మణి ద్వీప వర్ణన - 02.

_*మణి ద్వీప వర్ణన - 02.*_
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

*ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ శివ శక్త్యైక్య రూపిణ్యై నమః*

పార్ట్ 1 లో ముందుగ అమృత సాగరము, తరువాత చతురస్రాకరముగా ఉన్నట్టి , లోహ ప్రాకారము, ఆపైన కాంస్య ప్రాకారము, ఆ తరువాత తామర ప్రాకారము అందులో వసంతుడు తమ ఇద్దరు పత్నుల సమేతుడిగా నివసిస్తుంటాడు . సుందరమైన శోభలతో ఉన్నట్టి ఈ వనము కో కిలల నినాదము తో గుంజిత మై ఉన్నది 

తామ్ర ప్రాకారము , తరువాత వచ్చేది గాజు ప్రాకారము , దీని ఎత్తు ఏడు యోజనాలు . ఈ రెండు ప్రాకారాల మధ్యన సంతాన వాటిక ఉంది .ఇందులో అన్నిరకాల వృక్షాలు ఉన్నాయి. ఈ వనములోని పుష్పాల సౌరభము పది యోజనాల వరకు ఉంది . నిరంతరుముగా వికసించే ఈ పూవ్వులు, సువర్ణమయ కాంతులచే శోభిల్లుతున్నాయి . అమృతముచే నిండిన రసాల పలాలు , ఎంతో మధురముగా ఉంటాయి . ఈ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు . అతనికి ఇద్దరు భార్యలు . శుక్ర శ్రీ , శుచి శ్రీ . ఇక్కడ సంతాపమును కలిగినట్టి ప్రాణులు ఈ నీడలో తల దాచుకొని సేద తీరుతుంటారు . ఇక్కడి మూల - మూలలో సిద్ధ పురుషులు ఉంటారు . ఎల్లప్పుడూ సిద్ధ పురుషులు మరియు , దేవతలు తో నిండి ఉంటుంది క్షేత్రము .

రాజా! ఈ గాజు ప్రాకారమును దాటాక , ఇత్తడి ప్రాకారము వస్తుంది . దీని పొడవు ఏడు యోజనాలు పర్యంతం . ఈ రెండు ప్రాకారాల మధ్యన మలయ గిరి వృక్ష వాటిక ఉంది . మేఘాలపైన విహరించే వర్ష ఋతువు , ఇక్కడి అవసరాలను చూస్తూ ఉంటాడు . వీరి నేత్రాలు పింగల వర్ణముతోనూ ఉన్నాయి. ఈయన మేఘాల కవచము తొడుక్కొని ఉంటాడు , వర్షము కురుస్తున్నప్పుడు విద్యుత్ తరంగాలు కలిగి నప్పుడు వచ్చీ , ఉరుములే శబ్దాల ధ్వని . ఇంద్ర ధనుస్సు ఈయన ధనుస్సు . తమ గణాల సహకారముతో కురిపించే వర్షపు ధారలు ఈతని సహజ గుణం. “నభశ్రీ:, నభ్యస్య శ్రీ , స్వరస్యా, రస్య మాలిని , అమ్బాదులా, నిరత్రి, అభ్ర మంతి , మేఘయంతికా, వర్షయంతి, చిబుణికా, వారి ధారా, సమ్మతా. ఈ పన్నెండు శక్తులు వర్ష ఋతువు భార్యలు .

ఈ ప్రాకారము నూతన పల్లవాలు, లతలతో ఎల్లప్పుడూ నిమిడి ఉంటుంది .పలు రకాల వృక్షాలు తో శోభాయమానముగా ఉంటుంది . నదీ నదులు, ఇక్కడ,చాలా వేగముగా ప్రవహిస్తుంటాయి , ఇచట దేవతలు , సిద్ధ పురుషులు మరియు దేవి కొరకు నిరతముగా యజ్ఙ యాగాదుల చేసే పురుషులుంటారు. వాపి, కోప తడాగాలు, చెరువులు, బావులు, సరస్సులు మొదలగు త్రవ్వించి భగవద్ అర్పణము చేసే వారు (ఇలాంటి పుణ్య ప్రద మైన పనులు చేసి పుణ్య ఫలాన్ని భగవదర్పణ ము చేసే మాహానుభావులు ఇక్కడ ఉంటారు , ఎట్టి ఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేసేవారు అన్నమాట ). 

*ఓం శ్రీ మాత్రే నమః ..*
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: