డొల్లు కర్తరి ప్రారంభం

_*డొల్లు కర్తరి ప్రారంభం*_
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని *“కర్తరీ”* అంటారు. అంటే భరణి నాలుగో పాదం , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే *“కత్తెర”* అని కూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. 

డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో (డిగ్రీల 23°-20' నిమిషాలు ) నుండి వృషభరాశిలో ( డిగ్రీల 26°-40' నిమిషాలు ). సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే *“డొల్లు కర్తరీ”* ప్రారంభమవుతుంది. దీనినే *"చిన్న కర్తరీ"* అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై *"నిజకర్తరి"* ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.

*కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి :-*

కర్తరిలో గృహసంబంధమయిన పనులు చేయవద్దన్నారు. నాటి రోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేది కాదు. వేసవి నుంచి వడగాలుపుల నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి , కర్ర , రాతి మొదలగు పనులను వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక , కార్మిక పంచాంగం అనవచ్చు. భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు డోల్లు కర్తరి , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం , 
దేనికి కత్తెర ? ఎండలో పనికి కత్తెరన్నమాట. వేసవిలో మే నెలలో కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్ల బడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

కర్తరీలో చెట్లు నరకటం , నారతీయటం , వ్యవసాయం ఆరంభం , విత్తనాలు చల్లటం , భూమిని త్రవ్వటం , తోటలు వేయటం , చెఱువులు , బావులు , కొలనులు త్రవ్వటం , కొత్త బండి కొనటం , అదిరోహించటం , నూతన గృహ నిర్మాణం చేయటం , పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు , దేవాలయాలు కట్టుట చేయరాదు.

*కర్తరీలో చేసుకునే పనులు :-*

కర్తరీలో ఉపనయనం , వివాహం , ప్రవేశాలు , యజ్ఞం , మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: