శిశువు ఆయుర్దాయం
లగ్నే భాస్కర పుత్రశ్చ
నిధనే చంద్రమా యది
తృతీయస్తో యధాజీవః
స యాతి యమమన్దిరమ్
జన్మ లగ్నమందు శని, అష్టమంలో చంద్రుడు, తృతీయంలో గురువు ఉన్న సమయమున జన్మించిన శిశువు శీఘ్రముగా మరణించును.
పాపాన్విత శ్శశీ ధర్మే
ద్యూనలగ్నగతో యది
శుభైరవీక్షితయుత స్తధా
మృత్యుప్రదశ్శిశోః
చంద్రుడు పాపయుతుడై లగ్న, సప్తమ, భాగ్యములలో ఉండగా శుభ సంబంధము లేనట్లయితే శిశువు మరణించును.
పాపయోర్మధ్యగశ్చంద్రో
లగ్నాష్టాన్తిమసప్తగః
అచిరాన్ మృత్యుమాప్నోతి
యో జాతస్సశిశుస్తధా
చంద్రుడు పాపగ్రహ మధ్యగతుడై లగ్న , అష్టమ, వ్యయ, సప్తమాలలో ఉన్నచో శిశువు శీఘ్రముగా మరణించును. ( శుభ వీక్షణ ఉండరాదు)
శనైశ్చరార్క భౌమేషు
రిఃఫధర్మాష్టమేషుచ
శుభైరవీక్ష్యమాణేషు
యో జాతో నిధనం గతః
జన్మ లగ్నం నుండి శని, రవి, కుజుడు క్రమంగా 12, 2, 8 భావాలలో ఉండి, శుభ వీక్షణ లేనివారైతే శిశువు శీఘ్రముగా మరణించును.
యద్ద్రేక్కాణే చ జామిత్ర్రే
యస్య స్యాద్దారుణో గ్రహః
క్షీణ చంద్రో విలగ్నస్థో
సద్యో హరతి జీవితమ్
జనన సమయంలో సప్తమ భావ ద్రేక్కాణమందు పాపగ్రహములుండగా, లగ్నమందు క్షీణ చంద్రుడున్నచో శిశువు శీఘ్రముగా మరణించును.
Comments
Post a Comment