శ్రావణ మంగళవారం నోములు

రేపు శ్రావణ మంగళవారం ఈ శ్రావణ మాసం ఆడవారికి ముఖ్యంగా ఎందుకు చెప్పబడింది కారణం ఏమిటి హిందూ ధర్మ శాస్త్రంలో ఏది పనికిరాకుండా చెప్పలేదు దీనికి కారణం ఏమిటి అని పరిశీలిస్తే చంద్రుడు రక్త రోగానికి కారకుడు అలాగే రుతుస్రావానికి కారకుడు అలాగే బ్రెస్ట్ రోగాన్ని కూడా కారకుడు
కుజుడు రక్తానికి రక్తంలో కట్టే గడ్డలకు కారకుడు


సుమారు 60 నుంచి 70 శాతం మంది వరకు ఆడవారిలో సిస్ట్లు ఉంటాయి ధర్మ శాస్త్రంలో ఐదు మంగళవారాలు మాత్రమే నోములు నోచి ఉద్ద్యేపన చేయాలని చెప్పి ఉన్నారు
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం తినే ఆహారం అంతా కల్తీ మయం అందువల్లనే ఎక్కువమందికి పిసిఓడి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి

ఎక్కువగా అగ్నితత్వంలో చంద్రుడు ఉన్నా జల తత్వం లో కుజుడు ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే చంద్ర కుజుల మధ్య పరివర్తన కలిగిన ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే చంద్రం నక్షత్రాల్లో కుజుడున్న కుజుడినక్షత్రాల్లో చంద్రుడు ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే శుక్ర నక్షత్రాల్లో చంద్ర కుజులు ఎవరున్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి శుక్రుని నక్షత్రాలు ఎందుకు చెప్పబడ్డాయి అని అనుమానం రావచ్చు శుక్రుడు conceive ప్రాబ్లం రాకుండా ఉండడానికి పైగా శుక్రుడి నక్షత్రాలు అగ్ని తత్వ రాశులలోనే ఉన్నాయి
 

శ్రావణ మంగళవారం నోములు ఎందుకు నోచాలో ఇప్పుడు మనకి ఎందుకు చెప్పారో అర్థం అవుతోంది అంటే మంగళవారం కుజుడు చంద్రుడి అధి దేవత గౌరీదేవిని పూజించాలని అలాగే బియ్యం తోటి ఒత్తులు చేసి సంతాన కారకుడైన గురువుకు సంబంధించిన తీపి పదార్థం అయిన బెల్లాన్ని కలిపి జ్యోతులు వెలిగించి ఆ జ్యోతులు ముత్తయిదువులకు దానం ఇవ్వాలని సత్ సంతానాన్ని పొందాలని కారణంగా భావించవచ్చు

ఇప్పటి పరిస్థితుల ప్రకారం పిసిఓడి లేదా రుతుస్రావం సరిగా లేకపోతే ఏం చేయాలి ప్రతి శ్రావణమాసం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు 5 మంగళవారాలు మాత్రమే చేయకుండా ప్రతి శ్రావణ మాసం వారి ప్రాబ్లం తగ్గేవరకు కనీసం చంద్రుని అధిదేవత అయిన గౌరీదేవిని పూజిస్తూ
కుజుడికి కందులు చంద్రునికి బియ్యం దానం ఇవ్వాలి దానం అనగానే ఏ పావు కిలోనో లేదా ఒకటింపావు కిలోనో దానమిచ్చి మనం దానం ఇచ్చాము మనకు ఫలితం రావాలి అని అనుకోకుండా స్థాయిని బట్టి దానం చేయాలి ఉదాహరణకు ఒకతను సంపాదన నెలకి 20000 ఉంటే అతను ఒకటింపావు కిలో దానం ఇవ్వచ్చు కానీ అతని సంపాదన 50000 ఉంటే అతను ఐదు కిలోలు దాని ఇవ్వాలి అలాగే బియ్యం కూడా అలా దానం ఇచ్చినప్పుడే ఫలితాన్ని పూర్తిగా ఆశించగలం నేను దానం ఇచ్చేశాను కదా
నాప్రాబ్లం తీరిపోయింది అనుకుంటే ఏమీ ఉపయోగం లేదు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: