అష్టలక్ష్ములు
🙏🌹అష్టలక్ష్ములు🌹🙏
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత.
వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది.
లక్ష్మి అంటే కేవలము ధనము మాత్రమే కాదు, సంపద, అది అనుభవించడానికి అవసరమైన ఆరోగ్యము, అనుభవించుటకు అవకాశము, తల పెట్టిన ధార్మిక కార్యక్రమములు నిర్విఘ్నముగా జరుగుట, సంఘములో కీర్తి ప్రతిష్ట, మానసిక ప్రశాంతత, తద్వారా నిత్య జపతపాదులు జరుగుట, తన ఇంట్లో వెలసిన కుల దేవత యొక్క పూజ ముందుకు తీసుకు వెళ్ళే సత్సంతానము.. ఇన్ని ఉన్నాయి ఒక్క లక్ష్మి అంటే ..
ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
పాలకలడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ
🙏🌹ఆదిలక్ష్మి..ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
🙏🌹ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది.
రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. వ్యవసాయం దాంతో పాటు మనజీవితాలూ కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే ధాన్యలక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చరంగులో ఉంటుంది. శారీరక ధారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి.
🙏🌹ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. చక్రం, శంఖం, ధనుర్బాణములు, త్రిశూలం, పుస్తకం ధరించి ఉంటుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
సంపదలు లేకపోయిన, మూడు పూటలా నిండైన తిండి లేకపోయినా, పరువుప్రతిష్ట మంటగలసినా, ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వేయలేడు. రేపటి గురించి ఆశతో జీవించలేడు. అందుకు ఈ ధైర్యలక్ష్మీని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు.
🙏🌹గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, రెండు చేతులలో రెండు పద్మాలు కలిగి ఉంటుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ అందించే తల్లి.
గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేం? గజలక్ష్మీ సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీర సాగరమథనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. సఖల శుభాలకు అధిష్టాన దేవత.
🙏🌹సంతానలక్ష్మి : ఆరు చేతులుతో,
రెండు కలశాలు, ఖడ్గం, డాలు ధరించి ఉంటుంది. ఒడిలో బిడ్డ ఉంటుంది. ఒక చేత అభయముద్ర కలిగి, మరొక చేతిలో బిడ్డను పట్టుకుని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. జీవితంలో ఎన్ని సిరులన్నా, సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. తమతో తరం ఆగిపోతుందన్న బాధ పీడిస్తుంది. ఇలాంటి వారి ఒడిని నింపే సంతాన లక్ష్మీ ఆరు చేతులతో దర్శనిమిస్తుంది. సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
🙏🌹 విజయలక్ష్మీ : ఎనిమిది చేతులుతో,
ఎర్రని వస్త్రాలు ధరించి, శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాశం ధరించిన అవతారంతో ఉంటుంది. రెండు చేతుల వరదాభయ ముద్రలతో ఉంటుంది.
విజయమంటే కేవలం యుద్దరంగంలోనే కాదు., యుద్దానికి ప్రతిబింబమైన జీవితపోరాటంలోనూ అవసరమే! చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటుంటారు. సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత.
🙏🌹విద్యాలక్ష్మి : శారదా దేవి. చదువులతల్లి. చేతియందు వీణ వుంటుంది.
జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, అటు ఆధ్యాత్మికంగాను, ఇటు లౌకికమైన జ్జానాన్ని ఒసగే తల్లి ఈ విద్యాలక్ష్మీ.
ఒకరకంగా సరస్వతీ దేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి.
🙏🌹 ధనలక్ష్మీ : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి, శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన అవతారంతో ఉంటుంది. అభయ ముద్రలో నున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి. భౌతికరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే. ఆ సంపదని ఒసగి, దారిద్య్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మీ.
అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు సమృద్ధికి సూచనగా సూచించే కలశం దర్శనమిస్తుంటుంది.
🙏🌹ఓం శ్రీమాత్రే నమః 🌹🙏🙏🌹🙏🌹🙏🌹
Comments
Post a Comment