లింగం అయింది.

గుర్తుగా ఉన్నతత్త్వం లింగమన్నమాట. మనకు ప్రధానంగా కనిపించేవి పరంపరగా ఊహించబడేవి పంచభూతాలే. వాటిలో భూమిని పీటంగాను ఆకాశాన్ని లింగంగాను పంచభూతాలను అంతర్లీనంగా కలిగింది. కనుక లింగం అని నిర్వచించారు పెద్దలు.          

   
"ఆకాశం" "లింగం" ఇత్యుక్తం పృథివీ తస్య పీతికా ఆలయః సర్వదేవానం లయనాత్ "లింగం" ఉచ్యతే ఆకాశం లింగం - భూమి దాని పీటం ఇది సర్వదేవతలకు - స్థానం. సర్వం ఇందులోనే లయిస్తుంది. కనుక లింగం అయింది.
సంప్రదాయ భేదాన్ని బట్టి సాలగ్రామమును, శ్రీ చక్రాన్ని శోణశిలను స్పటిక మణిని ఇతరుములైన కొన్ని నిరాకార వస్తువుల్ని ఉపాసకులు ఆయా దేవతల లింగాలుగా భావించవచ్చు. ఏ లింగాన్ని ఉపాసించిన అంతరార్ధం ఇదే.
 
శివనామాలు
పరమేశ్వరుణ్ణి తెలియజేయడానికి లింగం ఎలా ఒక ప్రతీకగా సాధనంగా అవుతుందో అలాగే శబ్దం కూడా ఒక వాచకంగా (పేరుగా) ప్రతీక అవుతుంది. అలాంటి ఎన్నో వాచకాలు పరమేశ్వరుణ్ణి బోధించే శబ్దాలు ఎన్నో ఉన్నాయి. "తస్య వాచకః ప్రణవః " అన్నట్లు పరమేశ్వరుణ్ణి ఆరంభంలో వేదంలో అనాదిగా సూచించింది. ప్రణవమే. ప్రనవమంటే ఓంకారం "ఓం" అనేది పరమాత్మకు పేరన్నమాట. శివ అనేది ఒక పేరు. భవరుద్ర మ్రుడశర్వ ఈశ విష్ణు గణేశ మహేశ పర ఇత్యాదులూ పేర్లే. ఒకొక్క పేరు పరమేశ్వరుణ్ణి ఒకొక్క లక్షణాన్ని చెపుతుంది. ఒకొక్క పదానికి ఉన్న ఒకొక్క అర్ధం తెలిసికోవడం కూడా ఉపాసనే అవుతుంది. కొన్నిటికి అర్ధాలు తెలిసికొందాం. 
బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః
ప్రబల తమసే తత్సంహారే హరాయ నమోనమః
జన సుఖక్రుతే సత్త్వోద్రేకే మ్రుదాయ నమోనమః
ప్రమహసిపదే నిశ్రైగున్యే శివాయ నమోనమః
శివ మహిమ్న స్తోత్రం
సృష్టి చేయడానికి రజోగుణాన్ని ఆశ్రయించిన వాడు భవుడు (బ్రహ్మ) ప్రళయం చేయడానికి తమోగుణాన్ని ఆశ్రయించినవాడు హరుడు (మహేశ్వరుడు) రక్షించడానికి సుఖపెట్టడానికి సత్త్వగుణాన్నిఆశ్రయించిన మృడుడు (విష్ణువు) మహాతేజో రూపుడైన గుణాతీతుడై ఉండేవాడు శివుడు (పరబ్రహ్మ) విష్ణుః = అంతటా ఉండేవాడు. శివః = మంగళము ఇచ్చువాడు, సుఖము ఇచ్చువాడు. శర్వః = ప్రళయమున సర్వమును హింసించువాడు. గణేశః = ప్రమథ గణాలకు ప్రభువు ఈశః, ఈశ్వరః, మహేశ్వరః = అందరిని అన్నింటిని నియమించి అదుపులో ఉంచుకొనేవాడు. పరః = అందరికన్నా అన్నింటికన్నా ఉత్క్రుష్టుడైన వాడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల కాధారుడు. రక్షించువాడు సత్యమైనవాడు........... అని ఎన్నో అర్ధాలున్నాయి ఓంకారినికి.
 
శివసాకారో పాసన:
కనిపించని పరమాత్మ ఉత్తమాధికారులు నిర్గుణ. నిరాకారంగా భావించగలగ వచ్చు. కాని మధ్యమాధి కారులందరు అలా భావించలేరు. మధ్యమాధికారులు కూడా ధ్యానించి సేవించి తరించడం కోసం శాస్త్రాల్లో భక్తుల అభీష్టమైన రూపాలు లక్షణాలు పేర్లు చిహ్నాలు స్థానాలు పరమేశ్వరునికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ముందుగా ఆయా స్థానాల్లో ఆయా చిహ్నాలతో ఆయారూపంతో ఉపాసించి, క్రమంగా నిర్గుణ నిరాకారంగా సర్వత్ర ఉండే పరమాత్మ దర్శనానికై మధ్యమాధికారులు కూడా అర్హులు కావాలి అనేదే శాస్త్రకారుల అభిప్రాయం. ఇతర ఉపాసకులతో విభేదించడం. ద్వేషించుకోవడం పరస్పరం నాశంచేసికోవడం మనలక్ష్యం కాదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: