శ్రీ కృష్ణా నది వెoబడి గల అనేక పుణ్య క్షేత్రాలు.



శ్రీ కృష్ణా నది వెoబడి గల అనేక పుణ్య క్షేత్రాలు.🙏🏻
Part-1

పంచభూతాలలో ఒకటి అయిన నీరు అతి ముఖ్యమైనది. ఏ నదిలో యోగులు, దేవతలు, యతులు గుప్తంగాఉంటూ,
మహనీయులను సేవిస్తూ, సేవించడానికి తపన పడుతారో, ఏ నదిలో స్నానం చేయడానికి మానవులై జన్మించి సాధన చేయడానికి యోగులు కూడా తపన పడతారో ఆ నదీమ తల్లి యే కృష్ణమ్మ తల్లి.

ముందు కృష్ణ (పురుష రూపం) గా జన్మించి తరువాత కృష్ణ వేణి (స్త్రీ)గా మారుతుంది.
కొన్ని నదులు హిమాలయలలో పుడితే, కొన్ని నదులు కొండలలో పుడతాయి. వాటిని ద్వీపకల్ప నదులు అంటారు. కృష్ణానది అటువంటిదే. భారత దేశంలో 4 వ అతి పెద్ద నది. సముద్రం నుంచి సుమారు 4,300 అడుగుల ఎత్తున జన్మించిన ఈ నది అనేక పుణ్యక్షేత్రాలకు, సాధకులకు, యోగులకు ఆలవాలం అయి పునితం చేస్తూ ప్రవహిస్తోంది. తనలో మొత్తం 14 ఉపనదులను వివిధ ప్రాంతాల్లో కలుపుకుని శాంతి వాహిని అయింది.

శ్రీ కృష్ణా నది సహ్యాద్రి పర్వత ప్రాంతంలో శ్రీ క్షేత్ర మహాబళేశ్వర్ దగ్గర కృష్ణ మందిరం సాక్షిగా జన్మించి, 1,400 కిలో మీటర్ల దూరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గుండా పయనించి ఆంధ్ర ప్రదేశ్ లోని హంసలదీవి వద్దమరలా సంతాన వేణుగోపాల స్వామి (శ్రీ కృష్ణుడు) సాక్షిగా సముద్రంలో లయం అవుతుంది.

ఈ లయమయ్యే క్రమం చూస్తే మనకు కూడా ఒక ఆధ్యాత్మిక విషయం తెలియజేస్తున్నది. పరమాత్మ నుంచి పుట్టిన మనం మాయా ప్రభావంతో అనేక గుణాలు మనలో లయం చేసుకున్నప్పటికి, ఉప నదులు లాగా తిరిగి వాటి ఉనికి పోగొట్టుకొని, అనేక కష్ట, నష్టాలు ఎదుర్కొంటూ కొండలు, కోనలు దాటుతూ, ఇతరులకు మంచి చేయడమే తన సహజ స్వభావాన్ని కోల్పోకుండా, అనేక తీర్ధ క్షేత్రాలను (మహాత్ముల సన్నిధి, సేవతో) పావనం చేస్తూ మరలా మన నిజ స్వరూపం అయిన పరమాత్మ (సముద్రం)ను చేరడమే మన అంతిమ లక్ష్యం కావాలని తెలుపుతుంది. 

ఈ నదీమ తల్లి వెంబడి అనేక దత్త, నృసింహ, విష్ణు, శైవ తీర్ధ క్షేత్రాలు మొత్తం కలిపి సుమారు 29 దాకా ఉన్నాయి. వాటి లో శ్రీ దత్త క్షేత్రాలు త్వరలో తెలుసుకుందాము.
శ్రీ కృష్ణా నది వెంబడి అనేక పుణ్య క్షేత్రాలు 🙏
Part-2
 మహాబలేశ్వర్ లో కృష్ణా నదితో పాటు సావిత్రి, గాయత్రి, కోయిన, కృష్ణ, వేణి అనే మొత్తం 5 నదులు అక్కడే పుట్టి, తిరిగి ఒక్కొక్క పవిత్ర క్షేత్రాలల్లోమళ్ళీ కృష్ణ లో ఉపనదులు గా కలిసిపోతాయి. ముందు 
1 వ క్షేత్రం పంచగంగా నది మందిరం
ఇది మహాబలేశ్వర్ లో శ్రీ కృష్ణా నది జన్మస్థాన క్షేత్రం. ఇక్కడ నుంచి కృష్ణా నది 60 km కొండలు, లోయలగుండా ప్రవహించి మాహులి (2వ క్షేత్రం) అనే క్షేత్రంకు పయనిస్తుంది. ఇది హరి, హర క్షేత్రం. ప్రసిద్ధ, పురాతన శైవ, విష్ణు మందిరాలు ఉన్నాయి. ఇక్కడి మందిరాలను పునీతం చేస్తూ మహారాష్ట్రలో ముందుకు దత్తాత్రేయ క్షేత్రం వైపుగా సాగుతోంది.
సంశేషం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: