238. మనువిద్యా*
_*లలితరహస్య నామభాష్యము నేటి పారాయణము*_
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*238. మనువిద్యా*
సృష్టిలో మొట్టమొదటివాడు మనువు. ఈ మనువునుంచే మానవలోకం అంతా
ఉద్భవించింది. మనువులు 14మంది. వీరినే చతుర్దశ మనువులు అంటారు. వారు.
1. స్వాయంభువ 6. చాక్షుష 11. రుద్రసావర్ణి
2. స్వారోచిష 7. వైవస్వత 12. ధర్మసావర్ణి
3. ఉత్తమ 8. సూర్యసావర్ణి 13. రౌచ్య
4. తామస 9. దక్షసావర్ణి 14. భౌచ్యులు
5. రైవత 10. బ్రహ్మసావర్ణి
ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వతమన్వంతరం.
పంచదశీ మహామంత్రాన్ని ఉపాశించిన వారిలో మొదటివాడు మనువు. అతడు ఈ మంత్రాన్ని ఉపాసించి తరించాడు. మనువు ఉపాసించిన మంత్రం
అస్యశ్రీ మనువిద్యాంబా మహామంత్రస్య ౹ దక్షిణామూర్తి బుషిః
(బీజాక్షరాలు పోస్ట్ చేయడం లేదు)
ఇది మనువు ఉపాసించిన మంత్రం కాబట్టి మనువిద్య అనబడుతోంది. ఇది చంద్రవిద్య, భానువిద్య అని రెండు రకాలు. ఇక చంద్రవిద్యను వివరిస్తున్నారు.
గమనిక : శ్రీవిద్యకు పంచదశి మహామంత్రం ప్రధానమైనది. అవసరమైనచోట్ల ఆ మంత్రాన్ని వివరించటం జరుగుతోంది. లేక పోతే అసమగ్రం అవుతుంది. అయితే ఉపాసనలేనివారు మంత్ర రహస్యాలను చదివేటప్పుడు ఆ పరమేశ్వరి యందు దృష్టినిల్పి ఆమెనే గురువుగా భావించి చదివితే దోషం ఉండదు.
*శ్రీమాత్రే నమః*
*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Comments
Post a Comment