దృష్టి దోషాలు
దృష్టి దోషాలు
1. రవి చంద్రులు ఏ గ్రహము చేత అయినా బాధింపబడినప్పుడు కంటి సమస్యలు వస్తాయి. రవిచంద్రులు 12 లో ఉండి 6, 8లో పాపగ్రహాలు ఉన్నప్పుడు కంటి చూపు పూర్తిగా లోపించే అవకాశం ఉంటుంది.
2. రవి ఎనిమిదిలో ఉండి శని తొమ్మిదిలో ఉన్నప్పుడు లేదా రవి శనులు తొమ్మిదిలో ఉన్నప్పుడు లేదా కంటి సమస్యలకు ఆస్కారం ఉంటుంది.
3. రాహువు లగ్నంలో ఉండి రవి సప్తమంలో ఉన్నా, చంద్రుడు ఆరులో ఉండి కుజుడు రెండులో ఉన్నా,
శని కుజులు రెండు లేక 12 లేక 8 లో ఉన్నా కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
4. లగ్నంలో ధనాధిపతి, శుక్రుడు, చంద్రుడు కలిసినప్పుడు రేచీకటి ఏర్పడుతుంది.
రవి రాహులు లగ్నంలో ఒకే డిగ్రీలో ఉన్నవారికి ఎక్కువగా బెదురు చూపులు చూడడం, చూపు సరిగా అనకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
వ్యయాధిపతి లగ్నంలో ఉండి రవి చంద్రులు 12 లో ఉన్నప్పుడు కళ్ళకు సంబంధించిన సమస్య తీవ్రమైనదిగా ఉంటుంది.
5. మేషము తుల లోని 15వ డిగ్రీ, కన్య, మీనములోని 21 డిగ్రీ, వృషభములో 10వ డిగ్రీ, వృశ్చికములో 11వ డిగ్రీ కంటికి సంబంధించినటువంటి సూక్ష్మస్థానాలుగా చెప్పవచ్చు. ఇవి ఆప్టికల్ నెర్వ్స్ ని ప్రభావితం చేస్తాయి.
కన్య, మీనంలోని 20 వ డిగ్రీలో దుష్ట గ్రహాలు ఉన్న లేక ఆ భాగానికి చెడు వీక్షణ యున్న శుక్లాలు (కేటరాక్ట్ )ఏర్పడతాయి.
మేషము తుల లోని 23వ డిగ్రీకి, వృషభ, వృశ్చికాలలోని పదకొండవ డిగ్రీకి, సమస్య ఏర్పడినప్పుడు కలర్ బ్లైండ్నెస్ వస్తుంది.
కర్కాటకంలోని మొదటి మూడు డిగ్రీలు, మకరంలోని మొదటి మూడు డిగ్రీలు బాధింపబడితే గ్లకోమా ఏర్పడుతుంది.
బుధుడు కుజునితో పీడింపబడితే మయోపియా ( దూరంలోని వస్తువులు కనిపించకపోవడం) వస్తుంది.
మేష వృశ్చికాలు రెండూ పీడింపబడినప్పుడు మెల్ల కన్నుకు ఆస్కారం.
బుధ చంద్రులు పీడింపబడినప్పుడు లేదా కుజ గురువులు కన్యలో ఉన్నప్పుడు లేదా కుజ చంద్రులు కలసినప్పుడు శుక్లాలకు అవకాశం ఉంటుంది.
6. రవి మహర్దశలో రాహు భుక్తి, రాహు మహర్దశలో రవి లేదా కుజభుక్తి, గురు మహర్దశలో శనిభుక్తి, శని మహర్దశలో రవిభుక్తి, బుధ మహర్దశలో చంద్ర భుక్తి వీటిలో కంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ.
Comments
Post a Comment