పంచ సరోవరాలు - 2. పంపా సరోవరం*

_*పంచ సరోవరాలు…*_
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*2. పంపా సరోవరం*

పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపీలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.ఆ కథ ప్రకారం,ఒకటి అయిన శబరి,పంపా నదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
సీతాన్వేషణలో కబంధుని సూచననుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు.రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితు రాలిన శబరీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్య పాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది.
“శ్రీరామచంద్రమూర్తి మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికీ తపసిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓపురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించి నట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్ధరాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మాతంగ ముని శిష్యులకు సేవ చేస్తుండే దానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచి మాకోసం ఎదురు చూస్తూ పండ్లు, ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి, నువ్వు, నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి” అని అభ్యర్థించగా, శ్రీరాముడు, “శబరీ! కబంధుడు నేఏ గురించి, నీ గురువుల గురించి చెప్పాడు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుప వలసింది” అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.
“ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఆ మతంగా వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను తమ శక్తి వలన చేసేవారు. వారి తపఃప్రభావం వలన ఈ ప్రాంత మంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపాసరస్సులోకి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు” అని చెప్పి. తాను సేకరించిన ఫలాలను అందించింది.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: