మాతృశాపము
104. మాతృశాపము
3. మాతృశాపము:
1) పంచమాధిపతియైన చంద్రుడు నీచయందుగాని పాపగ్రహాల మధ్యగా చతుర్ద పంచమములందు పాపులతో కూడియున్న ఉన్నచో
2) పంచమమందు నీచస్థితిలో చంద్రుడు లాభము యందు శని చతుర్థములో పాపులు ఉన్నచో.
3) జన్మలగ్నాధిపతి నీచయందుండి. చంద్రుడు పాపయుక్తుడై పంచమాధిపతి షష్ఠష్ఠామవ్యయ స్థానముల యందు ఉన్నచో
.....
4) జన్మలగ్న పంచమములు పాపయుక్తులై చంద్రుడు పాపాంశయందుండిన పంచమాధిపతి దుష్టస్థానమున ఉన్నచో.
5) నవమ స్థానములో గాని, పంచమములలో గాని పంచమాధిపతి చంద్రుడు, కుజుడు, శని, రాహువు కలిసి ఉన్నచో
6) లగ్న పంచమాధిపతులు షష్ఠమమున, చతుర్థాధిపతి అష్ఠమమున, దశమ అష్ఠమాధిపతులు లగ్నమున ఉన్నచో.
7) క్షీణచంద్రుడు సప్తమమున చతుర్థపంచమములందు రాహుశనులున్నా లగ్నము పాపగ్రహముల మధ్య ఉన్నచో.
8) జన్మలగ్నమున షష్టాష్టమాధిపతులు, వ్యయమందు చతుర్థాధిపతి పంచమమున చంద్రుడు గురుడు పాపయుతుడైనా
9) జన్మలగ్నంలో కాని పంచమములలో గాని చతుర్థాధిపతి కుజుడు, శని, రాహు, రవి, చంద్రులు కలిసి ఉంటే.
....
10) అష్ఠమాధిపతి పంచమమున పంచమాధిపతి అష్టమమున ఉండి చతుర్థాధిపతియందు చంద్రుడు దుష్టస్థానములందున్నా
11) కర్కాటక లగ్నములో కుజరాహువులు ఉండి శనిచంద్రులు పంచమములో ఉన్నచో.
12) లగ్న, పంచమ అష్ఠమవ్యయములందు కుజ, రాహు, రవి శనులుంటే, చతుర్థలగ్నాధిపతులు దుష్టస్థానములలో ఉంటే.
13) పంచమమున శనిచంద్రులు ఉండి అష్టమమున గురుడు కుజ రాహువులతో
కలిసి ఉంటే
పైన వ్రాయబడిన విషయములు ఏ జాతక చక్రములో ఉంటే ఆ కుండలిలో మాతృశాపము కలును.
Comments
Post a Comment