దుష్టగణకూట దోషములుండవు.
మైత్ర్యాంరాశిస్వామినోరంశనాథ ద్వంద్వస్యాపిస్యాత్గణనాంనదోషః
ఖేటారిత్వంనాశయేత్ సత్భకూటం ఖేటప్రీతిశ్చాపిదుష్టంభకూటమ్||
భావ : స్త్రీ, పురుషుల రాశ్యాధిపతులకు మిత్రత్వముండగాను, లేక
నవాంశరాశుల అధిపతులకు మిత్రత్వమున్నను దుష్టగణకూట దోషములుండవు.
స్త్రీ రాక్షసగణమై, పురుషుడు మనుష్యగణమైనను లేక దేవగణమైనను
పై చెప్పిన రాశ్యధిపతులకుగాని, నవాంశాధిపతులకుగాని మిత్రత్వమున్నచో
వివాహము చేయవచ్చును. అత్రి మహర్షికూడ ఇట్లే చెప్పిరి.
తృతీయ, ఏకాదశాధిపతులు శత్రుత్వము మొదలగు వానిని మిత్రత్వము గల రాశికూటములు పోగొట్టును.
గ్రహమైత్రి షష్టాష్టక దోషములను, పోగొట్టును సప్తఋషి మతమునందలి వివాహపటలముగూడ ఇట్లే చెప్పు
చున్నది.
ఇన్ని విధముల పరిహారములున్నను నాడీ శుద్ధిలేనిచో వివాహము చేయరాదు.
Comments
Post a Comment