అష్ట దిక్పాలకులు
*అష్ట దిక్పాలకులు*
*1.ఇంద్రుడు-తూర్పు దిక్కు. ఇతని భార్య పేరు శచీదేవి. ఇతని పట్టణం అమరావతి. అతని వాహనం ఐరావతం. వీరి ఆయుధం వజ్రాయుధము.*
*2.అగ్ని-ఆగ్నేయ మూల. ఇతని భార్య పేరు స్వాహాదేవి. ఇతని పట్టణం తేజోవతి. అతని వాహనం తగరు. వీరి ఆయుధం శక్తి ఆయుధము.*
*3.యముడు-దక్షిణ దిక్కు. ఇతని భార్య పేరు శ్యామలాదేవి. ఇతని పట్టణం సంయమిని. అతని వాహనం మహిషము. వీరి ఆయుధం దండకము.*
*4.నైఋతి-నైఋతి మూల. ఇతని భార్య పేరు దీర్ఘాదేవి. ఇతని పట్టణం కృష్ణాంగన. అతని వాహనం గుఱ్ఱము. వీరి ఆయుధం కుంతము.*
*5.వరుణుడు-పడమరదిక్కుఇతని భార్య పేరు కాళికాదేవి. ఇతని పట్టణం శ్రద్ధావతి. అతని వాహనం మొసలి. వీరి ఆయుధం పాశము.*
*6.వాయువు-వాయువ్య మూల. ఇతని భార్య పేరు అంజనాదేవి. ఇతని పట్టణం నంధవతి. అతని వాహనం లేడి వీరి ఆయుధం ధ్వజము.*
*7.కుబేరుడు-ఉత్తర దిక్కు. ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి. ఇతని పట్టణం అలక. అతని వాహనం నరుడు. వీరి ఆయుధం ఖడ్గము.*
*8.ఈశాన్యుడు-ఈశాన్య మూల. ఇతని భార్య పేరు పార్వతీదేవి. ఇతని పట్టణం యశోవతి. అతని వాహనం వృషభము. వీరి ఆయుధం త్రిశూలము.*
*సర్వేజనా సుఖినోభవంతు🙏*
Comments
Post a Comment