మనస్యేకం🙊వచస్యేకం🙉కర్మణ్యేకం👣

🌼ll Il🌼
☣️┄┅═══❁❁✿🏵✿❁❁═══┅┄☣️

🙈మనస్యేకం🙊వచస్యేకం🙉కర్మణ్యేకం👣

పర అంటే ఏమిటి?

వేదాంతము:- వేదాంతము అనగా అతి 
ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంథముల చివరి భాగములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. 

వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంథము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌ రుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంత మును 'ఉత్తర మీమాంస'అని కూడా 
చెప్పబడింది. అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం.
ఈ నామం'పూర్వ మీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంబంధించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం).

వేదములే మన మనుగడకు ఆధారము.bఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, 
నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు. 
నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండుభాగములుగా విభజించవచ్చు మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొనవచ్చు.  

ప్రతి వేదములోని ప్రథమభాగములో, కర్మఖాండ విషయములు అనగా ధర్మ భద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి ఉన్నా యి. దీని ఆధారముతోనే మనుస్మృతి (మనువుచే వ్రాయబడినది, ధర్మ సూత్రములు (జైమిని కారులచే వ్రాయబడినవి) వచ్చాయి. యోగాదులు, ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పన వుసరము లేదు. హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మ సూక్ష్మములు ఇక్కడే లభ్యం. దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుం దాము.

ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిష త్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది ఉన్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యాన ములు వ్రాసి ఉన్నారు. అవే మనకు రక్ష అయిఉన్నాయి. పరమాత్మ, సృష్టికర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసు కోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.

ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందు వలననే వానిని అపౌరుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు (ఉపనిషద్ భాగమునకు) 
రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య, (అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యం అని బోధించుతారు. ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగా నిషేధించ బడుతుంది. కర్మ ఖాండ నిషేధమునకు ఒప్పుకొగల్గిన, శమ దమాదులు కలిగిన ఉత్తమ అధికారత్వము పొందిన వారికి మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది. శాస్త్రం వారిని కశ్ఛిత్ ధీరాః" ఒకానొక ధీరుడు లేక వివేకి మాత్రమే ఈ శాస్త్రార్ధం గ్రహించగలడు అని నిష్కర్షగ చెప్తుంది.

పూర్వపు రోజులలో, వర్ణాశ్రమ ధర్మము ననుసరించి, బ్రహ్మచర్యములో గురుకులములకు వెళ్ళి వర్ణముతో నిమిత్తము లేకుండ, విద్యనభ్యసించ వలెను. తరువాత గృహస్తాశ్రమములో తాము మునుపటి ఆశ్రమములో అభ్యసించిన విద్యతో, ధర్మమార్గములో జీవనము సాగించెడివారు. వర్ణాశ్రమ ధర్మముల గురించి ఇంకను 
వివరముగ చెప్పవలసి ఉంది.

ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రహ్మచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుచేలుడు, అన్న బలరాముడుతో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు. అందువలననే గీత ఉపనిషత్ 
సారాంశము అయినది. అందులో పర, అపర విద్యలు (అపర విద్య=కర్మఖాండ, పర విద్య=పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తయి. అంటే జీవన విధానము (ధర్మ, అర్ధ, కామ)+జీవన రహశ్యము (మోక్షము) ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు. ఇదే పూర్ణ విద్య.

ఈ రెండు విద్యలను, రాములవారు తన 
బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది. దానిని గీత అన్నను సరియే అగును. కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది. ఇది మరుగుపడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలలేదు. రహస్య మేమిటి. ఇది ఆతని అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు.

🌹తారా'బలం - దశమహా విద్యలు

(తారా భక్తులైన శ్రీ దుడ్డు పూర్ణానంద శర్మ గారు అందించిన విషయాలు)

గురువుగారు ఒకసారి అమ్మవారికి 
నమస్కరించి చెప్పడం మొదలు పెట్టారు. ఆయనలో ప్రత్యేకత.. చిన్న విషయాలని సూక్ష్మ దృష్టితోనే కాకుండా, విశ్లేషణాత్మకంగా భిన్న దృక్పధాలతో అనేక విషయాలని అన్వయిస్తూ చూడగలగడం.

"ఈ విశాల సృష్టికి వరప్రసాదం లాంటిది శబ్ద శక్తి. ఈ శబ్ద శక్తి 'పర' 'పశ్యంతి' 'మధ్యమ' 'వైఖరి' అనే నాలుగు రకాలుగా విభజించబడింది. బయటికి మనం మంత్రాలు గట్టిగా చదువు తామే అది వైఖరి అన్నమాట. మధ్యమ పెదవులు కదుపుతూ నెమ్మదిగా చదివే పూజ మంత్రాలు అలాంటిది.

పశ్యంతి మౌనంగా మనసులో చేసే ధ్యానం.
పరా వీటన్నిటికి అతీతమైనస్థితిలో ఉండే శబ్దశక్తి.

భవతి పరవాక్ భైరవ్యాఖ్యా
పశ్యంతి సాకధితా తారా
రసనిధి మాప్తా జిహ్వరంగం
మాతంగీతి ప్రధితా సేయం
 - ఉమ సహస్రం (కావ్యకంథ వాసిష్ఠ గణపతి ముని)

మూలాధారంలో ఇమిడియున్న ఈ శబ్ద శక్తి త్రిపుర భైరవి స్వరూపమున పరావాక్కుగా చెప్పబడుతోంది. ఈ శబ్దనాదమే హృదయమున పశ్యంతి రూపుగా (పశ్యంతి అంటే అన్నిటిని చూచునది గ్రహించునది అని అర్ధం) దృష్టిని పొందుతూ "తార"గా వెలుగొందుతోంది. భాషా వ్యాప్తికి మూలము, అక్షర బ్రహ్మయగు "ఓం" కూడా తార నుండే పుట్టిందని అని చెపుతారు.

"గురువుగారు తారని ఓంకార స్వరూపంగా చెపుతారు. అది నిజమేనా? అని ఒక శిష్యుడు అడిగాడు.

మహా తపస్వులు యోగులు అయిన గణపతి ముని అదే చెప్పారు. సృష్ట్యాదిలో ఉన్న మౌలిక మౌనాన్ని ఖండిస్తూ "ఓం" అనే అక్షరం పుట్టింది కదా! అది తారా స్వరూపం పూర్తిగా కాదు.
 ఎందుకంటే ఓం అనగానే అది ఖండితమైనది - అందుచేత అనంతమైన పరబ్రహ్మత్వాన్ని చూపలేదు. మనమ అఖండితమైన "ఓం" ని దర్శించగలిగితే అదే తార స్వరూపం" అని చెప్పారు గురువు గారు.

కొంచెం అర్ధం కాలేదు, మళ్ళీ చెప్పగలరా 
గురువు గారూ? అని ఒక శిష్యుడు అడిగాడు.

గురువుగారు వివరంగా చెప్పారు, ఇది అర్ధం కావాలంటే, ఒక మహా సముద్రం ఊహించు. అది అఖండిత ఓంకారం అనుకో. మనం సముద్రం ఒడ్డున ఉండి ఒక బకెట్ సముద్రం నీళ్ళు తీసు కుంటే అప్పుడు ఆ బకెట్ చూపించి నువ్వు 'సార్ ఇది సముద్రం అంటే అది నిజమా? ఆ పాత్రలో నీళ్ళూ, సముద్రం నీళ్ళు ఒకటైనా బకెట్లోది సముద్రం కాదు. అలాగే "ఓం" అని ఉచ్ఛ రించినప్పుడు ఆ అనంత సృష్టి ఓంకారం వ్యక్త తలంలోకి వచ్చి దాని మూలతత్వం నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆగి అర్ధం చేసుకుంటే ఆ మూల తత్వమే"తార" ఆ ఆది ప్రణవనాదం తార. తంత్రాలు చిన్న చిన్న మం త్రాలు ఆ మహాశక్తిని ప్రతిఫలించగలవే కాని పరి పూర్ణంగా అవి "తార" స్వరూపం కాదు. చిన్న అద్దంతో సూర్యకాంతిని ప్రతిఫలింప చేయగలం, కాని ఆ అద్దమే సూర్యుడు కాదు.

అందుకే హిమాలయ యోగులు, పూర్వపు ఋషులు అలా సంవత్సారల తరబడి 
తప్పస్సు చేసారు అఖండిత, అనంతత్వాన్ని మంత్రంతో పొందడానికి. అని ముగించారు.

జిహ్వయందు కల రసముల కలయికచే 
యేర్పడు తారాదేవి శక్తినే "సరస్వతి" గా చెపుతారు. ఈ విధంగా తార అఖండ విద్యకు అధిదేవత. అందుకే మంత్ర శాస్త్రం తారని "నీల సరస్వతి" గా కొనియాడుతుంది.

వాక్కుపై అధికారం సంపాదించుటకు చదువుతో బాటు సాధన అవసరం. దీనికి ఉపాసన ఉపయోగపడుతుందనడానికి ఓ మంచి సంఘటన ఉంది. గణపతిముని బెంగాలులో ఒక సభలో ఆశువుగా పద్యం చెపుతుండగా ఆయనకి నాలుక తొట్రుపడిందిట. అప్పుడు సభాధ్యక్షుడు ఆయన్ను "నువ్వు తారను ఉపాసించలేదా? " అని అవహేళన చేశారుట. అప్పటికింకా దక్షిణ భారతీయులకు పెద్దగా తార గురించి 
తెలియదు. గణపతిముని అప్పటి నుండి తార ఉపాసన చేసి సిద్ధిపొంది కావ్యకంఠ బిరుదాంకితులై దక్షిణ భారతంలో కూడా తారా సాధనని, దశ మహావిద్య సూత్రాలని ప్రచారం చేశారు. ఆశ్చర్యమేమంటే మౌనమునిగా ఉన్న భగవాన్ రమ ణమహర్షి అంతటి వారి మౌనాన్ని ఖండింపచేసే శక్తి గణపతి మునికి తారయే ఇచ్చిందేమో! అనేక సంవత్సరాల మౌనం తర్వాత గణపతి మునిని చూడగానే రమణ మహర్షి నాయనా! అని సంబోదించారుట.శఅప్పటి నుంచే గణపతి ముని పేరు నాయనగా ప్రసిద్ధి గాంచింది. 
రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది గణపతిమునే!

తంత్రంలో ఒక చిత్రం ఉంది. తారా మంత్ర ఉపదేశాన్ని స్త్రీల ద్వారానే తీసుకుంటారు. ఇంకో విశేషయ మేమంటే ఆవిడ మంత్రంలో "స్త్రీం" అనే బీజాక్షరం కూడా ఉంటుంది. తారా పంచాక్షరి తంత్రంలో ఇలా ఉంది.

ఓం హ్రీం స్త్రీం హూం ఫట్

అంటే స్త్రీ రూపంగా ఉన్న మాతృతత్వాన్ని దివ్యత్వాన్ని పూజించడం అన్న మాట! అందుకేనేమో తారా ఉపాసన సిద్ధించాలంటే ఇంకో నియమం కూడా మంత్ర శాస్త్రంలో ఉంది. స్త్రీలెవ్వరు శత్రువులు ఉండకూడదు - అప్పుడే తార సిధ్ధి స్తుంది.

రూపంలోనే కాక తత్వంలో కూడా కాళి, తార దగ్గరగా కనిపిస్తారు. క్రోధంతో ఉన్న కాళినిశాంత పరచడానికి పరమ శివుడు శిశు రూపం (వటుక భైరవుడా?) ఎత్తగా పుత్రవాత్సల్యంతో కాళి శాంతించిందిట. క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలంతో సొమ్మసిల్లిన శివుడికి "తార" జగ జ్జననియై స్తన్యమిచ్చి సేదతీర్చిందిట. ఈ నమ్మకం పశ్చిమ బెంగాల్ లో ఉన్న "తారాపీఠ్" లో తార రూపంలో కనిపిస్తుంది. అక్కడ తార ఒడిలో శివుడు బాలుడై ఉంటాదు.

మరి తార చేతిలో కత్తెర ఏమిటి అన్నమాటకి సిద్ధులు ఇలా వర్ణించారు. కత్తెర విద్య అవిద్యకి చిహ్నం అని రాబర్ట్ స్వబోధ అభిప్రాయపడ్డారు. 
ఏదైనా పదునైన ఆయుధం చురుకుదనాన్ని తెలియచేస్తుందని మనం అనుకోవచ్చు.
తరింపచేసేదిగా తారని చూసినప్పుడు అనవసర యాతన'ని తొలగించి 
ముక్తికలిగించేది అని చెప్పొచ్చు. యోగ శాస్త్రంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులని (ముడులు) విచ్చేధించేదిగా కుండలిని తత్వంలో భావించవచ్చు.

తార ఒక రూపం చేతిలో కమలం హృదయ వాసినిగా, అష్ట సిద్ధికి ప్రతీక. స్త్రీరూపంలో "తార" పురుషరూపంలో "రుద్రుడు" అని అంటారు. ప్రాణులను సంకట స్థితినుంచి తీరమునకు దాటించే దేవతా శక్తిగా చెపుతారు. విష్ణు దశావతారములలో చెప్పబడిన శక్తియొక్క దశమహావిద్యలను పరిశీలిస్తే తారను శ్రీరాముని అవతారశక్తిగా పండితులు దర్శిస్తారు. శ్రీరాముడు సాగరాన్ని దాటడమే కాక ఆయన్ని కొనియాడేమంత్రం తారక మంత్రం కావడం విశేషం.

మాష్టారికి దేవతలు మన మంత్రాలకి 
ప్రతిస్పందిస్తారా? అని రిసెర్చ్ చెయ్యడం ఇష్టం. ఒక సారి ఒకాయన అడిగారుట - ఏమండీ తారకి గులాబి రంగు అంటే ఇష్టం అని ఒక పుస్తకంలో రాశారు, నిజమేనా? అని. దానికి మాష్టారు, ఆ విషయం తారనే అడుగుదాం అని కళ్ళు మూసుకుని తార మంత్రం చెయ్యగానే అక్కడే ఆ ఎయిర్ పోర్ట్ లో పింక్ రంగు ధరించిన ఒక చిన్న అమ్మాయి ఎదురుగా రావడం సంభవించిందిట.' అవును పింక్' అన్నారు మాష్టారు.

ఉపాసకులకు, భక్తులకు త్వరగా ఆమె పలుకు తుందడానికి ఇంకో సంఘటన కూడా 
చెప్పొచ్చు ఒకళ్ళు తారా హోమం చేస్తుంటే తారా అవాహన చేయగానే అప్పటి దాకా లోపల ఆడుకుంటు న్న పిల్లలు బయటకు రావడం వాళ్ళ చెతులో ఉన్న పింక్ బాల్ ఎగురుకుంటూ వచ్చి హోమ గుండంలో పడడం జరిగిందిట.

జ్యోతిష్యాస్త్రంలో కృష్ణమూర్తి పద్ధతి చాలా ప్రఖ్యాతి గాంచింది. దీన్నే కే.పీ సిస్టం అంటారు. అందులో 27 నక్షత్రాధిపతులకు 
ప్రాముఖ్యతనిస్తారు. ఇది తారా (స్టెల్లార్) జ్యోతిష్యం. విశేషమే మంటే కే.పీ గారు మహా గణపతిని, తారా రూప మైన నీల సరస్వతిని ఉపాసించేవారు.

తారని బుద్ధిజంలో చైనీస్ 'క్వాన్ ఇం' గా పిలుస్తారు అంటే కరుణ దేవత అని అర్ధం. ఆ కరుణరూపిణి జగన్మాత ఆశీస్సులు ఈ తెలుగు సంవత్సరాదిలో కలగాలని అభిలషిస్తూ.
🌹🙏🌹

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు.

అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను 
పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్ర ముపై భాష్యమున పతంజలి స్ఫోటాయన శ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ 
ప్రకాశకమగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా మనియర్ విలియంస్ అను మహాశయుడు స్ఫోటసందర్భమున నిట్లు వ్రాసినాడు

The eternal and imperceptible element of sound or words and the real vehicle of idea which bursts or flashes on the mind when a sound is uttered.

కక్షీరపర్వతముపై ఓశిజ నామము గల ఒక యోగి నిజగ్రంథమున శబ్దమున కుండెడి అర్ధ ప్రకాశకశక్తి విశేషమును ప్రవచించి, దానికి స్ఫోటమని పేరిడినాడు. ఇతని నామము వలన అతనికి స్ఫోటాయనుడను పేరు 
ప్రసిద్ధమయినది. అతడు పాణిని కెంత ముందరివాడో తెలియదు. వ్యాసభగవానునకు తరువాతి వాడు మాత్రము అగును. మహాభారతమున స్ఫోట శబ్దము కనబడదు. కాని వ్యాసభాష్యమున స్ఫోటతాత్పర్యము విహితమగుటచే స్ఫోటా యనుడు వ్యాసుడు తరువాతివాడని చెప్పవచ్చును.

వ్యాసభాష్యము వేదవ్యాస ప్రణీతము (వ్రాయ బడిన) కాదనియు, మహాభాష్యప్రవర్తి అనియు చాలమంది అంటారు.

"Yoga system of Patanjali" అను గ్రంథ భూమికలో Haughton Woods,There is little room to doubt that Varshaganya was an older contemporary of Vasubandhu"అని వ్రాసినాడు. Professor Takakusu అను జపనీసు విద్వాంసుడు వసు బంధు సా.శ.5,6 శతాబ్దములలోని వాడని నిర్ద్ధారణచేసాడు. కావున వ్యాసభాష్యము 5 వ శతాబ్దానికి ముందులేదని చెప్పవచ్చును.

🌹స్ఫోట వాదము

స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్దేవిని గూర్చిన స్తోత్రాలు ఋగ్వేదంలోనే కనిపిస్తా యి. అయినా వ్యాకరణ సాంప్రదాయం ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్ఫోటాయ నమహర్షి. భర్తృహరి, నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు.

నిత్యమైన స్ఫోట, లేక శబ్దబ్రహ్మం మనం 
నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2.పశ్యంతీ,శ3.మధ్యమా,
4. వైఖరీ. పరా పశ్యంతీదశలలోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప మన సాధరణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల మధ్యమా దశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరీ వాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం; శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డు దగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రం మధ్యమా వాక్కు నెలవు. ఇది అంతర స్ఫోట. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీ వాక్కు బాహ్యస్ఫోట.

సర్వదర్శన సంగ్రహంలో పాణినీయదర్శనాన్ని వివరిస్తూ మాధవాచార్యస్వామి అంటాడు: "స్ఫోట అనబడే ఈ శబ్దం విభాగాలులేనిది; నిరవయవం; నిత్యమైంది; జగత్తు పుట్టుకకు కారణమైంది. నిజానికి ఇది బ్రహ్మపదార్ధమే!". భర్తృహరీ బ్రహ్మకాండలో ఇదేమాట అన్నాడు.

'ఆకాశం' అనగానే ఎత్తుగా నీలంగా, భూమిమీద బోర్లించిన కోళ్ళగంపలాగా కనిపించేదీ, మబ్బులకూ సూర్యచంద్రులకూ ఆధారంగా ఉన్నట్టు అనిపించేదీ మనకు స్ఫురిస్తేనే ఆ మాట అర్ధమ యినట్టు అనుకుంటున్నాము. ఇలా ఏ శబ్దం తీసుకున్నా ఆ శబ్దార్ధం వాక్యరూపంగానే మనకు స్ఫురిస్తున్నట్లు తేలుతుంది.

ఒకభాషలోని ఒకమాట ఆభాషతెలిసిన వ్యక్తి మనస్సులో ఒక అర్ధాన్ని, తెలియనివ్యక్తి మన స్సులో మరో అర్ధాన్ని స్ఫురింపజేయగలదు. ఉదాహరణకి 'కాఫీ' అనేమాట దక్షిణాదివారి మనస్సులో కఫీపానీయాన్ని స్ఫురింపజేస్తే హిందీ మాతృభాషగా గల ఉత్తరాదివారికి చాలు అనే అర్ధాన్ని బోధించవచ్చును.

ఇలా ఒకేమాట వేరువేరుభాషల్లో వేరువేరు అర్ధాలని బోధించగల్గినట్లు, 
మానవులందరిలోనూ స్వతసిద్ధంగా వుండే స్ఫోట ఏకరూపమే! ఒకేవ్యక్తికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చునను కోండీ అప్పుడు మనిషి అన్నా man, అన్నా ఆద్మీ అన్నా అతని మనస్సులో అభివ్యక్తమయ్యే స్ఫోటఏకరూపమే.

దీనినిబట్టి, మానవైంద్రియాదిశక్తులచేత 
పరిమితమై మానవుడి జననంతోపాటే అతడు గ్రహిం చదగిన జ్ఞానరాశి అంతా సూక్ష్మరూపంలో అతడిలో సన్నద్దమై ఉంటుందనీ, అదే స్ఫోట అనీ తేలుతుంది. అందుకే స్ఫోట నిత్యం అన్నారు. అలా సన్నద్ధమై ఉన్న జ్ఞానాన్ని అభివ్యక్తం చేసే పరికరాలే భాషలోని శబ్దాలన్నీ. ఒక చీకటికొట్లో ఎన్నోవస్తువులండవచ్చును టార్చిలైటు దేని మీద వేస్తే ఆవస్తువే కనిపిస్తుంది. ఆ సంగతి బాగా తెలుస్తుంది. స్ఫోటని మనం సంపూర్ణంగా నిర్వచించలేకపోయినా అది మనందరి నిత్యానుభవంలోనూ ఉన్నదే! ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మరొకడు అర్ధం చేసుకొన్న ప్రతిసందర్భంలోను స్ఫోట పనిచేస్తూనే ఉంది. ఈ స్ఫోట లోపించడం మూలానే మరమనిషికి ఏది పడితే అదిమాట్లాడగలదు. ఏదిమాట్లాడినా బోధపరచుకోగలగడం సాధ్యంకాలేదు.

వైయా కరణాంగీ కృతమగు వాదమునకే స్ఫోట వాదము అని పేరు. ఈ స్ఫోట వాదము పాణినికి ముందున్నదో లేదో చెప్పటము కష్టము. స్ఫోటా యనుడను పేరు పాణినీయమున ఉంది. ఈతడే స్ఫోట వాదమునకు కర్త. స్ఫుటత్యర్ధో స్మాదితి స్ఫోటః దీని వలన అర్ధము స్ఫుటమగును కావున స్ఫోటమనియు తెలియును. వాక్కును పరా,పశ్యంతి,మధ్యమ,వైఖరి అని వాక్కును విభజించిరి. పరావాక్కు మూల చక్రస్థము, పశ్యంతి నాభి సంస్థితము. ఈరెండును యోగులకే అనుభవనీయము. హృదయ దేశమందలి వాక్కు మధ్యమ అనబడును. కంఠదేశమందలి వాక్కు వైఖరీ వాక్కు. ఈ మధ్యమ వాక్కునకే స్ఫోట శబ్దమని వ్యవహారము. ఇది నిత్యము, అఖండము, అవికారము, అచలము ఇదే బ్రహ్మ స్వరూపము. ఈ సిద్ధాంతులకే స్ఫోట 
బ్రహ్మవాదులని లేదా శబ్ద బ్రహ్మ వాదులని పేరు. వీరు శబ్దమునే బ్రహ్మముగా భావింతురు. మనము శ్రవణేంద్రియముచే గ్రహించు శబ్దముకాక, దానిచే అభివ్యక్తమై బుద్ధినిష్ఠమగు శబ్దమేస్ఫోటము అదియే అర్ధమును ప్రకాశింపజేయును. అది నిత్యము. అది పదరూపమున కాని, వాక్య రూపమునకాని యుండును. వాక్యస్ఫోటమె ముఖ్య సిద్ధాంతము.

భర్తృహరి ముఖ్యముగా ప్రతిపాదించిన వాక్య జాతి స్ఫోట. అయినను తరువాతి వైయాకరణుల అష్ట విధములగు స్ఫోటల నీ రీతిగా నిరూపించిరి. వర్ణములను మాత్రలుగను, పదములను ప్రకృతి ప్రత్యయములనుగాను, వాక్యమును పదములుగాను విభజించి 
అర్ధములేర్పరుచుట వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించిన విషయము. వ్యవహారము ఉపయుక్తములగు పదములకు అఖండ పదస్ఫోటను కొందరు పేర్కొనిరి. ఏమైనను నవ్యులు అఖండ స్ఫోటమే ముఖ్యమందురు. ప్రాచీనులు వాక్యజాతి స్ఫోట ముఖ్యమని భావింతురు. వ్యక్తిస్ఫోట,జాతిస్ఫోటయను విభేదమును గూర్చిచాల వివాదము ఉంది. ప్రాచీన వైయాకరణులు జాతి స్ఫోట వాదులని, నవీన వైయాకరణులు వ్యక్తి స్ఫోట వాదులని ప్రసిద్ధి. భర్తృహరి జాతి స్ఫోటనే ప్రతిపాదించి బలపరిచెను. జాతి స్ఫోట తాత్వికముగా ఉన్నా ఆచరణయోగ్యము కాదని నవీనుల అభిప్రాయము. వ్యక్తి మూలముననే జాతి గ్రహింపబడును. వ్యక్తులన్నింటి యందుండు సమాన ధర్మమే జాతి. అందువలన చివరకు ఆధునిక విమర్శకులు వ్యక్తి జాతి స్ఫోటలు రెండును అవినాభావములని నిర్ణయించిరి.

పాశ్చాత్యదర్శన మనశాస్త్రాలలో 
స్ఫోటవాదముతో పోలికలు ఉన్నటు అనిపించే కొన్ని భావాలను మనం గుర్తించవచ్చును. గ్రీకుల'లాగాస్'' (logos)కాంట్ ప్రతిపాదించిన కారణాత్పూర్వజ్ఞాన సిద్ధాంతం (apriori) మనశాస్త్రంలోని-స్ఫురణ (intuition) వంటివి. ప్లేటొ లాగాస్ ప్రం చానికి మూలరూపం అన్నాడు. అంటే లాగాస్ నుంచే ప్రపంచం అంతా వచ్చిందని. ఫైలో(philo) దేవుడికీ, ప్రపంచానికీ మధ్య అనుసంధానం కలిగించేది లాగాస్ అన్నాడు. హొరక్లైటస్ (Heraclitus) భౌతిక జగత్తునంతటనీ లాగాస్ ద్వారానే మనం గ్రహిస్తున్నామన్నాడు.

🌹మంత్ర జపం - వాక్కు రూపాలు: పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరులు-వైజ్ఞానిక విశ్లేషణ.

వాక్క- రూపాలు 4 రకాలు :

పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరులు-వైజ్ఞానిక విశ్లేషణ:- వాక్కు రూపాలు 4. అవి పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరులు. 

పరా వాక్కు:పరావాక్కు స్థానం మూలాధార చక్రం. సహస్రార మధ్యస్త "ఓంకారము" ఆది ప్రణవము. దానికి "సిద్ధి" అని పేరు. ఈ ప్రణవము మూలాధారమందు అవ్యక్త వాక్కుగా నిలచినది. ఈ వాక్కు శక్తికి అభిన్నము. అవికారి, నిత్య మైనది, ఆత్మానుభూతినిచ్చేది. దీనిలో లయమైన ఋషులు జ్ఞానాన్ని పొందారు., ఇందులో లయమైన ఎవరైననూ అపార జ్ఞానాన్ని 
పొందుతారు. వారు ఋషులే మరి. పరా వాక్కుయొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమా, వైఖరులు.

పశ్యంతి వాక్కు :

ఈ వాగ్రూపము అంతర విషయ వాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ వాక్కు చిత్తములోగల విషయ వాసనలను గ్రహిస్తుంది.

వాక్కులో రెండవ దశ – తక్కువ ఫ్రీక్వెన్సీ
 (frequency) పరా వాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని 'పశ్యంతి" అంటారు. "మధ్యమా" కంటే మరింత సూక్ష్మంగా ఉండి, వినడానికి వీలు లేనిదానినే "పశ్యన్తి వాక్కు" అంటారు. పశ్యంతి అంటే సంస్కృతంలో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం. పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం. అంటే తెలియదగినది అని ఉన్నది. శబ్దాన్ని ఎలా చూడగలం?
మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ?
ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో
 వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు. నిజంగా ఇది మానసిక శబ్దం. ఇది చేతన పాక్షిక అచేతనస్థితులలో వినిపించనిది. అది ఉప చేతన (సబ్ కాన్షస్ ) శబ్దం. అది మన మానసిక నాణ్యతకు చెందినదే కానీ. పంచేంద్రియ నాణ్యతలకు అం టే నాలుక, గొంతు, నోరుల నాణ్యతలకు అందనిది.

మనం "రామ...రామ..."అంటూ ఉంటే...అది వైఖరి నాదం. మనం మన కళ్ళు, నోరులను మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు, రూపాలను అంతరిక లోచనంతో దర్శించటమే "పశ్యంతి". వాక్కు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్యంతి. బయటి శబ్దాలన్నీ అంతరించి పోయి, పూర్వానుభవ శబ్దాలకంటే వినబడే భిన్నమైన ఒక కొత్త వింత నాదమే "పశ్యంతి".

మధ్యమా వాక్కు :

పరా, పశ్యంతిల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలు 
(frequencies) కలిగి, వైఖరి వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది, మధ్యమ వాక్కు. వైఖరి శబ్దం మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని. కానీ మధ్యమా, వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం. గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం. అది వినికిడి ప్రభావం చూపలేదు. మధ్యమ శబ్దంలో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది. కాని "మధ్యమా నాదం" లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలన కూడా వినబడేటంత శబ్దం జనించదు. "ఠక్ ఠక్" అనేట్లు శబ్దం పుట్టించితే, దాన్ని స్థూల శబ్దం అంటారు. మధ్యమ అంటే మధ్యగా ఉన్న శబ్దం. రెండిటికి మధ్యగా ఉన్నదే లేక మధ్యలో ఉన్నదే, "మధ్యమా" మధ్యమా శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది. ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జపశీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది ఆకాశంలో వ్యాప్తిచెందుతుంది. సాధకుల/యోగుల స్థాయిని బట్టి, కొన్ని ఆమడలు, సూక్ష్మ దేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది.

వైఖరి వాక్కు :

నాలుగవ వాక్ దశనే "వైఖరి" అంటారు.
"వైఖరి"లో శబ్దం వినిపిస్తుంది, ఉత్పత్తి అవుతుందిశకూడా. మనం మాట్లాడే భాష అంతా వైఖరియే. వైఖరీ వాక్కు కఠినంగా ఉంటుంది. కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి "శబ్దోత్పత్తి" జరుగుతుంది. వీటి ఫ్రీక్వెన్సీలు (frequencies) ఒక నిర్దుష్ట పరిమితిలో ఉంటాయి.

మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే - పరా అంటే ఆత్మ నాదం. మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత. వైఖరి కూడా భౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే.

నిత్యమైన శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరిం చి, చెవులతో వినే లౌకిక శబ్దంగా 
పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 

1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. 

పరా పశ్యంతీ దశలలోని శబ్దాన్ని ఉన్నతస్థాయి యోగులు తప్ప మన సాధారణ 
ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేకపోచ్చును. జపాదుల వల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చును. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం: శబ్దబ్రహ్మము మూలా ధార చక్రంలోని కుండలిని దానిస్థానం.శదీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో 
ఉంటుంది.
ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మ స్ఫోట. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రం మధ్యమా వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధచక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీ వాక్కు బాహ్యము.

వాక్ప్రపంచం మొత్తంలో నాల్గవ వంతు 
మాత్రమే మానవులమైన మనం వింటున్నాం. కాని, వృక్షాలుశ(Plant Kingdom) పరావాక్కును, పక్షులు - పశ్యంతీ వాక్కును, జంతువులు (Ani mal Kingdom) మధ్యమా వాక్కును కూడా వినగలవు!

వాక్ప్రపంచంలో నాల్గవ వంతు మాత్రమే 
మనుష్యులు వినగలరు. అన్నట్లుగానే, భౌతిక ప్రపంచం మొత్తంలో నాల్గవ వంతు మాత్రమే మను మష్యులు చూడగలిగేది. మిగిలిన మూడు భాగాలు లోపలే వుంటాయి' అని పురుష సూక్తం చెబుతోంది.

వాక్కుకు సంబంధించిన నాలుగు స్థితులను ఆధునిక మానవునికి గాని, శాస్త్రజ్ఞానికి గానీ అర్థ మయ్యేలాగా చెప్పాలంటే క్రింది ఉదాహరణ చెప్పుకోవచ్చును.

ఒకడు ఒక పుస్తకాన్ని చూశాడు.శవెంటనే ఇది ఒక పుస్తకము అని చెబుదామనుకున్నాడు. ఇలా చెబుదామనుకున్న సంకల్పం ఉచ్చరించే వాక్కు రూపంలో వుంది. ఈ స్థితిలోని వాక్కును "పరా వాక్కు అంటారు. దీన్ని'సంకల్పంగా గాని 'ఉచ్చరించేవాడు (బ్రహ్మ)గా గాని సమన్వయ పరచుకోవచ్చును.

సంకల్పం కలగంగానే దాన్ని ఒక 'భావంలోకి మార్చుకోడం జరుగుతుంది. భావంలోకి మార్చ బడిన వాక్కును పశ్యంతి వాక్కు' అంటారు.

భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చెయ్య డానికి సంకేతాలతో ఒక 'భాష" లోకి 
మార్చుకోడం జరుగుతుంది.శమనస్సులోనే జరిగే ఈ సంకేతాలు భాషారూపంలో వున్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు.

మనస్సులో ఒక భాషలో వున్న వాక్కును 
భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే - అప్పుడు వ్యక్తమయ వాక్కును 'వైఖరీ వాక్కు అంటారు. ఈ స్థితిలో వున్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా-పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్ స్థితులంటారు.

పరాస్థితిని -శసంకల్పము గాను,
పశ్యంతి స్థితిని - భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గాను, వైఖరిస్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును.

లలితా సహస్ర నామావళిలో, అమ్మవారి ఒక నామం "వైఖరీ రూపా" అని ఉంటుంది.
సాధారణంగా మనిషి 20 Hz నుండి 20,000 Hz ల వరకు మాత్రమే వినగలడు అని ఆధునిక సైన్సు చెబుతోంది. మరి 20 Hz లోపు ధ్వనులను పర శ్రావ్యాలు అని, 20,000 Hz పైగా ఉన్న ధ్వనులను అతి ధ్వనులు అంటారని సైన్సు చెబుతోంది. 

మధ్యమా వాక్కు రూపము ఈ 20 hz లోపు, 20,000 Hz పైన ఉండవచ్చును. లేదా పరిశో ధనార్హం. ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని - ఆధునిక సైన్సుతో compare చేయాలి. తులనాత్మక విశ్లేషణ చేయాలి.

శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. అదృశ్య జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, సరైన ఫ్రీక్వెన్సీలో ఉచ్ఛారణ చేసినపుడు, జపించినపుడు. ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి.

వాక్కు దేవతా రూపం.శకాబట్టి వాక్కును 
జాగ్రత్తగా ఉపయోగించాలి. శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరా వాక్కు, మరల పశ్యంతిగా ఆవిర్భవించింది. మరల మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది.

పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాం. మొదట మనకు 
సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది.శఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలంలో గల శక్తి. మాటలాడాలన్న ఇచ్ఛా శక్తికి, జ్ఞాన శక్తి +క్రియా శక్తి. తోడవ్వాలి కదా!యోగ పరంగా ఈ స్పంద నా శక్తి "ప్రాణ శక్తి" ఈ శక్తిని లలిత గానూ, శబ్ద బ్రహ్మంగానూ భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల, ఒకానొక శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా" ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్ఠానానికి వస్తే, ఆ రూపం "పశ్యంతి"ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగుతీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా. ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును "మధ్యమా" అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషాస్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. మధ్యమా రూప స్పందనా శక్తి. పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకా రాది. క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమా రూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. 

ఈ విశుద్ధ చక్రంలోనే. శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి...వైఖరీ వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం. వరుస క్రమంలో బయటికి వస్తూ. ఒక్కో కండరాన్ని కదిలిస్తూ. మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది కనుక, ఇక్కడ దీని రూపం"వైఖరీ వాక్కు.

మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు 
రకాలు, నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి. అయితే ఈ వాక్కు అనేది మనుజులకే కాదు. సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉన్నది. రాయి, రప్ప, ఖనిజంలో "పరా" రూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో "పశ్యంతి"గానూ, జంతువులలో "మధ్యమా"గానూ కూడా ఉంటుంది అని అధ్యాత్మ శాస్త్రవేత్తల అవగాహన.🙏🙏
 
◈━━━━━━━━ ⸙ - ⸙ ━━━━━━━━━◈
🏛️🕉️✊తరం.తరం.నిరంతరం.తరించరా.!🪷❄ఈరోజు క్రింది ఒక్క శ్లోకములు కంఠస్తాం చేద్దాం.శ్రీమద్భగవద్గీత:అధ్యాయం:6-4వశ్లోక ము శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః🕉️☯️✡️🎡🌈
◈━━━━━━━━ ⸙ - ⸙ ━━━━━━━━━◈
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ।। 4 ।।

ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు; ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున.

మనస్సు భగవంతునితో యోగములో 
ఏకమవుతున్న కొలదీ, సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి, మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, అది అన్ని ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొందిందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో, మరియు వాటిని పొందటం కోసం ఏ పనీ చేయడో, అప్పుడు వ్యక్తి ప్రాపంచికత నుండి దూరమైనట్టు. ఇటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగాలను అనుభవించటం కోసం పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం మానేస్తాడు; అంతిమంగా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలను భస్మం చేస్తాడు; మరియు, పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు.

మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్థ పూరిత క్రియల కోసం పరుగులు తీయదు. మనం మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు, యోగములో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్టు పరిగణించబడుతాము.

The most effective strength of your salvation is the choice to extend your reach to share solicitude, shifting focus from self to focus on service leaving Ego and Self intent.
దైవిక ప్రేమ మరియు శాంతిని పంచుకోవడానికి మీ పరిధిని విస్తరించడం అనేది మీ మోక్షానికి అత్యంత ప్రభావవంతమైన బలం. అహం మరియు స్వీయ ఉద్దేశ్యాన్ని వదిలిపెట్టి మీ దృష్టిని మీ నుండి దైవిక సేవకు మార్చండి.

                        🪷
°༺꧁....జై యోగేశ్వర్.....꧂༻°

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12