జ్యోతిషశాస్త్ర విషయములు*....

*జ్యోతిషశాస్త్రము నందు ముఖ్యమైన విషయములు*....
(1)జాతకునికి లగ్నాధిపతి మహా దశ లో విజయము,భోగభాగ్యములు వృద్ధియగుట,విదేశీయానము,వాహన సౌఖ్యము కలుగుట.(2)ద్వితీయాధిపతి మహార్దశ లో ధనవృద్ధి,కుటుంబవృద్ది,సంపదలు పెరుగుట జరుగును.కానీ మారక దోషము కూడా కలుగ గలదు.
(3)జాతకునకు తృతీయాధిపతి దశ లో సోదర లాభములు,కనిష్ట భాతృవృద్ది,కొలదిగా దేహ అనారోగ్యములు,ధైర్య సాహసములు,కర్ణ రోగములు కలుగ గలవు
(4)జాతకునకు చతుర్ధాధిపతి దశ లో గృహములు,వాహనములు,మాతృసౌఖ్యము,విద్యాభివద్ధియు కలుగ గలదు.
(5)జాతకునకు పంచమాధిపతి దశ లో సంతానవృద్ధి,దేవతారాధన,తీర్ధయాత్రలు మొదలగునవి జరుగును.
(6)జాతకునకు షష్టమాధిపతి దశ లో రోగములు,శతృవృద్ధి,ఋణములు మెుదలగునవి జరుగును
(7)జాతకునికి సప్తమాధిపతి దశ లో వివాహము,కళత్ర సౌఖ్యము,స్త్రీ సౌఖ్యము ప్రాప్తించును.
(8)జాతకునికి అష్టమాధిపతి దశ లో కష్టములు,నష్టములు,మనోవిచారములు,అపవాదులు,ధనము కోల్పోవుట,సౌక్యహీనత కలుగును.
(9)జాతకునికి నవమాధిపతి దశ లో భాగ్యవృద్ధి,తీర్థయాత్రలు,విదేశీ ప్రయాణములు,దేవతోపాసన కలుగ గలవు.
(10)జాతకునికి దశమాధిపతి శ లో ఉద్యోగప్రాప్తి,ఉద్యోగాభివృద్ధి,తల్లిదండ్రులకు కర్మ చేయుట జరుగ గలవు.
(11)జాతకనకు లభాధిపతి దశ లో ఆకస్మక ధన ప్రాప్తి,నష్ట ద్రవ్యప్రాప్తి,విదేశీయానము జరుగ గలదు.
(12)జాతకునికి వ్యయాధి పతి దశ లో వృధా ధన వ్యయము,అధిక ఖర్చులు,విదేశీయానము,కర్మలు చేయుట కలుగును..
(13)జాతకనకు మహార్దశ మెుదటి అంతర్దశ లో సామాన్యముగా వుండును,మహార్దశానాధుడు ఉఛ్ఛ లో వున్నను మెుదటి అంతర్దశ లో ఉచ్ఛ ఫలితాలు అంతగా కనిపించవు.
(14)మహార్ధశ చిట్టచివర అంతర్దశ దశాచ్ఛిద్రము అనబడును.దశాచ్ఛిద్రములో జాతకునికి కష్టనష్టములు ఆరోగ్యభంగములు ప్రమాధములు జరుగ గలవు
(15)మహార్ధశానాధుడు నుండి అంతర్ధశానాధుడు షష్టాష్టకములు(6,8)ద్వి ద్వాదశములు(2,12)కలిగిన యెడల ఆ సమయంలో జాతకునకు కలసి రాదు అనగా వ్యతిరేక ఫలితాలు కలుగును.
(16)మహార్ధశానాధుడు నుండి అంతర్దశానాధుడు (5,9)(4,10)(3,11)స్థానాలలో వున్నయెడల జాతకునికి ఆ సమయంలో మంచి ఫలితాలు కలుగ గలవు.దశమాధిపతి మహాదశ లో భాగ్యాధిపతి అంతర్దశ,భాగ్యాధిపతి మహాదశ లో దశమాధిపతి అంతర్దశ బాగుగా యెూగించ గలదు.
(17)జాతకునికి 9వ స్థానాధిపతి మహాదశ లో,5వ స్థానాధిపతి అంతర్థశ, 5వ స్థానాధిపతి మహాదశ లో 9వ స్థానాధిపతి అంతర్థశ బాగుగా యెూగించును.
(18)9వ స్థానంలో ఉచ్ఛ గ్రహమున్నయెడల లేకా 9వ స్థానాధిపతి ఉచ్ఛ యందు వున్న యెడల జాతకుని తండ్రి జీవితంలో మంచి అభివృద్ధి లోనికి వచ్చును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: