కాన్సర్ అంటే మరణ కంతి.

కాన్సర్ అంటే మరణ కంతి.

మానవ శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మితమవుతుంది సాధారణంగా కణజాలాలు పెరిగి విభజన చెందుతాయి.

ఆ విభజన కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం అవసరం. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది శరీరానికి అవసరం లేకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాప కణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా కణాల సముదాయం కంతి లాగా లేక గడ్డలాగా ఏర్పడతాయి. దీనినే కాన్సర్ అంటారు. మరణ కంతి అని కూడా అంటారు. కొన్ని గడ్డలు అపాయ కరమైనవి కాదు. వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు.

అపాయకరమైన కంతుల విషయానికొస్తే వీటిలోని కణాలు అసాధారణంగా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కంతుల నుండి విడిపోయి దూరంగా రక్తస్రావంలోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి.
ఈ క్యాన్సర్ వ్యాధి ఆకస్మికంగా వచ్చే వ్యాధి. ఇది ప్రాణాంతకమైనది.మరణానికి దారితీస్తుంది.

వీటికి జ్యోతిష కారణాలు యోగాలు పరిశీలిస్తే

♦️రాహు లగ్నంలో గానీ చంద్రుడితో గానీ స్థితి నొందితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆరో భావాధిపతి లగ్నంలో గానీ 8 వ భావంలో గానీ 12 వ భావంలో గానీ స్థితి నొంది 
♦️ రాహు కేతు కక్ష్యలో ఉంటే క్యాన్సర్ వస్తుంది.
రాహు కేతువులు 6,8,12 భావాలతో సంబంధం కలిగి ఉన్న క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. చంద్రుడు కారకాంశ రాశి, 4వ భావం రాహు కేతు శని వలన వేదనొందితే రొమ్ము క్యాన్సర్ వస్తుంది.

కుజుడు ఎర్రరక్తకణాలను హెమోగ్లోబిన్ మరియు ఎముకలలోని మజ్జని సూచిస్తాడు. 
♦️ కుజుడు, రాహు కేతువు శని వలన వేద పొందితే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది.
♦️ బుధుడు పాపగ్రహాల వలన వేద పొందితే చర్మ క్యాన్సర్ వస్తుంది.
♦️ రవి, రాహు, కేతు శని వలన వేద పొందితే క్యాన్సర్ వస్తుంది.
♦️రాహు, శని కలిసి ఆరో భావంలో ఉన్నా క్యాన్సర్ వస్తుంది.
♦️ చంద్రుడు ఏరాశిలో నయినా మూడు గ్రహాలతో పాప గ్రహాలతో వేద పొందితే క్యాన్సర్ వస్తుంది.
♦️ శని కేతువు గురువు కలిసి ఏ రాశిలో నైనా ఉన్నా,
♦️ గురువు,కేతు,శుక్రుడు కలిసి ఏ రాశుల పైన ఉన్నా,
♦️ చంద్రుడు, కేతు, శని కలిసి ఉన్నా,
♦️ చంద్రుడు కేతువు కుజుడు కలిసి ఉన్నా,
♦️ చంద్ర, రాహు, శని యుతి వలన
ఆరో భావం స్థిరరాశి అయి, అందు కుజుడు ఉన్నా,
ఆరో భావం ద్విస్వభావ రాశి అయి అందులో శని ఉన్నా,
♦️రాహు మానసిక రుగ్మతకు, పిచ్చికి, కుష్టు రోగానికి మరియు క్యాన్సర్ వ్యాధికి వివిధ శరీరభాగాలకు వచ్చుటకు కారకుడు.

సాధారణంగా భచక్రంలో1,6, 8 స్థానాధిపతులు 
♦️ రాహు కుజ, శనులతో సంబంధం క్యాన్సర్ వ్యాధికి కారణం అవుతుంది.
ఈ కాంబినేషన్ ఉండగానే క్యాన్సర్ వస్తుందని అని భయపడ అవసరం లేదు దీనికి 
♦️ఇరవై రెండవ ద్రేక్కాణం, 64వ నవాంశ చూడాలి.

 పైన చెప్పబడిన గ్రహాలు జరుగుతున్న పాప గ్రహ దశలో పాపత్వాన్ని కలుగచేసి జాతకునికి అనారోగ్యం కలుగజేస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: