సనాతన ధర్మంలో విడాకులు
సనాతన ధర్మంలో విడాకులు లేవు అని ఎవరు చెప్పారు .. సంప్రదాయములో లేక పోవచ్చు కానీ .. ధర్మము లో ఉంది.. కాలానుగుణంగా పరాశర మహర్షి తన స్మృతి లో నారద, గరుడ, అగ్ని, వసిష్ఠ, మను ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు.
*పరాశర స్మృతి 4. 28* ఎప్పుడైతే ఆడదాని భర్త చనిపోతాడో, కనపడకుండా పోతాడో, లేదా ఏదన్నా పాపం చేయడం వలన చండాలుడిగా మారతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, నపుంసకుడు అవుతాడో .. ఆ భార్య ఇంకో వివాహము చేసుకోవచ్చు .. అంటే భర్త బ్రతికుండగా కూడా అతన్ని వదిలి ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు.
*నారద స్మృతి 12. 97* ఎవరి భర్త అయితే చనిపోతాడో, కనపడకుండా పోతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, వర్ణ బహిష్కారణకు గురి అవుతాడో .. అలాంటి వాడిని భార్య వదిలేసి .. ఇంకొకరిని వివాహమాడొచ్చు
*గరుడ స్మృతి 1.107.28:* ఎవరి భర్త అయితే చనిపోతాడో, కనపడకుండా పోతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, వర్ణ బహిష్కారణకు గురి అవుతాడో .. అలాంటి వాడిని భార్య వదిలేసి .. ఇంకొకరిని వివాహమాడొచ్చు
*అగ్ని స్మృతి:* ఆడవారు పునర్వీవాహం చేసుకోటానికి 5 కారణాల్లో ఒకటి చాలు - భర్త చనిపోతే, సన్యాసము తీసుకుంటే, నపుంసకుడు అయితే, విలువల పరంగా పడిపోతే, భర్త చనిపోతే అతని తమ్ముడిని చేసుకోవచ్చు , అలా కుదరని పక్షములో వేరే ఇతరులను కూడ చేసుకోవచ్చు..
వశిష్ఠ మహర్షి 17.74 : వీరు సైతము .. ఇవే కారణాలతో భర్తను భార్య వదిలివేయవచ్చు అని తెలియ చెప్పారు ..
మను స్మృతి కూడా పునర్వివాహాలను ప్రోత్సహిస్తుంది
Comments
Post a Comment