అష్టగంధం

*🙏అష్టగంధం అంటే ఏమిటబ్బా 🙏*

*🌺సుమధురమైన ఎనిమిది గంధాలను కలిపి తయారు చేసేదే అష్టగంధం అని అంటారు. ఆ ఎనిమిది పదార్ధాలు ఏమిటంటే: 🌺*

*🌺1.కస్తూరి* 
*2.గోరోజనం* 
*3.కుంకుమ పువ్వు*
*4.దేవదారు* 
*5.పచ్చ కర్పూరం* 
*6.అగిలు*
*7.శ్రీగంధం* 
*8.రక్త చందనం*

ఈ ఎనిమిది పదార్ధాలతో చేసే గంధం పరమాత్మునికి ప్రియమైనది. దీన్ని ధరించడం ద్వారా దైవత్వం సిద్దిస్తుంది. దీనిలో మూడు రకాలు ఉన్నాయి🌺

*1.శివ గంధం* 
*2.శక్తి గంధం* 
*3.విష్ణు గంధం*

*శివగంధం...*
దీన్నీ శైవులు తయారు చేసి శివునుకి అర్చించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనిలో శ్రీ గంధం, అగిలు గంధం, పచ్చ కర్పూరం, చందనపు ఆకు, అరటి వేరు, కుంకుమ పూవు, రక్తగంధం, కంకుష్టాన్ని ఉపయోగిస్తారు. ఈ శివగంధాన్ని శాస్త్రబద్దంగా తయారు చేసి దీనిని మూల విగ్రహానికి అంటే శివలింగానికి ప్రతి రోజు పెడితే దేవాలయ వాతావరణం శాంతంగా ఉంటుంది. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగి దేవునికి కళ వస్తుంది. 🌺

*🌺శక్తిగంధం..*
దీనిని ఎక్కువుగా స్త్రీ దేవతల దేవాలయాలలో శాస్త్రబద్దంగా చేసి, దేవికి ఈ శక్తీ గంధాన్ని పెడతారు. ఈ శక్తి గంధాన్ని శ్రీగంధం, అగిలు గంధం, పచ్చ కర్పూరం కచోర, కుంకుమ పూవు, గోరోజనం, జటమాoసి, శిలా రసాల నుంచి తయారు చేస్తారు. శక్తి గంధాన్ని మూల విగ్రహమైన స్త్రీ దేవాలయలో ఉండే మూర్తికి పెడతారు .దీనితో దేవాలయలో దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి. 🌺

*🌺విష్ణు గంధం...*
విష్ణు గంధాన్ని అన్ని విష్ణు దేవాలయలో ఉపయోగిస్తారు. దీనిలో శ్రీగంధం, అగిలు గంధం బావాంచ, కంకుష్ట పువ్వు, మురామంసి, జటామాంసి, సిలరసం; వీటిని మూల విగ్రహనికి పెట్టి అనంతరం, పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత భక్తులకు ప్రసాదరూపంలో పంచుతారు. దీన్నంతా ఒకే ప్రమాణంలో గందం తీసి అ గంధాన్ని స్వామికి లేదా దేవికి అర్పించి స్వీకరిస్తే అటువంటి వారికీ దేహంలో ఉండే సమస్త వ్యాధులు తొలగి, దేవుని అనుగ్రహంతో అన్ని పనులు సత్వరమే సిద్దిస్తాయి. దీన్నే లేపన గందం అనీ, అస్థగంధమని, గంధషత అని కూడా పిలుస్తారు. దీన్ని ధరిస్తే ఆకర్షణతో పాటు తేజోవంతులు, దైవనుగ్రహ సంభూతులు, కీర్తి వంతులు అవుతారు. దీన్ని ఏ దేవాలయంలో అయితే ఉపయోగిస్తారో ఆ దేవునుకి, దేవతా కళ ఎక్కువ అవుతుంది. ఈ గంధాన్ని స్త్రీలు కూడా దరించవచ్చు. 🌺

        సదా శుభమస్తు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: