ద్రేక్కాణవర్ణనము

*ద్రేక్కాణవర్ణనము*
 *శ్లో:-* తల్లగ్నేశ సుతేశ ధర్మపతయో ద్రేక్కాణపాస్ప్యుస్త్రయ
       స్స్యాంత్యోపాంత్యగృహేశ్వరా ఇతి జగుర్ధ్రేక్కాణ పాశ్చాపరే
       కేచత్స్వాత్మనధర్మపా ఇతి జగార్ధ్రేక్కాణ పాస్స్యుశ్చరే
       ధర్మస్వాత్మజపాస్థ్సిరే సుతనవస్వేశాద్విరూపే గృహే
*తాత్పర్యము:-* ద్రేక్కాణమనగా లగ్నమును 3 భాగములు చేయుట, వానిని ప్రథమ, ద్వితీయ, తృతీయ ద్రేక్కాణము లందురు. మొదటి ద్రేక్కాణమునకు లగ్నాధిపతియు, ద్వితీయ ద్రేక్కాణమునకు పంచమాధిపతియు, తృతీయ ద్రేక్కాణమునకు భాగ్యాధిపతియు (నవమాధిపతి) యజమానులందరు. మరొక విధముగా లగ్నాధిపతి, ఏకాదశాధిపతి, ద్వాదశాధిపతి (కొందరు నవమాధిపతి) యనియు లగ్న పంచమ, నవమాధిపతులు, చరలగ్నమునకును, స్థిరలగ్న ద్రేక్కాణాధిపతులు నవమ, లగ్న పంచమాధిపతులనియు ద్విస్వభావలగ్నమునకు పంచమ, నవమ, లాభాధిపతులు ద్రేక్కాణాధిపతులనియు కొందరందురు.
 *లగ్నము ద్వాదశాంశము*
 *శ్లో:-* మేషః కర్కటక స్తూలాచ మకరః స్వస్వాదయో రాశయ
       స్స్వస్యస్యాత్మజధర్మ యోశ్చనవతద్భాగానవాంశాఃక్రమాత్
       యల్లగ్నంచ తదాదిసర్వనిలయా స్సద్వాదశాంశాఃక్రమా
       త్తత్తద్రాశ్యథిపా స్తందంశపతయ స్స్యువర్ద్వాదశాంశాభిథాః
*తాత్పర్యము:-* నవాంశ యనగా లగ్నమును 9 భాగములు చేయుట, మేష, సింహ, ధనుస్సులకు మేషాదిగను, కర్కాటక, వృశ్చిక, మీనములకు కర్కాటాకదిగను, వృషభ, కన్యా, మకరములకు మకరాదిగను, తులా, మిథున, కుంభములకు తుల మొదలుగను నవాంశాధిపతులుగ గుణించ లగ్నమందు 12 భాగములు చేసినచో 12వ భాగాధిపతయే ద్వాదశాంశాధిపతి యగును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: