మాఘపురాణం - ఏడవ అధ్యాయం

MAAGHA PURANAM -- 7

మాఘపురాణం - ఏడవ అధ్యాయం

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట

ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ ఆరంభించాడు.

నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా! నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టం నెరవేర్చెదను” అని పలికాడు.

ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయమ’ ని ప్రార్థించాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: