అసలు మొలతాడును ఎందుకు?

అసలు మొలతాడును ఎందుకు కట్టుకుంటారో వివరించి చెప్పేవారు లేక.. 
ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకొంటున్నారు. 

నిజానికి మొలతాడు ధరించడంలో సైన్స్ ఉంది. మీరు గూగుల్ లో గోల్డెన్ రేషియో అని టైప్ చేస్తే.. సవివరంగా అది సైన్స్ అని మీరు విశ్వసిస్తాను. 1.618 అనేది గోల్డెన్ రేషియో. అంటే.. ప్రతి వస్తువు గరిమనాభి నుంచి ఎత్తును కొలిచి.. పూర్తి ఎత్తుతో ఆ మొత్తాన్ని భాగించాలి. అప్పుడు 1.618 వస్తే.. అది గోల్డెన్ రేషియో (బంగారు నిష్పత్తి) అని అర్థం. ఒక మనిషి మొత్తం ఎత్తును.. బొడ్డు నుంచి తల వరకు ఉన్న కొలతతో భాగించాలి. ఫలితం 1.618 వస్తే.. గోల్డెన్ రేషియో ఉన్నట్లు. లేకుంటే.. లేనట్లు.

ఇంతకీ ఈ గోల్డెన్ రేషియోతో ఉపయోగం ఏమనే సందేహం మీకు రావొచ్చు. ఏ వస్తువుకైనా.. వ్యక్తికైనా.. జంతువుకైనా గోల్డెన్ రేషియో (1.618) ఉండాలి. అలా లేకుంటే.. మానసిక సమతౌల్యత ఉండదు. ఇది సైన్స్ చెబుతున్న విషయం. మరి అందరికీ గోల్డెన్ రేషియో ఉండదు కదా? అలాంటి సందర్భాల్లోనే మన పెద్దలు విరుగుడుగా కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు. అందులో భాగమే మొలతాడును ధరించడం. బొడ్డుకు కింది భాగంలో మొలతాడు ధరించడం వల్ల.. అసమతౌల్యత రూపుమాసిపోయి.. ఆ వ్యక్తికి గోల్డెన్ రేషియో ఫలితం వస్తుంది.

పూజలు చేసేప్పుడు చేతికి కంకణం కట్టడం వెనకా.. ఇదే సైన్స్ ఉంది.. చేతిని మోచేతి వరకు కొలిచి.. గోల్డెన్ రేషియోను లెక్కించాలి. ఇక్కడ గరిమనాభి మన మణికట్టు. మొత్తం చేతి పొడవును.. మణికట్టు వరకు ఉన్న కొలతతో భాగిస్తే.. గోల్డెన్ రేషియో రావాలి. అలా ఉంటే.. చేసే పూజపై చిత్తం ఉంటుంది. లేకుంటే.. మనసు శివుడి మీద.. చిత్తం చెప్పుల మీద అన్నట్లుంటుంది. దానికి విరుగుడు.. కంకణధారణ…

అంతేకాదు.. ఆడవాళ్లు కాళ్ల గజ్జెలు పెట్టుకోవడం.. గాజులు తొడుక్కోవడం.. మంగళసూత్రాలను ఎద కింది వరకు వేసుకోవడం కూడా గోల్డెన్ రేషియోను సంతృప్తి పరచడానికే..

గోల్డెన్ రేషియో లేకుంటే ఏమవుతుంది?? ఈ ప్రశ్నకు శరీరం అసమతౌల్యతకు గురవుతుందని ఇంతకు ముందు చెప్పుకొన్నాం. దీని ప్రభావం వల్ల సంబంధిత వ్యక్తులు గొడవలకు దిగడం.. చెడుమార్గాలను పట్టడం.. నేరాలకు పాల్పడడం చేస్తుంటారు. సాధారణంగా నేరస్తులను జైల్లో పెట్టాక.. మొలతాడు వంటివి తీసేస్తారు. అందుకే వారు జైల్లో వెళ్లాక నేరాల్లో ఇంకా రాటుతేలుతారు. ఇతర ఖైదీల నుంచి నేరాల్లో పాఠాలు నేర్చుకుంటారు.

సహజసిద్ధంగా గోల్డెన్ రేషియో ఉన్న కొన్ని వస్తువులను పూజల్లో వాడడం మనం చూస్తుంటాం.. అవి దక్షిణావర్త శంఖం.. కొబ్బరికాయ… భూమికి కూడా గోల్డెన్ రేషియో ఉండడం వల్లే.. బ్యాలెన్స్ గా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది.
                                
*సేకరణ*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: