గృహవాస్తు - కొన్ని ముఖ్య విషయాలు

*గృహవాస్తు - కొన్ని ముఖ్య విషయాలు* 
లోగిలి యందు నీరు తూర్పుదిశకు వెళ్ళుట వృద్ధికరం. ఉత్తరదిశగా వెళ్లుట ధనప్రదం, పడమట దిశ యందుట ప్రవహించుట ధనక్షయం, దక్షిణదిశకు నీరుపోవుట మృత్యుపదం. గృహనిర్మాణం చేయు భూమి దక్షిణ, పశ్చిమాలు ఎత్తుగా ఉండటం శుభపరిణాము, తూర్పు, ఉత్తరములు పల్లముగా వుండవలెను. తిధి వృద్ది క్షయముల యందు రోగగ్రస్తులగా ఉన్నప్పుడు, భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు, రాజాటంకం కలిగినప్పుడు, భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, తనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు, దుస్వప్నములు, దుశ్శకునాలు కనిపించినప్పుడు, ఇంట్లో మైల ఉన్నప్పుడు, అమావాస్య దగ్గర్లో, వర్జ్య ఘడియల్లో శంఖుస్థాపన నిషిద్దం.
గృహం అతిఎత్తైనది అయితే చోరభయం, అతికూరచ అవుటవల్ల దరిద్రం. అతి వెడల్పు వలన మరణం సంభంవించును.
ఆయష్షు కోరుకునే వారు తూర్పుముఖంగా, కీర్తికాముకులు దక్షిణముఖముగా, ఐశ్వర్యకాముకులు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయవలెను. తల్లిదండ్రులు జీవించి ఉన్నవాడు, తల్లి కాని తండ్రి కాని జీవించి ఉన్నవాడు కూడా దక్షిణ ముఖంగా తిరిగి భోజనం చేయరాదు. ఇదియే గృహము నందు భోజన నియమము. 

స్వగృహము నందు తూర్పు తలగడ, అత్తవారింట దక్షిణ తలగడ, ఇతరచోట్ల పడమర తలగడ పెట్టుకుని పడుకోవలెను. 

ఉత్తర తలగడగా ఎప్పుడూ పడుకోగూడదు. గడ్డియందు, దేవాలయం, పాషాణం, పల్లపు ప్రదేశం, మార్గము, ద్వారం, గృహమధ్య ప్రదేశం, ఒంటరిగా, స్మశానం, నాలుగు దార్లు కలిసేచోట, ఇంటి దూలం క్రింద, తన మరియు పర స్త్రీల సమీపం నందు పడుకోరాదు.
గృహమధ్యమం నందు వృక్షాలు ఉండరాదు. తులసి ఉండవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: