ఆర్ధిక బాధల్లో ఉంటే, చిటికెడు ఉప్పు

కొంతమందికి సంపాదించిన సంపాదన నీళ్లలా ఖర్చైపోతుంది. కష్టాలలో అప్పులు చేస్తే, వడ్డీలు కొండల్లా మారతాయి. వచ్చిన సంపాదన ఎటూ చాలక అప్పులైపోతూ ఉంటారు. ఆర్ధిక బాధల్లో ఉన్న అందరికీ, చిటికెడుఉప్పుతో సమాధానం దొరుకుతుంది . ఇంట్లో వేర్వేరు చోట్ల,చిన్న గాజు సీసాలలో ఉప్పును ఉంచాలి. అప్పుడు ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. చివరకు బాత్రూం లో నైరుతి మూల ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి మనశాంతి కలుగుతుంది.

మనశ్సాంతి లేనివారు ఎక్కడకు వెళ్లినా నిరాశ, నిస్పృహలో ఉంటుంటారు. అలాంటి వారు తమ జేబులో ఉప్పును పొట్లంలా చుట్టుకుని పెట్టుకుంటే ఆ ఉప్పు నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది.

తద్వారా జీవితం లో అశాంతి పోయి,హాయిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పుకి నెగెటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది అని వాస్తు పండితులు చెబుతున్నారు..చేతిలో ధనం నిలబడాలంటే, ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మీకు వచ్చిన జీతాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని తీసి ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బు వృథాగా ఖర్చుకాకుండా ఉంటుంది.

శ్రీ మహాలక్ష్మి క్షీర సాగరం నుండి పుట్టింది. ఉప్పుకూడా సముద్రంలోపుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు కి దగ్గర సంబంధం ఉంది. అలాగే మంగళవారం రాత్రి పూట కొంత ఉప్పు తీసుకుని ఎర్రటి వస్త్రం లో మూట కట్టి ఇంటి ముందు తగిలించుకోవాలి.

ఆ తరువాతి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి అందులో రెండు లవంగాలు కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు.

మన ఇంటికి ఏ రోజు ముత్తైదువు వచ్చిన (మంగళ, శుక్రవారలు అయినా కూడా ) పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు ఇవ్వాలి. ఇలా చేయడం వలన కుటుంబములో సుఖశాంతులు కలుగుతాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: