కాల సర్పదోషం గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది.

కాల సర్పదోషం ఏదైనా మిగతా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది.

🔵 సహజ శుభగ్రహాలు గురువు, పాపులతో కలవని బుధుడు శుక్రుడు అలాగే పాపత్వం పొందని చంద్రుడు వీరిలో ఏ గ్రహమైనా బలంగా ఉంటే కాలం సర్పదోషం బాధించదు. 

🔵 కాల సర్ప దోషం కల్గించే రాహు కేతువులు యోగ కారక గ్రహంతో కలిసినా లేదా యోగ కారక గ్రహ నక్షత్రాలలో ఉంటే కూడా కాలసర్పదోషం ప్రభావం ఉండదు.
 
♦️కాల సర్పదోషం దేశ గోచారానికి ఎక్కువగా చూడాలి అని చెప్పబడినప్పటికి జాతకులమీద కొంత ప్రభావం చూపిస్తోంది అని ఋజువు అయింది ఏ కాలం సర్పదోషం అయినా పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఈ యోగం గురు చండాల యోగం కంటే ప్రమాదకరం.

పరిహారాలు ఒక్కో కాల సర్పదోషానికి ఒక్కో విధంగా మారుతున్నాయి మొత్తంగా అన్నింటి ముఖ్యంగా పరిహారం గమనిస్తే 

పంచాక్షరి మంత్రాన్ని 21×108 ప్రతిరోజూ పఠించాలి. 

మహా మృత్యుంజయ మంత్రం 1,25000 పఠించాలి. శివుని కాలసర్ప మహాపూజలో జంట సర్పాలు గల 11వెండి ప్రతిమలు 
పాలు, పెరుగు, పంచదార చందనం, గంగాజలం బియ్యం, బిల్వ పత్రం, 21తెల్ల జిల్లేడు పూలు, 21తామరపూలు, పండ్లు శివునికి సమర్పించాలి.
 
స్నానానంతరం నవగ్రహ స్తోత్త పారాయణ చేయాలి. 

ఇలా శక్తి కొద్దీ స్వామిని సేవిస్తే ఈ దోషం గురించి విముక్తి చెందవచ్చు. 

అదే ఈ దోషం ఉన్నా లేకపోయినా 6, 8, 12 రాశులలోని నక్షత్రాల సంబంధం రాహువు కేతువు లకు ఉంటే కాలం సర్పదోషం ప్రభావం కంటే కూడా ఎక్కువ పాప ఫలితాలు కలుగుతాయి.

🔵 అదే దోషం కోణాధిపతుల నక్షత్రాల్లో స్థితి పొందిన రాహుకేతువులు యోగాన్నే కలుగజేస్తున్నారు. 

జంట సర్పాలున్న వెండి ప్రతిమను రాగి పాత్రలో నీరు పోసి పైకి తేలునట్టుగా ఉంచాలి 

కాలసర్పదోష నివారణ యంత్రాన్ని ఇంటిలో ప్రతిష్టించి ఆవనూనెతో దీపం వెలిగించి పూజించాలి .

🔵 కాల సర్ప దోషం 35 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం ఉండదని తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: