మాఘపురాణం - 8వ అధ్యాయము

MAAGHA PURANAM -- 8

మాఘపురాణం - 8వ అధ్యాయము

యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి లేచినట్లుగా లేచి, వారు యమలోకమందు చూచిన వింతలు, విశేషములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు.

యమలోకములో జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను ఆనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు.

ఆ కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకండి. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి, పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుటవలన అంతకుముందు చేసిన పాపములు పటాపంచలై నశిస్తాయి. స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగుతుంది. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక విన్నను, శ్రీహరి దయకు పాత్రులవుతారు. మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుటకు అంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12