అత్యధికంగా నష్టపోయే అవకాశాలు

కొంతమంది వడ్డీకి డబ్బులిస్తుంటారు లేదా స్నేహితులకు గానీ బందువులకు గానీ సహాయం చేద్దామని డబ్బు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో తిరిగి వస్తుంది కానీ జాతకంలో తిరిగివచ్చే యోగాలు లేనప్పుడు డబ్బు వెనక్కి రాదు. ఆరు, ఎనిమిది, పన్నెండు అనేవి దుస్థానాలుగా చెప్పవచ్చు. దీనితోపాటు మూడో స్థానం కూడా దుస్తానంగా చెబుతారు. మూడో స్థానానికి శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు అత్యంత ఎక్కువ ఇబ్బందికరంగా ఉండదు. కానీ అత్యంత ప్రమాదకరమైనది ఎనిమిదో స్థానంగా చెప్పవచ్చు. ఎనిమిదో స్థానం ధనస్థానమును చూస్తుంది కాబట్టి జాతకులు సంపాదించిన డబ్బు, సేవింగ్స్ వీటిపైన ఎనిమిదో స్థానం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎనిమిదవ స్థానాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం పూర్తిగా దెబ్బతింటుంది లేదా ఏ భావాధిపతి అయినా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆ భావం దెబ్బతింటుంది. ఒక జాతకంలో లాభాలు పొందాలి అంటే లాభాధిపతి బలంగా ఉండాలి. శుభగ్రహ దృష్టిగానీ బలమైన స్థానాల్లో గాని శుభగ్రహాలతో గానీ ఉండాలి. ఎనిమిదవ స్థానాధిపతి లాభస్థానంలో స్థితి పొందినా, లాభాధిపతి ఎనిమిదో స్థానంలో స్థితి పొందినా, లేదా ఎనిమిదో స్థానాధిపతికి లాభాధిపతి ఎటువంటి సంబంధం ఉన్నప్పటికీ, ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. ఇటువంటి జాతకులు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ బిజినెస్సు చేయకూడదు. లిటికేషన్ వ్యాపారాలు జోలికి వెళ్లకూడదు. కోర్టు కేసుల్లో కూడా వీళ్ల అత్యధికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: