హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం

🙏హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం......ప్రహ్లాద వరదుడు శ్రీ  ఉగ్రనరసింహ స్వామి ఆలయం : అహోబిలం. ( శింగవేళ్ కుండ్రం) 🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🔔 స్థలపురాణం 🔔

💠శ్రీ వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈనాటికి 
శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు. 

💠ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసింహ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. 
ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు.

💠అహోబిల నవనారసింహ వైభవం :
అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. 
అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. 

🔅వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుని 9 రూపాలుగా చేసుకొని స్వామీ ఇక్కడ వెలిసియున్నాడు

💠ప్రహ్లాదుడు విద్యాబుద్ధులు నేర్చిన బడి..ఇప్పటికి ఎగువ అహోబిలంలో కలదు. "ప్రహ్లాద పడి" అని దాని పేరు.
ఇప్పటికీ అక్కడి రాళ్లలో అక్షర గుర్తులు కలవు.

💠రక్తంతో తడిసిన తన చేతులను నరసింహ స్వామి కడిగినటువంటి చిన్న కొలను..ఇప్పటికి కలదు. 
"రక్త గుండం"అంటారు... ఆ కొలనులోకి నీరు ఇప్పటికీ ఎర్రగా వస్తూ ఉంటాయి...భక్తులు వాటిని చేతులలో తీసుకోగానే మాములు నీటిగా మారిపోవడం...స్వామి వారి మహిమే కదా మరి.

💠స్వామి ఉద్బవించిన ఉగ్ర స్తంభం నేటికి కలదు( శిలా రూపములో)..

💠అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. 

💠ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. 
వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. 

💠ఈ క్షేత్రానికి నగరి, నిధి, వేదాద్రీ, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.

💠ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది

🔔అహోబల క్షేత్రములో నరసింహులు : 

🔅1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

🔅2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

🔅3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.
 
🔅4. కారంజ నరసింహుడు :.అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

🔅5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

🔅6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

🔅7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు .

🔅8. భార్గవ నరసింహుడు : పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

🔅9. వరాహ నరసింహస్వరూపము :  భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము.

🔅ఈ తొమ్మిది నరసింహస్వామి స్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: