చతుఃషష్టి ఉపచారాలు

*చతుఃషష్టి ఉపచారాలు* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనం ఇచ్చినపుడు ఆ ఆనంద పారవశ్యంలో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు.

*1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం* 
అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం. 

*2. అభరణ అవరోపణం* 
ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం. 

*3. సుగంధ తైలాభ్యంజనం*
 వంటికి నూనె పట్టించడం. 

*4. మజ్జనశాలా ప్రవేశము*  
స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం.
 
*5. మణిపీఠోపవేశనం* 
మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం. 

 *6. దివ్యస్నానీయ ఉద్వర్తనం* 
నలుగు పెట్టుట. 

*7. ఉష్ణోదక స్నానము* 
వేడి నీటితో స్నానము చేయించుట. 

 *8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం*
బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము.

 *9. ధౌతవస్త్ర పరిమార్జనం* 
పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం. 

*10. అరుణ దుకూల పరిధానం* 
ఎర్రని వస్త్రము ధరింపజేయడం. 

*11. అరుణకుచోత్తరీయం*  
ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం. 

*12. ఆలేపన మంటప ప్రవేశనం*  
అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం.

*13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం*
వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం. 

 *14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం*
కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం. 

*15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం*
వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం. 

*16. భూషణమండప ప్రవేశము* 
అలంకార గది ప్రవేశము. 

 *17. మణిపీఠోపవేశనము* 
అక్కడ మళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము. 

 *18. నవమణిమకుట ధారణ* 
తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం. 

*19. దానిపైన చంద్ర శకలం పెట్టడం* 

 *20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం* 

*21. తిలక ధారణము*
నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం.

*22. కాలాంజనం దిద్దడం* 
అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

*23. పాళీయగళం* 
అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

*24. మణికుండళయుగళం* 
మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

*25. నాసాభరణం* 
ముక్కుకి నాసాభరణం అలంకరించడం

*26. అధరయావక లేపనం* 
పెదవులకు పూసే లత్తుక పూయడం

*27. ఆర్య భూషణం*
ప్రధాన భూషణం అలంకరించడము

*28. మాంగల్య సూత్రము* 
మాంగల్య సూత్రమును అలంకరించుట

*29. హేమచింతాకం*
బంగారుతో కూడిన చింతామణుల మాల వేయడం

*30. పతకం* బంగారు పతకం

*31. మహాపతకం*
పెద్దదిగా ఉన్న బంగారు పతకం

*32. ముక్తావళి* 
మూడు వరుసల ముత్యాలహారం

*33. ఏకావళి* 
27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

*34. చన్నభీరము*
యజ్ఞోపవితం లాగ భుజముల మీద నుండి వేసే ఒక ఆభరణము

*35. కేయూర యుగళ భూషణ చతుష్టయము*
నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)

*36. వలయావళి*
నాలుగు చేతులకు కంకణములు

*37. ఊర్మికావళి*
నాలుగు చేతులకు ఉంగరములు

*38. కాంచీధామము*
వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

*39. కటిసూత్రము* 
వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

*40. సౌభాగ్యాభరణం*
అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

*41. పాదకటకం*
కాలి అందెలు

*42. రత్ననూపురములు* – 
దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

*43. పాదంగుళీయములు* మట్టెలు

*44. పాశం* 
పైన ఉన్న కుడి చేతిలో తాడు

*45. అంకుశం* – 
పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

*46. పుండ్రేక్షు చాపము* 
క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు 

 *47. పుష్పబాణములు* 
కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

*48. శ్రీ మణి మాణిక్య పాదుక* 
ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

*49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము*  
సర్వాలంకాణలతో ఉన్న ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనము పై అమ్మవారిని అధిష్టింప జేయడం

*50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము* 
అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

*51. అమృతచషకము* 
అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

*52. ఆచమనీయము* 
జలమునందించుట

*53. కర్పూరవీటిక* 
కర్పూర తాంబూలము నందించుట

*54. ఆనందోల్లాస విలాస హాసము*
అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

*55. మంగళార్తికం*
దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

*56. ఛత్రము* 
అమ్మవారికి గొడుగు పట్టుట

*57. చామరము*
అమ్మవారికి చామరము వీచుట

*58. దర్పణమ్*
అమ్మవారికి దర్పణం చూపించుట

*59. తాళావృతం*
అమ్మవారికి విసనకర్రతో విసురుట

*60. చందనం* 
గంధం పమర్పించుట

*61. పుష్పం*
పుష్పాలను సమర్పించుట

*62. ధూపము*
సువాసనభరితమైన ధూపమును వేయుట

 *63. దీపము* 
దీప దర్శనము చేయించుట

 *64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు* 
నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూలనీరాజనాది సత్కారములతో నమస్కరించుట

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: