భూకంపాలపై అధ్యయనం



భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎర్త్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జెస్సికా హాథార్న్ చెప్పారు. ఆమె భూకంపాలపై అధ్యయనం చేస్తున్నారు.

‘‘ఈ భూఫలకాలు మన చేతి గోర్లు పెరిగినంత వేగంగా కదులుతుంటాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్‌ అని పిలుస్తారు. అంటే ఒక వైపు ఉన్న భూఫలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి’’ అని ఆమె వివరించారు.

‘‘నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే, ఒక్కోసారి రెండిటిలో ఒక ఫలకం వేగంగా కదలడం, లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.

‘‘ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పైపొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే భూమి లోపలి పొరల్లోని రాళ్లు ద్రవ రూపంలో ఉంటాయి’’ అని హాథార్న్ చెప్పారు.

‘‘భూకంపం రావాలంటే, ఆ పైపొరలు కాస్త తక్కువ మందంతో తేలిగ్గా పగుళ్లు వచ్చేలా ఉండాలి. అందుకే ఎక్కువ భూకంపాలు భూఫలకాల అంచుల్లో వస్తుంటాయి’’ అని ఆమె చెప్పారు.

పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే 80 శాతం ప్రధాన భూకంపాలు ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అనే ప్రాంతంలోనే వస్తాయి. ఇక్కడ పసిఫిక్ ఫలకం అంచులు మిగతా ఫలకాలతో రాపిడికి గురవుతూ ఉంటాయి.

ఫాల్ట్‌లు ఎన్ని రకాలు?
భూకంపాలు కూడా కొత్త ఫాల్ట్‌లను సృష్టించగలవు, కానీ, చాలా ఉదంతాల్లో అప్పటికే ఉన్న ఫాల్ట్‌లలోనే భూకంపాలు వస్తుంటాయని హాథార్న్ వివరించారు.

ఫాల్ట్‌లలోను మూడు రకాలు విభజించొచ్చు. అవి నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్.

స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్స్
రెండు ఫలకాలు లేదా బ్లాకులు అడ్డంగా అటూఇటూ కదలడాన్ని స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్‌గా చెబుతారు.

ఇవి 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులో పొడవుగా కనిపిస్తుంటాయి. తూర్పు అనటోలియన్ ఫాల్ట్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ ఫాల్ట్ టర్కీలోని అనటోలియన్, అరేబియా ఫలకాలు కలుసుకునే చోట కనిపిస్తుంది.

గతవారం టర్కీ, సిరియాలను కుదిపేసిన 7.5, 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపాలతోపాటు గత దశాబ్దంలో నమోదైన రెండు ప్రధాన భూకంపాలు కూడా ఇక్కడే వచ్చాయి.

••••••••••••••••••••••••
ఫాల్ట్‌లు ఎన్ని రకాలు?
భూకంపాలు కూడా కొత్త ఫాల్ట్‌లను సృష్టించగలవు, కానీ, చాలా ఉదంతాల్లో అప్పటికే ఉన్న ఫాల్ట్‌లలోనే భూకంపాలు వస్తుంటాయని హాథార్న్ వివరించారు.

ఫాల్ట్‌లలోను మూడు రకాలు విభజించొచ్చు. అవి నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్.

స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్స్
రెండు ఫలకాలు లేదా బ్లాకులు అడ్డంగా అటూఇటూ కదలడాన్ని స్ట్రైక్-స్లిప్ ఫాల్ట్‌గా చెబుతారు.

ఇవి 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులో పొడవుగా కనిపిస్తుంటాయి. తూర్పు అనటోలియన్ ఫాల్ట్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ ఫాల్ట్ టర్కీలోని అనటోలియన్, అరేబియా ఫలకాలు కలుసుకునే చోట కనిపిస్తుంది.

గతవారం టర్కీ, సిరియాలను కుదిపేసిన 7.5, 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపాలతోపాటు గత దశాబ్దంలో నమోదైన రెండు ప్రధాన భూకంపాలు కూడా ఇక్కడే వచ్చాయి.
•••••••••••••••••••••••••••••••••••••••
నార్మల్ ఫాల్ట్స్
ఫలకాలు కలిసే భాగంలో ఒక భాగం ఉన్నట్లుండి కిందకు జారిపోవడాన్ని నార్మల్ ఫాల్ట్స్‌గా చెబుతారు.

అఫార్ డిప్రెషన్, తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్

ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో ఇలాంటివి మనం చూడొచ్చు. ఇక్కడ భూమిలోని మూడు ఫలకాలు కలిసేచోటును అఫార్ ట్రిపుల్ జంక్షన్‌గా పిలుస్తారు.

మరోవైపు సోమాలియా ఫలకం కూడా మిగతా ఖండం నుంచి దూరంగా జరుగుతోంది. ఇక్కడ కూడా లోతైన ఫాల్ట్‌లతో రిఫ్ట్ వ్యాలీ మనకు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ అఫ్రికన్, సోమాలియా ఫలకాలు.. ఉత్తరాన అరేబియా ఫలకం నుంచి దూరంగా జరుగుతున్నాయి. ఫలితంగా ఇక్కడ వై ఆకారంలో లోయ ఏర్పడుతోంది.

ఈ మూడు ఫలకాల కదలిక వల్ల భూభాగంపై ఒత్తిడి ఏర్పడి ఫాల్ట్‌లు, అగ్నిపర్వతాలు, లోయలు లాంటివి ఏర్పడుతున్నాయి.

•••••••••••••••••••••••••••••••••••••••
మిడ్-అట్లాంటిక్ రిడ్జ్

ఉత్తర అమెరికా, యురేసియన్ ఫలకాలు కూడా ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఫాల్ట్ లైన్‌ను మిడ్-అట్లాంటిక్ రిడ్జ్‌గా పిలుస్తారు.

ఉత్తరం నుంచి దక్షిణం వరకూ వేల కి.మీ. పొడవుతో ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రాల్లో ఈ రిడ్జ్ మనకు కనిపిస్తుంది.

ఇక్కడ రెండు ఫలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరిగినప్పుడు కిందనున్న మాగ్మా ఒక్కసారి ఉపరితలంపైకి వస్తుంది. దీని వల్ల ఇక్కడ కొత్త ఉపరితలం ఏర్పడుతుంది. అయితే, దీనిపై మళ్లీ కిందనుంచి మాగ్మా వచ్చి పడుతుంది. ఫలితంగా కొత్తకొత్త ద్వీపాలు ఏర్పాడుతున్నాయి. ఐస్‌లాండ్, అజోర్స్ లాంటివి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
•••••••••••••••••••••••••••••••••••••••
రివర్స్, థ్రస్ట్ ఫాల్ట్స్
రెండు ఫలకాలు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఫలకం కాస్త పైకి వెళ్తే దాన్ని రివర్స్ లేదా థ్రస్ట్ ఫాల్ట్‌గా చెబుతారు.

‘‘అతిపెద్ద ఫాల్ట్‌లు ఇలానే ఏర్పడతాయి. ఒక్కోసారి ఒక ఫలకం మరో ఫలకం మీదకు వచ్చేసినట్లుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల నేలపై చాలా మార్పులు కనిపిస్తాయి’’ అని హాథార్న్ చెప్పారు.

జపాన్ ట్రెంచ్

జపాన్ ట్రెంచ్ కూడా ఒక ఫాల్ట్ జోన్. ఇది ఉత్తరం నుంచి దక్షిణం దిశలో జపాన్‌కు తూర్పుగా ఉంటుంది. పసిఫిక్, యురేసియా ఫలకాల మధ్యలో ఇది కనిపిస్తుంది.

టోహోకులో 9.1 తీవ్రతతో మార్చి 2011లో భారీ భూకంపం వచ్చింది. అనంతర పరిశీలనలో ఇక్కడి ఫాల్ట్ 50 మీటర్ల వరకూ పక్కకు జరిగినట్లు తేలింది.

ఇలా జపాన్ ట్రెంచ్‌ వెంబడి భూఫలకాలు భారీగా కదలడంతో భారీ సునామీ వచ్చిపడింది. ఫలితంగా ఇక్కడి ఫుకుషిమా అణు కర్మాగరంలోనూ ప్రమాదం సంభవించింది.
•••••••••••••••••••••••••••••••••••••••
పెరూ-చిలీ ట్రెంచ్

దీన్నే అటకామా ఫాల్ట్ సిస్టమ్‌గా పిలుస్తారు. ఇది తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో పెరూ, చిలీ తీరానికి 160 కి.మీ. దూరంలో నజ్కా, దక్షిణ అమెరికా ఫలకాల మధ్య కనిపిస్తుంది.

ఇక్కడ దక్షిణ అమెరికా ఫలకం కిందకు నజ్కా ఫలకం వెళ్తోంది. ఫలితంగా ఇక్కడి భూమి ప్రకంపనలకు లోనవుతోంది.

1960 మే 22న దక్షిణ చిలీలోని వాల్‌విడియా నగరంలో 9.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇప్పటివరకు నమోదైన భూకంపాల్లో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై పడిన బాంబు కంటే 20,000 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఇక్కడ విడుదలైనట్లుగా పరిశోధకులు చెబుతున్నారు.

ఐస్‌లాండ్
ఫొటో సోర్స్,GETTY IMAGES
అయితే, మీరు ఫాల్ట్‌లైన్‌కు సమీపంలో జీవిస్తున్నంత మాత్రాన భయపడాల్సిన అవసరంలేదని, అన్ని ఫాల్ట్‌లలోనూ భూకంపాలు రావని హాథార్స్ చెప్పారు.

‘‘నిజానికి చాలా ఫాల్ట్‌లలో అసలు భూకంపాలు రావు.. లేదా చిన్నచిన్న ప్రకంపనలు మాత్రమే వస్తాయి’’ అని ఆమె వివరించారు.
•••••••••••••••••••••••••••••••••••••••

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: