రసవాద విద్య - మూలికలతో బంగారం చేయు విద్య

రసవాద విద్య - మూలికలతో బంగారం చేయు విద్య 

         ప్రాచీన కాలంలో వనమూలికలు తోను, పాదరసంతోను కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ప్రతీతి. 10 వ శతాబ్దంలో కృత్రిమంగా బంగారం రూపొందించే ప్రక్రియ వ్యవహారంలో ఉండేది. 11 వ శతాబ్దంలో ఆల్బెరూని అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడ సిద్దులు బంగారం తయారుచేసేవారని పేర్కొన్నాడు నాగర్జునికి ముందు, తరువాత కూడా ఎన్నో గ్రంథాలలో బంగారం తయారుచేసే పద్దతులు, ప్రస్తావనలు ఉన్నాయి. దేశంలో కరువుకాటకాలు సంభవించినప్పుడు రసాయనాచార్యులు కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ఆ బంగారం వల్ల ప్రజలు ఆకలిచావుల నుంచి రక్షించబడే వారు అని అనేక గ్రంథాలలో ఉంది.

                  రాగి మొదలయిన చవుక లోహాలని సువర్ణంగా మార్చే విద్యని రసవాద విద్య అని అంటారు. కొన్ని ప్రదేశాలలో " స్వర్ణ కరణి " పగార విద్య అని కూడా అంటారు. ఈ విద్యని ఉర్దూ భాషలో " కీమియా " అని, ఇంగ్లీషు భాషలో "ఆల్కెమీ " అని అంటారు. ఆధునిక పరిశోధకులు బంగారం పదార్దం కదా! దానిని సృష్టించుట యేమి అంటారు. పిచ్చి అనికూడా అంటారు.

          రసవాద విద్య ప్రకారం నీచ లోహాన్ని ఉత్తమలోహంగా మార్చే ఒక వస్తువుని
 " పర్శవేది " అంటారు. ఈ పరుశవేది రాయి అని, ద్రవపదార్ధం అని, గడ్డిలాంటిది అని తర్జనభర్జన చేసిన వారిలో మనదేశియులే కాక " బ్రవున్ దొర " లాంటి విదేశీయులు ఉన్నారు. రసవాద విద్యలో పాదరసాన్ని శుద్ది సంస్కార విధానాలతో ప్రభావితం చేసి చవుకలో బంగారంగా మార్చడం మరొక సామెత కూడా ఉంది. ఇతర విదానాలతో స్వర్ణం చేయడం సిద్ధించక బ్రష్టుడై పిచ్చివాడు కావొచ్చేమో కాని రసవాద విద్యలో భ్రష్టుడైనా ఫలితం ఉంటుంది. ఎందుకంటే రసవాద విద్య తెలిసినవాడు అనేక ములికలుపైన పరిశోధిస్తాడు కావున ఒక మంచి వైద్యంలో శ్రేష్టుడు అవుతాడు. అయితే ఆదునిక పరిశోధకులు అన్నట్లు బంగారం ఒక మూల పదార్దం ( ఎలిమెంట్ ) అణు సంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 సూచికా అన్నం A U కాంతి లోహ సమ్భన్ధమైనధి. 

        రసవాద విద్య నందు ఆరితేరిన వారిలో ఆదిమ చంద్రసేనుడు, లంకేశ్వరుడు ( రావణుడు ) మత్తమాన్డవ్య ఇంద్రధత్త కలంబి, నాగార్జునుడు, రుశిశృంగ, రసేన్ద్రతిలక, భాలుకి, మైధిల హరీశ్వర మొదలుగా గల 27 మహామహుల చేతను, సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్బాట చార్యుడు, వేమనయోగి ముఖ్యులు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: