గృహవాస్తు - బెడ్ రూమ్ వాస్తు దోషాలు*

గృహవాస్తు - బెడ్ రూమ్ వాస్తు దోషాలు* 
 ఒక గృహంలోని నైరుతి దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండి, ఆ బెడ్ రూమ్ లో నైరుతి దిక్కులో బాత్రూం లేదా టాయిలెట్ నిర్మించబడి ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి హృదయ సంబంధ వ్యాధులు రావడం, హార్ట్ ఎటాక్ వల్ల అకాల మృతి రావడం సంభవిస్తుంది.
  ఒక గృహంలోని వాయువ్యదిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండి, ఆ బెడ్ రూమ్ లో వాయువ్య దిక్కులో టాయిలెట్ నిర్మించబడి ఉన్నట్లయితే, ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల వ్యాధులు కానీ క్యాన్సర్ గాని వస్తుంది. ఒక గృహంలోని ఈశాన్య దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండి ఆ బెడ్ రూమ్ లో ఈశాన్య దిక్కులో టాయిలెట్ లేదా బాత్రూం నిర్మించబడి ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
 ఒక గృహంలోని ఆగ్నేయ దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండి ఆ బెడ్ రూమ్ లో ఈశాన్య దిక్కులో టాయిలెట్ నిర్మించబడి ఉన్నట్లయితే, ఆ ఇంట్లో నివసిస్తున్న స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది.
ఒక గృహంలోని దక్షిణ దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండి ఆ బెడ్ రూమ్ లో ఈశాన్య దిక్కులో టాయిలెట్ లేదా బాత్రూం నిర్మించబడి ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి ఉదర సంబంధ క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: