గృహప్రవేశము_ఎలాచేయాలి?

# గృహప్రవేశము_ఎలాచేయాలి?

శ్లో "అకవాట మానాచ్చన్న మభుక్త బలి భోజనం
గృహం న ప్రవిశేద్ధిమానా పదమా కరంహి తత్"

వాస్తురాజవల్లభం: 

ద్వారాలు లేకుండా, పైకప్పు లేకుండా, వాస్తుశాంతి, వాస్తుహోమము లేకుండా, 8 దిక్కులలో బలిలేకుండా, బందువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశము చేయరాదు. సత్యనారాయణ వ్రతం రోజునయినా భోజనాలు పెట్టాలి. 
శాంతికమళాకారము, బృహద్వా స్తుమాలా, ధర్మ సింధు, నిర్ణయసింధూ, కాలామృతము, మొదలైన గ్రంధాలలో గృహప్రవేశము ముందు వాస్తుశాంతులు చేయకుండా యజమాని గృహప్రవేశము చేయరాదని గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇల్లునిర్మాణము చేసేటప్పుడు క్రిమికీటకాల హింస, చెట్లు నరికినదోషము, అంతర్గత శల్యదోషాలు, ఆయాది దోషము, ముహూర్త దోషము, కాకిప్రవేశ దోషము, భూతప్రేతపిశాచ ప్రవేశము పోవాలంటే వాస్తుదోషాలకు, తగిన శాంతి హోమాలుచేసి తరువాత శుభమూహర్తంలో గృహప్రవేశము చేయాలి ఇది శాస్త్రము. 
ఈ విధంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో చేస్తారు ఈనాడు గృహప్రవేశాలు మరీ దారుణంగా చేస్తున్నారు. శుభముహూర్త సమయంలో ముందుగా గోవు, దంపతులు గృహంలో కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి కానీ ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాడు అదిిదీ చెప్పులతో ఇలా అందరుకాదు కొంతమంది. గుమ్మం దగ్గరే చెప్పులు, బియ్యము గ్లాసు కాలితో తన్ని లోపలికి పోవటం ఇవి దోషము, సాంప్రదాయ వస్త్రాలు ధరించకుండా, ఆడవారు కాలికి పసుపురాసుకోకుండా గృహప్రవేశం చేసేస్తున్నారు, ఆగ్నేయంలో వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లో పొంగించడం చేస్తున్నారు, సింహద్వారానికి పసుపురాసి బొట్లుపెట్టకుండా, మామిడిఆకులు కట్టకుండా ప్రవేశం చేస్తున్నారు
కొంతమంది పుణ్యాహవాచనము, ఏకాశీతి పదవాస్తు మండపారాధన చేయకుండా పూజముగిస్తున్నారు. గృహ ప్రధాన ద్వారాము తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశము చేయాలి అంతవరకు మూసి ఉంచాలి. ప్రవేశం ముందు దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండటానికి రాత్రి గృహ ప్రవేశము ఐతే ఉదయము నూతన గృహంలో వాస్తు శాంతి చేయవలెను. వాస్తు శాంతి రాత్రి, సాయంత్రము చేయరాదు. గృహ ప్రవేశము, రాత్రి పూట, పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయక పోవడానికి కారణము మంచి శకునం కాజాలదని, రాత్రి ఎవ్వరు తిరగరని ఎక్కువగా రాత్రి గృహప్రవేశం చేస్తున్నారు. గృహప్రవేశము చేసిన వారు రాత్రి అంతా జాగరణ చేయాలి సూర్యోదయం వరకు నిద్రపోరాదు. ఎందుకంటే ఆ గృహము కూడా నిద్రావస్థను పొదుతుందని పెద్దలు చేెప్పినారు. మూడురోజులు తప్పకుండా ఉదయము సాయంత్రము నూతన గృహంలో దీపారాధన చేయవలెను. ఒకవేళ మైలసోకిన 5 రోజులు ఆపివేసి మరల చేయవలెను. పాలు పొంగించడానికి తొడబుట్టిన చెల్లెలు లేదా అక్క చేత పాలుపొంగించవలెను. వారులేకపోతే పెళ్లయిన కూతురు చేత పాలుపొంగించవలెను. వారులేకపోతే సోదరి వరస ఐనవారు ఎవరైనా పాలుపొంగించాలి. పాలుపొంగించినవారికి పసుపు కుంకుమతో వస్త్రాలు పెట్టవలెను. వాస్తు శాంతి పూజ విధానము గణపతిపూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యసంస్కారము, ఏకాశీతి పదమండల వాస్తుపూజ, నవగ్రహ మండపారాధన,లక్ష్మీ గణపతి, రుద్ర, నవగ్రహ, వాస్తు, హోమాలు, వాస్తుపర్యగ్నికరణ, బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైన పూజలు చేయవలెను.

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: