అపరాజిత పృచ్చ నుండి
ఓం శ్రీమాత్రేనమః
అపరాజిత పృచ్చ నుండి
ఆగ్నేయ ప్లవకా భూమి రగ్నిదాహ భయావహా
శత్రు సంతాపదా నిత్యం కలిదోఽగ్ని ప్లవః స్మృతః
ఇంటికి చుట్టూ ఉన్న స్థలం లో ఆగ్నేయ దిశ పల్లంగా ఉంటే భయము, అగ్ని ప్రమాదములు, శత్రువులు, సంతాపము పాపకృత్యములు చేయుట వంటి ఫలితములు కలుగుతాయి.
ధన హానికరో నిత్యం రోగకృద్దక్షిణ ప్లవః
నశ్యంతి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
దక్షిణం పల్లముగా ఉన్న భూమి ధనహాని రోగములు కలిగించును. ఆ ఇంట్లో పురుషులు మరణిస్తారు. అటువంటి స్థలంలో దేవాలయం కూడా రాణించదు
ప్రవర్తయేద్గృహే పుంసాం రోగాంశ్చ మృత్యుదాయకాన్
ధనహాని స్తథా నిత్యం కురుతే నైఋతి ప్లవా
నైఋతి పల్లము నిత్యం ధనహాని, రోగములు, అపమృత్యువును ఇస్తుంది.
పశ్చిమ ప్లవకా భూమి ర్థనధాన్య వినాశనీ
శోక దాహ్యం కులం తత్ర యత్ర భూః పశ్చిమ ప్లవా
పడమర పల్లము గల భూమి ధన ధాన్యములను నాశనము చేయను నిరంతర శోకమును కుల నాశనమును కలిగించును.
శత్రుకర్త్రీ విరాగేచ గోత్రక్షయ కరీతథా
గృహే కన్యకా హంత్రీ సదా దుఃఖ భయావహా
భుక్తం న జీర్ణ్యతే తస్య మహ్యాం తత్రీతు యోవసేత్
ఏతాన్ దోషానావహతి దోషదా వాయు దిక్ప్లవా
వాయువ్యం పల్లమైతే శత్రుత్వము, విరాగత్వము గోత్రక్షయము , సదా దుఃఖము, భయము, అజీర్ణ రోగము మొదలగు దోషములు కలుగును.ఆ స్థలము స్త్రీ ధనముగా మారును.
మధ్య ప్లవా నికృష్టాస్యాత్కనిష్ఠా మధ్యవర్తికా
సర్వనాశకరీ పుంసాం సా భూమిస్తు నివాసినామ్
8 దిక్కులలోను ఎత్తు కలిగి మధ్య పల్లమైన భూమి నికృష్టమైనది. అందు నివసించువారు సర్వనాశనమును పొందుదురు
Comments
Post a Comment