*236. చతుష్షష్టి కళామయీ *

_*లలితరహస్య నామభాష్యము నేటి పారాయణము*_
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*236. చతుష్షష్టి కళామయీ *

కళలు 64 ఉన్నాయి. వీటన్నింటి లోనూ ఆ పరమేశ్వరి అందెవేసిన చేయి. ప్రావీణ్యురాలు. అందుచేత ఆమె. చతుష్షష్టి కళామయీ అనబడుతోంది.

ఈ కళలు రెండురకాలు 1. విద్యాకళలు 2. వృత్తికళలు. ఈ కళలు ఒక్కొక్కచోట ఒక్కొక్క రకంగా ఉన్నాయి. శార్గధరీయము, కథాకోశము, శ్రీధీయము లందు ఈ
కళలు వేరువేరుగా ఉన్నాయి. వామకేశ్వరతంత్రంలో వేరుగా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న విద్యా *కళలు.*

1) అన్వక్షకి
2) త్రయీ
3) వార్తా 
4) దండనీతి 
5) ఆకర్షణము 
6) స్తంభనము 
7) మారణము 
8) విద్వేషణము 
9) ఉచ్చాటనము 
10) మోహనము - 

*వేదములు* 

11) ఋగ్వేదము 
12) యజుర్వేదము 
13) సామవేదము 
14) అధర్వణ వేదము 

*వేదాంగములు -*

15) శిక్షా 
16) వ్యాకరణము 
17) ఛందము 
18) నిరుక్తి 
19) జ్యోతిషము 
20) కల్పము - శాస్త్రములు - 
21) మీమాంస 
22) న్యాయశాస్త్రము 
23) పురాణము 
24) ధర్మశాస్త్రము 
25) ఆయుర్వేదము
26) ధనుర్వేదము 
27) నీతిశాస్త్రము 
28) అర్థశాస్త్రము -

*పురాణములు -*

29) బ్రాహ్మము 
30) పాద్మము 
31) వైష్ణవము 
32) శైవము 
33) భాగవతము 
34) భవిష్యోత్తరము 
35) నారదీయము 
36) మార్కండేయము 
37) ఆగ్నేయము 
38) బ్రహ్మవైవర్తము 
39) లైంగము 
40) వారాహము 
41) స్కాందము 
42) గారుడము 
43) వామనము 
44) మాత్స్యము 
45) కూర్మము 
46) బ్రహ్మాండము -

 *ఉపపురాణాలు -*

47) సనత్కుమారము 
48) నారసింహము 
49) స్కాందము 
50) శివధర్మము 
51) దౌర్వాసము 
52) నారదీయము 
53) కాపిలము 
54) మానవము 
55) ఔశనము 
56) బ్రహ్మాండము 
57) వారుణము 
58) కౌశికము 
59) లైంగము, 
60) సాంబము 
61) సౌరము
62) పారాశరము
63) మారీచము
64) భార్గవము

*ఇందులొ మొదటినాలుగు చతుర్విద్యలు*
5 నుంచి 10 వరకు - షడ్విద్యలు
11 నుంచి 14 వరకు - చతుర్వేదములు
15 నుంచి 20 వరకు - వేదాంగములు
21 నుంచి 28 వరకు - శాస్త్రాలు
29 నుంచి 46 వరకు - పురాణాలు
47 నుంచి 64 వరకు - ఉపపురాణాలు

*వృత్తులకు సంభందించిన కళలు 64 అవి.*

1.గీతం
2.వాద్యం
3.నృత్యం
4.నాట్యం
5.అలేఖ్యం
6.విశేషకము
7.పుష్పకండుల బల్యాది
8.కుసుమాన్తరము
9.దంతవస్తాంగరాగము
10.మణికుట్టికర్మ
11.శయ్యానిధి
12.వారివాద్యము
13.చిత్తయోగము
14.పుష్పలావికా విద్య
15.మాల్యగ్రధనం
16.నేపధ్యరచన
17.కర్ణపత్రభంగము
18.సుగంధరచన
19.భూషాయోగము
20.ఇంద్రజాలము
21.కౌచుమారయోగము
22.చిత్రశాకా పూప భక్ష క్రియ
23. హస్తలాఘవం
24. సానకాసవరాగాదినిర్మాణం
25.సూచీవాయప్రక్రియ
26.వీణాడమరువాద్యం
27.సూత్రక్రీడ
28.ప్రహేళికా
29.ప్రతిమాలా
30.దుర్వాచకయోగా
31.పుస్తకవాడకం
32.నాటిఖ్యాయిక
33.సమస్యాపూరణం
34.పట్టికావేత్రవాసము
35.తక్షకర్మ
36.తక్షణం
37.వాస్తు
38.రత్నపరీక్ష
39.ధాతువాదము
40.మణిరాగజ్ఞానము
41.అకరవేదన
42.వృక్షాయుర్వేదము
43.మేషకుక్కుటలనాదియుద్ధం
44.శారికాశుకాలాపనము
45.కేశప్రసాదనము
46.అక్షరోదనము
47.ముష్టికాకధనము
48.మ్లేచ్చచ్చర్కవికల్చ్పము
49.దేశభాషాదివేదన
50.ప్రశూనశలజ్ఞానం
51.నిమిత్రజ్ఞానము
52.యంత్రమాతృక
53.ధారణయంత్ర
54.సంవాచ్యము
55.మానసీకావ్యక్రియ 
56.ఛందోదీ 
57.నానాకోశధీ 
58.నానాక్రియాదికల్ప 
59.చలఆశయయోగము 
60.వస్త్రసంగోపనము
61.దూత్యము
62.బాలక్రీడ
63.ఆకర్షణక్రీడ
64.వైతాళికవిద్య

ఇవన్నీ వృత్తికలు. వీటిని ఆచరించవచ్చు. అయితే విద్యార్థికల్పతరువులో 64 కళలు విడిగా చెప్పటం జరిగింది.ఈ విధంగా ఒక గ్రంథానికి ఇంకొక గ్రంథానికి సంబంధంలేదని గమనించగలరు.

*శ్రీమాత్రే నమః*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: