జాతకనిరూపణమ్‌

పంచపంచాశత్తమో೭ధ్యాయః = యాబదియైదవ అధ్యాయము

జాతకనిరూపణమ్‌

సనందన ఉవాచ :-

మూర్ధాస్యబాహుహృత్కోడాంతర్బస్తివ్యంజసో నఖః. జానుజంఘాంఘ్రియుగలం కాలాంగాని క్రియాదయః. 1

భౌమాస్పుజిబుధేందుశ్చ రవిసౌమ్యాసితాః కుజాః, గరు మందార్కిగురవో మేషాదీనామధీశ్వరా. 2

హరే విషమ ఖేర్కేంద్వోః సమభే శశిసూర్యయోఓః, ఆదిపంచనవాధీశా ద్రేష్కాణంశాః ప్రకీర్తితాః. 3

పంచేష్టాష్ఠాద్రి పంచాంశా కుజార్కీజ్యజ్ఞ శుక్రగాః, ఓజే విపర్యయాద్గుగ్మే త్రింశాంశేశాః సమీరితాః. 4

క్రియణతౌలికార్కాద్యా మేషాదిషు నవాంశకాః, స్వభాద్ధ్వాదశభాగేశాః షడర్గం రాశిపూర్వకమ్‌. 5

గోజాశ్చ కర్కయుగ్మేన రాత్య్రాఖ్యా పృష్ఠకోదయాః, శేషా దినాఖ్యాస్తుభయం తిమిః క్రూరస్సౌమ్యః పుమాన్‌. 6

పుమాన్‌ స్త్రీచ క్లీబశ్చరస్థిరద్విస్వభావకాః, మేషాద్యాః పూర్వతో దిక్థ్సాస్స్వస్వస్థాన చరాస్తథా. 7

అజో క్షైణాంగనా కీటఝుషజూకా ఇనాదితః, ఉచ్చాని ద్విత్రిమనుయుక్‌ తిధీషు భనవాంశ##కైః 8

తత్తత్సప్తమనీచాని ప్రాఙ్మధ్యాంత్యాసకాః క్రమాత్‌, వర్గోత్తమాశ్చణరాధేషు భావాద్ద్వాదశ మూర్తిమాన్‌. 9

సింహోక్షా విస్త్రశ్చ తౌలి కుంభా స్సూర్యాస్త్రికోణభమ్‌, చతురస్రం తూర్యమృత్యు త్రికోణం నవ పంచమమ్‌. 10

రిః ఫాష్టషట్కం త్రికభం కేంద్రం ప్రాక్తుర్య సప్తఖమ్‌, నృపాదః కీటపశవో బలాఢ్యాః కేంద్రగాః క్రమాత్‌. 11

కేంద్రాత్పరం ఫణఫరం ఆపోక్లిమమతః పరమ్‌, రక్తశ్శ్వేతశ్శకునిభః పాటలో ధూమ్రపాండురౌ. 12

చిత్రః కృష్ణః పీతపింగౌ బభ్రుస్స్వచ్ఛప్రభాక్రియాత్‌, సామ్యాశాఖ్యప్లవత్వం స్యాద్ద్వితీయే వశిరర్కభాత్‌. 13

కాలాత్మార్కో మనశ్చన్ద్రః కుజస్సత్వం వచో బుధః, జీవో జ్ఞానం సుఖం శుక్రః కామో దుఃఖం దనేశజః. 14

నృపౌ రవీన్దూ నేతాసృక్‌ కుమారోజ్ఞః కవీజ్యకౌ, సచివో సూర్యజః ప్రేష్యో మతో జ్యోతిర్విదాం వరైః. 15

తామ్రశుక్ల రక్త హరిత్‌ పీత చిత్రాసితా రవేః, వర్ణావ అవ్యహ హరీన్ద్రా శచీ కౌధిపా రవేః. 16

రవిశుక్రారరాహ్వర్కేన్దువిదీజ్యా దిగీశ్వరాః, క్షీణన్ద్వర్కార రవిజాః పాపా పాపయుతో బుధః. 17

క్లీబౌ బుధార్కీ శుక్రేన్దూ స్త్రి¸° శేషా నరా స్స్మృతాః శిఖి భూమి పయో వారి వాసినో భూసుతాదయః. 18

కవీజ్యౌ కుజసూర్యౌ చ వేదో జ్ఞో వర్ణపాః క్రమాత్‌, సౌరోంత్యజాధిపః ప్రోక్తో రాహుర్మేచ్ఛాధిపస్తథా. 19

చంద్రార్కజీవాజ్ఞసితాకుజార్కీసాత్త్వికాదికాః, దేవతేంద్వగ్నిఖైలాభూకోసఖాయో పరాధిపాః. 20

వస్త్రం స్థలం నవం వహ్ని కహతం మద్యదం తథా, స్ఫుటితం రవితస్తామ్రం తారం తామ్రపునిస్తథా. 21

మేమకాంస్యాయసీ త్య్రంశైశ్శిఖిరాద్యాః ప్రకీర్తితాః, సౌరశుక్రారచంద్రజ్ఞగురుఘాద్యత్సు చ క్రమాత్‌. 22

త్య్రాశత్రికోణతుర్యాష్టసప్తమాన్యేన వృద్ధితాః, సౌరే జ్వారాపరే పూర్ణే క్రమాత్పశ్యంతి నారద. 23

అయనక్షణఘస్రర్తుమాసార్ధశరదో రవేః, కటుతిక్తక్షారమిస్రమధురావ్లుకషాయకాః. 24

త్రికోణాత్సాంత్యధాధర్మా యుస్సుఖఖోద్యపస్సుహృత్‌, జీవో జీవాజ్ఞా సితజ్ఞౌ వ్యర్కా వ్యారాః క్రమాదమీ. 25

వీంద్వర్కా వికుజేంద్వర్కా సుహృదో೭న్యే రవేర్ధృతాః, మిధో ధన వ్యయాయత్త్రిబంధువ్యాపారగస్సుహృత్‌. 26

ధ్యేకానుభుక్తా మయాన్‌ జ్ఞాత్వా మిశ్రీదీత్సహజాన్మునే, మత్కాలో೭ధిసుహృన్మిత్ర పూర్వకాన్కల్పయేత్పునః. 27

స్వోచ్చత్రికోణగేహా ప్రనవాంశైస్థానజం బలమ్‌, దిక్షుసౌమ్యేజ్యయోస్సూర్యా రయోస్సౌరే సితాజ్ఞయోః. 28

ఖాదృతూ దగనేన్యే తు వక్త్రే చంద్రసమాగమే, ఉత్తరస్థా దీప్తకరాశ్చేష్టా వీర్యయుతా మతాః. 29

నీశీందుకుజసౌరాశ్చ సర్వదా క్షోహ్ని చాపరే, క్రూరాః కృష్ణే సితే సౌమ్యా మతం కాలబలం బుధైః. 30

సౌరరాజ్ఞేజ్యశుక్రేందుసూర్యాధిక్యం పరస్పరమ్‌. పాపాస్తు బలినస్సౌమ్యా వివక్షాః కంటకోపగే. 31

క్లీచేతదూశనాద్వాడిచంద్రార్కంశసమంజనుః, స్వాంశే పాపాః పరాంశస్ధాస్సౌమ్యా లగ్నం వియోనిజమ్‌. 32

నిర్చలం చ తదాదేశ్యం వియోనేర్జన్మపంజితైః, శీర్షం వక్త్రగలే పాదావంసౌ పృస్ఠమురస్తథా. 33

పార్శ్వే కుక్షీత్వపానాంఘ్రీ మేఢ్రముష్కౌ తథా స్ఫిజౌ, పుచ్ఛం చతుష్పదాంగేషు మేషాద్యా రాశయస్స్మృతాః. 34

లగ్నాంశాద్గ్రహయగ్దృష్ట్వా వర్ణన్బలయుతాద్వదేత్‌, దృక్సమానప్రమాణాంశ్చ ఇష్టే రేఖాం స్వరస్థితైః 35

ఖగత్య్రంశే బలాగ్నేగే చరమాంశే గ్రహాన్వితే, వాంశే స్థలాంబుజస్సౌరేర్ద్వీక్షాయోగభవా ద్విజాః. 36

విప్రలైస్తనుచంద్రేజ్యార్కైస్తరూణాం జనిం వదేత్‌, స్ధలాంబుఖేదేశకృతశ్చేతరేషాముదాహృతః. 37

స్ధలాంబు చ పతిః ఖేటో లగ్నాద్యావన్మితే గృహే, తావంత ఏవ తరవః స్ధలజా జలజాస్తథా. 38

అంతస్సారా రవౌ సౌరే దుర్భగాః క్షీరణో విధౌ, భౌమే కంటకినో వృక్షా ఈజ్యౌజ్ఞే సఫలాఫలౌ. 39

పుష్పితా భార్గవే స్ధిగ్ధాశ్చంద్రే೭థ కటుకాః కుజే, అసుభ##రే శుభః ఖేటః శుభం వృక్షం కుభూమిజమ్‌. 40

సనందన మహర్షి పలికెను:-

శిరస్సు, ఆస్యము, బాహువులు, హృదయము, క్రోడము, నఖములు, జంఘలు, అంఘ్రియుగలము ఇవియన్నియు కాలపురుషుని అంగములు. క్రియాదులు కూడా కాలాంగములే. మేషాది రాశులను అధిపతులను తెలియుము. మేషవృశ్చికములకు కుజుడు అధిపతి. వృషభ తులలకు శుక్రుడు అధిపతి. మిధున కన్యా రాశులు బుధుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడధిపతి. ధనుర్మీనములకు బృహస్పతి అధిపతి. మరకకుంభ రాశులకు శని అధిపతి. హోరలో సూర్యచంద్రులు విషమ నక్షత్ర గతులైనపుడు, చంద్ర సూర్యులు సమ నక్షత్రగతులైనపుడు ఆది పంచనావాధీశులు ద్రేష్కాణాధిపతులని చెప్పబడినది. పంచ ఇష్ట అష్టాది పంచాశలు కుజ శని గురు బుధ శుక్రగతములని తెలియవలయును. ఓజో విషయమున విపర్యయము వలన, యుగ్మమున త్రింశాంశేశులుగా చెప్పబడిరి. మేషాదిరాశులలో తులాకర్కాటకాదులు నవాంశలుగా తెలియవలయును. తమతమ నక్షత్రము నుండి ద్వాదశ భాగేశులు రాశిపూర్వకముగా షడర్గమును తెలియవలయును. వృషభ##మేషములు కర్కాటక మిధునములతో రాత్రి అను పేరుతో పృష్ఠకోదయములు. మిగిలిన రాశులు దినముగా పేర్కొనబడినవి. ఉభయములు తిమి, క్రూర, సౌమ్య పుమాన్‌ అను పేర్లచే వ్యవహరించబడును. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు చరము. స్ధిరము, ద్విస్వభావములు కలవిగా నుండును. మేషాది రాశులు తూర్పుదిక్కున నుండును. తమతమ స్థానములలో తిరుగుచుండును. సూర్యాదిగ్రహములకు మేషాదిరాశులు ఉచ్చరాశులు ఇట్లుచెప్పెదరు. రవికిమేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, బుధునకి కన్య, గురునికి కటకము, శుక్రునికి, మీనము, శనికి తుల ఇవి ఉచ్చరాశులు. ప్రతిగ్రహమునకు తన ఉచ్చరాశికి సప్తమ రాశి నీచరాశిగా తెలియవలయును. అనగా రవికి తుల, చంద్రునికి వృశ్చికము, కుజునికి కటకము, బుధునికి మీనము, గురునికి మకరము, శుక్రునికి కన్య , శనికి మేషము ఇవి నీచరాశులు. ఇవి క్రమముననుసరించి, ప్రాక్‌, మధ్య, అంత్యాశలు కలవగును. వర్గోత్తమములు భావమువలన ద్వాదశమూర్తులు గలిగియుండును. ఇట్లే రవికి సింహము, చంద్రునికి, వృషభము, కుజునికి మేషము, బుధునికి కన్య గురువునకు ధనుస్సు, శుక్రునుకి తుల, శనికి కుంభము ఇవి మూలత్రికోణములనబడును. రాశికి, మరియు రాశినుండి నాలుగవ, ఏడవ పదియవరాశులకు కేంద్రములని పేరు. రాశికి , రాశినుండి అయిదవ, తొమ్మిదవరాశులకును కోణములని పేరు . క్రేంద్ర కోణములందున్న గ్రహములు ప్రబలులుగా ఉండును. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పాటలవర్ణము, ధూమ్రవర్ణము, పాండురవర్ణము. చిత్రవర్ణము, కృష్ణవర్ణము, పసుపుపచ్చ, పింగళవర్ణము, బభ్రువర్ణము, స్వచ్ఛవర్ణము, గ్రహములకు ప్రభాక్రియవలన ఏర్పడును. సూర్యుడు కాలస్వరూపుడు, చంద్రుడు, మనస్సు, కుజుడు సత్త్వము, బుధుడు వాక్కు, గురువు జ్ఞానము, శుక్రుడు సుఖము, కామము, శని దుఃఖము స్వరూపముగా కలవారు. సూర్యచంద్రులు రాజులు, కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు. శని అనుచరుడు అని జ్యోతిర్విదులు సిద్ధాంతము. సూర్యునికి ఆయారాశి సంచారము ననుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత్‌, పీత, చిత్ర, కృష్ణవర్ణములు కలుగుచుండును. రవి శుక్ర కుజ, రాహు, శని చంద్ర బుధ గురువులు వరుసగా అష్టదిక్కులకు అధిపతులు. క్షీణచంద్రుడు, రవి, కుజుడు, శని ఈ నాలుగు పాప గ్రహములు. పాపగ్రహములతో కలసినపుడు బుధుడు పాపుడగును. బుధుడు శని నపుంసకులు, శుక్రుడు చంద్రుడు స్త్రీలు, మిగిలిన గ్రహములు పురుషులు అని తెలియవలయును. అగ్నిభూమి, నీరు, వాయువులలో భూసుతాది గ్రహములు నివసించును. గురుశుక్రులు బ్రాహ్మణులు, రవి చంద్ర గురులు సాత్త్వికులు. బుధ శుక్రులు రాజసులు. కుజశని రాహుకేతువులు తామసులు. రవికి అగ్ని, చంద్రునికి జలము, కుజునకు, కుమారస్వామి, బుధునకు విష్ణువు, గురునకు దేవేంద్రుడు, శుక్రునకు శచీదేవి, శనికి బ్రహ్మ, రాహుకేతువులకు శివుడు అధిదేవతలు. వస్త్రము స్ధలము కొత్తది వహ్నికహతము మద్యదము, స్ఫుటితము, రవికి తామ్రము , తారము, తామ్రపుని. బంగారము, ఇనుము, ఉక్కు ఈమూడు అంశలతో నుండును. శశిరాదులు గుణములు. అనగా రవికి రాగి, ముదుగు బట్ట, దేహపు ఎముకలు దేవతాస్ధానము పూజా సంబంధములుండును. చంద్రునకు రత్నములు, క్రొత్తబట్ట, దేహరక్తము జలసమీపము స్నానప్రదేశములు. ఇట్లే ఇతర గ్రహములకు తెలియవలయును. శని శుక్రుడు కుజుడు చంద్రుడు బుధుడు గురువు ఉదయించుచుండగా క్రమముగా కేంద్రకోణ, చతుర్ఘ అష్ట సప్తమ స్థానములను వృద్ధిచెందించును. శని గురువు కుజుడు పూర్ణులుగా నున్నపుడు క్రమముగా చూతురు. అయన, క్షణ, ఘస్ర ఋతు మాస, షాణ్మాసములు సూర్యునికి కటు, తిక్త, క్షార, మధుర, ఆవ్లు, కషాయ రసములుండును. త్రికోణ స్ధానము నుండి ధర్మాయువు మిత్రుడు. గురుడు, గురు బుధులు, శుక్ర బుధులు, సూర్య రహితులు, కుజరహితులు క్రమముగా చంద్రసూర్య రహితులు, కుజచంద్రార్కర రహితులు, ఇతరులు సూర్యునికి మిత్రులు. పరస్పరముగా ధన, వ్యయ, ఆయ త్రిబంధు వ్యాపార గతుడైనచో మిత్రుడగును. ఏకాను భుక్తములుగా తెలుసుకొని సహజులుగా తెలియవలయును. ఆయాకాలములననుసరించి అధిసుహృత్‌ మిత్ర పూర్వకములను మరల కల్పించుకొనవలయును. తనకు ఉచ్చరాశులందు, త్రికోణరాశులందుండు వారు నవాంశలతో స్ధానముల వలన బలము కలుగును. దిక్కులలో బుధ బృహస్పతులకు, సూర్యకుజులకు, శని విషయమున శుక్రచంద్రులకు ఆకాశమునుండి ఋతువులలో, ఇతరులు సమాగమములో, ఉత్తరమున నున్నవారు దీప్తకారులగుదురు. ఇష్టులైనపుడు వీర్యయుతులగుదురు. రాత్రిపూట చంద్రకుజశనులు ఎల్లపుడు శుభకరులు. ఇతర గ్రహములు పగలు శుభకరులు. వీరు కృష్ణపక్షమున క్రూరులు, శుక్లపక్షమున సౌమ్యులని కాలబలములు బుధులు చెప్పెదరు. శని కుజ బుధ గురు శుక్ర చంద్ర సూర్యులకు పరస్పరాధిక్యము గల వారగుదురు. ఎప్పుడు పాపులు బలయుతులు. సౌమ్యులు స్దానాధీనులుగా నుందురు. క్లీఋలవిషయమున శుక్రుని కంటే చంద్రసూర్యాంశ సమముగానుండును. స్వాంశమున నున్న గ్రహములు పాపులు, పారంశమున సౌమ్యులు వియోనిజమైనపుడు లగ్నభేదమేర్పడును. వియోని జన్మ దుర్బలమగును. శిరస్సు, వక్త్రము, కంఠము, పాదములు, భుజములు, పృష్ఠభాగము, వక్షస్ధ్సలము, పార్శ్వములు, కుక్షి అపానము. చరణములు, మేఢ్రము ముష్కములు (వృషణములు) పుచ్ఛములు, మొదలగు అవయవములందు మేషాది రాసులుండునని తెలియవలయును. లగ్నాంశము నుండి గ్రహయోగమును చూచి బలయుతముగా వర్ణములను చెప్పవలయును. దృక్సమాన ప్రమాణములను ఇష్టమున నున్న రేఖను గుర్తు చేసికొనవలయును. నక్షత్రముల రాశుల త్య్రంశము బలాగ్రముగానున్నపుడు చరమాంశము గ్రహాన్వితముగా నున్నపుడు అంశములో స్ధలమున చంద్రుడు శనికి ద్వీక్షయున్నపుడు యోగభవులు ద్విజులగుదురు. విడిగా ఉన్న చంద్ర గురు సూర్యులచే వృక్షముల జన్మను చెప్పవలయును. స్ధలవృక్షముల జలవృక్షముల భేదము గ్రహముల స్ధితిననుసరించి ఇతరములకు కూడా చెప్పవలయును. లగ్నమునుండి ఎంతమానము గల గృహమున సూర్యుడు అధిపతిగా ఉన్నపుడు అదేసంఖ్యచే స్ధలజలములు జలజములగు వృక్షములుండును. రవి రాశ్యధిపతిగా ఉన్నపుడు అంతస్సారము గల వృక్షములు, శని అధిపతిగా ఉన్నపుడు దుర్భగములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా యున్నపుడు క్షీరములు గల వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు ముళ్ళచెట్లు, గురువు అధిపతిగా ఉన్నపుడు పుష్పితములగు వృక్షములు, చంద్రుడధిపతిగా యున్నపుడు దట్టమగు వృక్షములు, కుజుడు అధిపతిగా యున్నచో కటురసము గల వృక్షములు అశుభనక్షత్రములో శుభగ్రహము శుభకరుడగును. కుభూమిలో పుట్టిన వృక్షము కూడా శుభకరమగును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: