కళాత్మికా

🌹🌹🌹🌹🌹🥀🌹🌹🌹🌹🌹
🌸🌸611. ‘కళాత్మికా’🌸🌸🌸

కళల రూపము గలది శ్రీదేవి అని అర్థము.

కళలు, కాంతులు శ్రీమాత రూపమే. జీవుల స్వభావము కాంతి, తదనుగుణమైన కళ. కళలకు ఆకర్షింపబడని జీవు డుండడు. కళలు తన లోపల, తన వెలుపల దర్శించిన కొలది ఆనందము కలుగును. జీవులు శ్రీమాత నుండి దిగివచ్చిన వారు గనుక వారునూ కళాత్మకులే. ఆమె కళాత్మిక. ఆమె కళతో సరి సమానమగు కళ మరి ఎవ్వరికినీ ఉండును

మన వాఙ్మయము నందు సృష్టి కళలను అనేకానేకముగ వివరించిరి. అగ్ని కళలు ప్రధానముగ ఏడు. వివరముగ నలుబది తొమ్మిది. ప్రజాపతుల కళలు పది. అదితి కళలు పన్నెండు. రుద్రుల కళలు పదుకొండు. చంద్రుని కళలు పదహారు. నక్షత్రముల కళలు ఇరువది ఏడు. అందున వివరముగ చూచినచో నక్షత్రమునకు నాలుగు పాదముల చొప్పున 108 కళలు గోచరించును. ఇట్లు చూచువారికి చూచిన కొలది సృష్టియందు అనేకానేక ప్రభలతో, కళలతో, కాంతులతో శ్రీమాత గోచరించును.

జాగ్రత్, స్వప్న, సుషిప్తి, తురీయ స్థితులను కూడ నాలుగు కళలుగ తెలుపుదురు. ఇందొక్కక్క కళ యందు మరల నాలుగు కళలు కలవు. మరణము, మరపు, మూర్ఛ, బద్ధకము - నిద్ర యందలి నాలుగు కళలు. అభిలాష, భ్రమ, చింత, విషయముల యందు పునఃస్మృతిఅను ఈ నాలుగు కళలు స్వప్నావస్థలు. వైరాగ్యము, ముముక్షత్వము, సమాధి నిర్మలమైన మనస్సు తురీయావస్థలు.

ఇందు నిద్రావస్థలు శివ కళలు, స్వప్నావస్థలు శివశక్తి కళలు. తురీయావస్థలు యోగినీ కళలు. జాగృతి యందు కల నాలుగు కళలు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అవస్థలు.

ప్రజ్ఞా వికాసమును బట్టి కళాత్మిక యగు శ్రీమాతను ఎన్ని కళలుగ అయిననూ చూడవచ్చును
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఓం శ్రీ మాత్రే నమః

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: