నపుంసక యోగాలు

నపుంసక యోగాలు

బుధసూర్యసుతౌ నపుంసకాఖ్యౌ శశిశుక్రౌ యువతీ నరాస్తు శేషాః |
శిఖిభూఖపయోమరుద్గణానాం వశినో భూమిసుతాదయః క్రమేణ ||

 Listen with complete wisdom. Its all about knowledge.

మహానుభావులు మహనీయులు ఎంతటి గొప్ప సత్యాలను ఆవిష్కరించి చిన్నచిన్న శ్లోకాలలో పెట్టారో తెలియాలంటే... ఇలా ఆలోచించాలి.

జ్యోతిషంలో మూడవ లింగం వారు అంటే మగా ఆడ కానీ వారు చూడాలంటే ముఖ్యంగా 
న్యాచురల్ జోడియాక్ ప్రకారం అష్టమ స్థానము సీక్రెట్ పార్ట్స్  అలాగే 7 వ స్థానం సెక్స్ దోరణి 12వ స్థానం సామర్థ్యం అలాగే 5 వ స్థానం సెక్స్ లో హౌస్ ఆఫ్ ప్లే అంటారు పైన చెప్పిన స్థానాలు జ్యోతిషంలో చెప్పిన స్త్రీ గ్రహాలైన బుధ, శని , రాహు ఉండి కుజుడు (అంటే శక్తి) బలహీన పడినప్పుడు, 
లేదా కుజ, శుక్ర, తుల, వృశ్చికాలలో పరివర్తన ఉన్నపుడు లేదా బుధుడు పంచమ స్థానంలో ఉచ్చ పొందినప్పుడు ఇటువంటి అరుదైన గ్రహ సమూహం ఉన్నప్పుడు,   అలాగే బుధుడు 7 వ స్థానంలో ఉన్నప్పుడు తృప్తికి ముందే స్కలనం కావడం లేదా నరాల బలహీనత వలన సామర్థ్యం లేకపోవడం జరుగుతుంది.

జైమిని మహర్షి చెప్పినట్లుగా ఆత్మ కారకుడు మరియూ లగ్నాధిపతి కూడా శుక్రుడు అయిఉండి రాహు, శనివలన ఎఫ్లిక్ట్ అయితే (శని, రాహు మధ్య పాపకర్తరిలో ఉన్నా) అమాత్యకారకుడు బుధుడు కూడా అయిఉండి ఆరూఢ లగ్నం నుండి 12 వ స్థానంలో బుధుడు, కేతువుతో కలిసి ఉన్నా స్త్రీ గ్రహాలు ఉచ్చలో ఉండి పురుష గ్రహాలు నీచలో ఉంటే వివాహ పొంతనలో ఆలోచించాల్సి ఉంటుంది.

.....
ప్రస్తుత సమాజంలో పెళ్లి అయిన మూడు రాత్రుల తర్వాత బయటకు వచ్చేసి మగవారి మీద - దానికి పనికిరాడు అనే భావనతో వెంటనే కోర్టుమెట్లు ఎక్కి విడాకులు తీసుకుంటున్న సందర్భాలు మధ్యకాలంలో చాలా వింటున్నాము

 కాబట్టి ఒక పురుష జాతకంలో గాని ఒక స్త్రీ జాతకంలో గాని వారు దానికి పనికిరారు - అన్న విషయాన్ని - ఎందుకంటే పెళ్లిళ్లు కుదరడం ఒక ఎత్తు అయితే కుదిరి పెళ్లయిన వివాహాలని నిలబెట్టుకోవడం కూడా చాలా పెద్ద సమస్యగా ఈ మధ్యకాలంలో మారుతోంది. దానిలో ఇది ఒక ప్రధాన కారణంగా ఈ మధ్య వినపడుతోంది. దానికి సమాజంలో ఉండే పని ఒత్తిళ్లు తింటున్న తిండి మానసిక సంఘర్షణలు కారణములుగా చెబుతూ సమస్యల వలయంలో చిక్కుబడిపోతున్నారు.

 Infertility
అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది
అయితే ప్రస్తుతం DRS
చెప్పేది ఏమిటంటే male and female hormones imbalance, obesity
Stress ,, life style . అయితే ఎవరిలో సమస్య అనేది DRS నిర్దారణ చేస్తున్నారు. 
 పూర్వీకులు ఒక పద్ధతి ప్రకారం ఎవరిలో సమస్య అనేది చాలా simple గా చెప్పేవారు.

.....నపుంసక యోగాలు

వీర్యస్థానాధిపే భౌమే
షష్టాష్ట వ్యయరాశిగే
దేహాధిపేన సంయుక్తే
నిర్వీర్యం బ్రహ్మశాపతః

♦️కుజుడు సప్తమాధిపతి యై లగ్నాధిపతితో కలిసి 6-8-12 స్థానాల్లో ఎక్కడైనా ఉంటే బ్రహ్మ శాపం వల్ల  వీర్యం చెడినవాడగును. 

♦️వీర్యాధిపే రవౌయస్య
తస్య వీర్యం బలంచ న
శుక్రేణ సహితేవాఽపి
వీర్యహీనో భవేన్నరః

రవి సప్తమాధిపతి యై శుక్రునితో కలిసి వుంటే ఆజాతకుని బలం వీర్యములు నశించును.

♦️హిబుకే రాహు సంయుక్తే
పాపగ్రహ నిరీక్షితే
లగ్నేశేఽప్యరినీచస్థే
హృచ్ఛూలాత్ శుక్ర నాశనమ్

రాహువు చతుర్థమందుండి పాపగ్రహ దృష్టి పొందగా లగ్నాధిపతి శత్రు, నీచ స్థానాల్లో ఉంటే హృద్రోగం వల్ల శుక్ర (వీర్యం) నాశనం.
ఇవి కొన్ని నపుంసక యోగాలు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: