చంద్ర శుక్రులు స్త్రీ గ్రహములు
గ్రహములకుఁ బుం స్త్రీ నపుంసక సంజ్ఞలును, పంచ భూతాధిపత్యమునుం జెప్పఁబడినవి. ఎట్లనఁగ బుధశనులు నపుంసక గ్రహము లనియు, చంద్ర శుక్రులు స్త్రీ గ్రహములనియు, సూర్య కుజ గురులు పురుష గ్రహము లనియు, మఱియు నితర గ్రంథములయందు రాహు కేతువులను గూర్చి రాహువు స్త్రీ గ్రహ మనియు, కేతువు నపుంసక గ్రహ మనియును దెలియఁజేసి యున్నారు. మఱి యగ్నికి నంగారకుండును; భూమికి బుధుఁడును; ఆకాశమునకు బృహస్పతియు ను; జలమునకు శుక్రుండును; వాయువుకు శనియును; ముందుగ నగ్నికి సూర్యుండును; జలమునకుఁ జంద్రుండును అధిపతు లని చెప్పఁబడి యున్నది. గనుక, ఈశ్లోకమున సూర్య చంద్రులను గుఱించి చెప్ప లేదు. ఈసంజ్ఞలకుఁ బ్రయోజనము. “ఛాయాం మహాభూత కృతాం చ సర్వే భివ్యంజయంతి స్వదశా మవాప్య." అని దశాఫల మను గ్రంథమునందుఁ జెప్పఁబడి యున్నది.
Comments
Post a Comment