అంతర్దృష్టి యొక్క జ్ఞానం
*🧘♂️అంతర్దృష్టి యొక్క జ్ఞానం🧘♀️*
🪷🪷🧘♂️🧘♀️🪷🪷
*పురాతన కాలంలో ప్రసిద్ధ రాజు జనకుడు భారతదేశంలోని మిథిలా ప్రాంతాన్ని పరిపాలించేవాడు.*
*ప్రసిద్ధ ఇతిహాసం రామాయణం ద్వారా ఆయన సీత తండ్రి అన్న విషయం మనకు విదితమే.*
*అతనికి ఒక రోజు రాత్రి ఒక వింత కల వచ్చింది. ఒక శక్తివంతమైన రాజు అతని రాజ్యం మీద దాడి చేసి అంతా నాశనం చేసాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి అతను అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది.*
*ఇప్పుడు జనక మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నాడు, యుద్ధం ఓడిపోయాడు, పరుగుతో అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అంత దట్టమైన అడవిలో అతనికి ఏమి దొరుకుతుంది?*
*ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఒకరోజు ఒక బాటసారి అతని పరిస్థితి చూసి జాలిపడి అతనికి ఒక రొట్టె ముక్కను ఇచ్చాడు.*
*రాజు దానిని తినడానికి చెట్టుకింద కూర్చోగానే, ఒక పెద్ద కాకి అకస్మాత్తుగా ఆ రొట్టెముక్కను లాక్కుపోయింది.*
*దానితో జనక మహారాజు గట్టిగా అరుస్తూ, నిద్ర నుండి మేల్కొన్నాడు.*
*అతను తన రాజమందిరంలో తన సొంత మంచం మీద చెమటతో తడిసిఉన్నాడు.*
*ఈ కల వల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు.*
*అతడు మతపరమైన, ఆధ్యాత్మిక వ్యక్తి అయినందున, కల గురించి ఆలోచిస్తూ, ఆశ్చర్యానికి గురయ్యాడు…. "కల కంటున్నప్పుడు నేను నా మంచం మీద ఉన్నాను, కానీ నా మనస్సు పూర్తిగా అడవిలోనికి వెళ్ళి పోయింది.*
*కాకి నారొట్టెను లాక్కొని ఎగిరిపోయింది. నేను పరిగెత్తుకుంటూ, అరుస్తూ, చెమటతో మేల్కొన్నాను.*
*కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ క్షణంలో అసలు నిజం ఏమిటి?*
*”నేను మంచం మీద పడుకున్నది- నిజమా! లేక యుద్ధంలో ఓడిపోయి అడవిలో తిరగడం నిజమా!”*
*ప్రశ్న ప్రామాణికమైనదే, కానీ సమాధానం ఏమిటి?*
*ఆ క్షణం నుండి, జనకమహారాజు సమాధానం వెతకడంలో నిమగ్నమై, మరేవిషయం పైన దృష్టి సారించ లేకపోయాడు.*
*పగలు- రాత్రి తన ఆస్థానానికి మత నిపుణులను, మతవిశ్వాసులను పిలిచి, వారు ఏ సత్యాన్నియథార్థమైనదని నమ్ముతారు, "ఈ సత్యాన్నా లేక ఆ సత్యాన్నా" అని అడుగుతూ ఉన్నాడు.*
*ఆయన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆందోళనకు గురయ్యారు.*
*గొప్ప మతపరమైన, జ్ఞానం ఉన్న మహాపండితులు కూడా అతని గందరగోళాన్ని పరిష్కరించలేకపోయారు.*
*ఈ వార్త అష్టావక్రుడు చెవులకు చేరింది, అతను వెంటనే దర్భారుకు వచ్చాడు.*
*సహజంగా, జనక మహారాజు అష్టావక్రుడికి కూడా అదే ప్రశ్నను పునరావృతం చేశాడు.*
*అష్టావక్రుడు నవ్వుతూ " ప్రభూ! రెండూ నిజం కాదు." అని జవాబిచ్చాడు.*
*జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఆయన సంప్రదింపులు జరిపిన వారంతా రెండు పరిస్థితులలో కనీసం ఒక దానినైనా నిజమని వివరించి నిరూపించేందుకు ప్రయత్నించారు!*
*ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో, జనక మహారాజు ఆశ్చర్యానికి లోనవడం గొప్ప పరిణామం.*
*అష్టావక్రుడు తన అభిప్రాయాన్ని విపులీకరిస్తు జనకునితో ఇలా అన్నాడు - "చూడoడి, మీరు కలలు కంటున్నప్పుడు, మీ రాజభవనంలోనే ఉన్నారు, కాబట్టి ఆ క్షణంలో అరణ్యాలలో సంచరించడం నిజం కాదు.*
*అదేవిధంగా, మీరు రాజభవనంలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో మీ మనసు అడవిలో తిరుగుతోంది కాబట్టి ఆ క్షణంలో మీరు రాజభవనంలో ఉన్నారన్నది కూడా నిజం కాదు."*
*జనక మహారాజు అతని ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు అతని ఉత్సుక్తత కొత్త మలుపు తీసుకుంది.*
*అతను వెంటనే, "అలాంటప్పుడు నిజం ఏమిటి?!" అని అడిగాడు.*
*అష్టావక్రుడు, "నిజమే మీలోని దీర్ఘదర్శి, (మనఃసాక్షి) ఈ రెండు సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నాడు. అతనికి దేనితోనూ సంబంధం లేదు." అని చెప్పాడు.*
*ఇది విన్న జనక మహారాజు తన జీవితానికి కొత్త దిశను కనుగొన్నట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందాడు.*
*ఇప్పుడు అతనికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది, ఏది జరిగినా, అతను జీవించి ఉన్నంతవరకు ఒక దీర్ఘదర్శిగా అనుభూతి చెందాలి.*
*ఆవిధంగా, గురువు హోదాలో అష్టావక్రుడు చాలాకాలం తరువాత జనకుడిలో దీర్ఘదర్శిని స్థిరపరచాడు.*
*ఈ సమస్త అంశం 'అష్టావక్రగీత' పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది.*
*మానసిక వికాసంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనం కూడా జనకమహారాజులా ఉత్సుక్తతతో ఉండాలి.*
*మనం దానిని సంపూర్ణంగా చేయలేకపోవచ్చు, కానీ క్రమంగా, మనలోని సాక్షి అనే భావనను మేల్కొల్పాలి.*
*మన దుఃఖాలు, సుఖాలు, ఎత్తుపల్లాలు, వస్తువులు, బంధువులు, మిత్రులు, శత్రువులు మాత్రమే కాదు, మన స్వంత భావాల హెచ్చు తగ్గులు కూడా మనకు 'పరాయివే’ అని అర్థం చేసుకోవాలి.*
*వాటన్నిటినీ చూసేందుకు మనం ప్రేక్షకులం మాత్రమే కాని, మనం అవి కాదు. కాబట్టి వాస్తవమేమిటంటే, లోపల లేదా వెలుపల కూడా మనపై ప్రభావం చూపే సంఘటనలు ఏమీ లేవు.*
*మనస్సు, హృదయానికి సాక్షిగా ఉన్నప్పుడు, రెండూ సంపూర్ణ సమకాలీకరణను పొందుతాయి, అప్పుడు చైతన్యం స్పష్టంగా ఉంటుంది, మంచితనం సహజంగా వ్యక్తమవుతుంది.*
🪷🪷🧘♂️🧘♀️🪷🪷
Comments
Post a Comment