గాయత్రీ మంత్రము

గాయత్రీ మంత్రము

గాయత్రి
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.

గాయత్రీ మంత్రము
దేవతలు - గాయత్రీ మంత్రాలు

మంత్రము
అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
కామ గాయత్రి - ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.
కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
గురు గాయత్రి - ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శని గాయత్రి - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.
శ్రీ అయ్యప్ప గాయత్రి - ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.
శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి - ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి - ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.
ప్రతి పదార్థం
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.

ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
చతుర్వింశతి గాయత్రీ
గాయత్రీ మంత్రం లో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.

యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరశింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

ఋషి పుంగవుల ప్రశంస
గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి
ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి
గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి
గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. —యాజ్ఞ వల్క్యుడు
గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు
గాయత్రి మంత్రఉపాసన దీర్గాయువు కలిగించును. —చరకుడు
గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. —వశిష్ట మహర్షి
గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు
గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి
మహాపురుషుల ప్రశంస
గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. —రవీంద్రనాధ్ ఠాగూర్
గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును. —బాలగంగాధర తిలక్
గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. —మదన మోహన మాలవ్య
గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును. —రామకృషణ పరమహంస
గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం. —వివేకానంద
గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. —రామతీర్ధ
గాయత్రి ప్రార్థన సార్వబౌమిక(అందరూ చేయతగిన) ప్రార్థన. —డా.సర్వేపల్లి రాధాకృష్ణ
గాయత్రి మంత్రమునందలి శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా హంసరాజ్
వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన నియమము యదార్ధముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము. ఇంతేకాక గాయత్రి మంత్ర జపము రాష్ట్రీయ విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: